జూనియర్ లాయర్‌ను పోలీస్ కస్టడీకి పంపిన జడ్జి.. సుప్రీంకోర్టుకు చేరిన వివాదం!

Publish Date:May 8, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. న్యాయమూర్తి ఎదుట అనుచితంగా ప్రవర్తించారన్న కారణంతో ఒక జూనియర్ న్యాయవాదిని నేరుగా పోలీస్ కస్టడీకి పంపడం ఇప్పుడు న్యాయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కోర్టు హాల్‌లోనే జరిగిన ఈ హైడ్రామా ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది.

వివరాల్లోకి వెళ్తే.. హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా  జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  ఆయన కొంత అసహనానికి గురయ్యారు.  ఆ క్రమంలో న్యాయవాది  తన  గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే  కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఆ సందర్భంగా న్యాయవాది  జడ్జిని క్షమించమని కోరారు. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఒకింత అనుచితంగా ప్రవర్తించానని వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయినా జడ్జి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.  కనీసం 10 ఏళ్ల అనుభవం  లేని జూనియర్ ఇలా ప్రవర్తించడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటన పెను సంచలనం రేకెత్తించింది.  ఒక న్యాయవాదిని నేరుగా కస్టడీకి పంపడంపై బార్ కౌన్సిల్ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తుల పట్ల గౌరవం ఉండాల్సిందేనని..  అయితే తక్షణమే కస్టడీకి ఆదేశించడం కఠినమైన చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కూడా దీనిపై స్పందించే అవకాశం ఉంది. జూనియర్ లాయర్లపై ఇలాంటి చర్యలు తీసుకోవడం వారి కెరీర్‌ను దెబ్బతీస్తుందని న్యాయవాదుల సంఘాలు అంటున్నాయి.

కోర్టు హాల్ మర్యాదలు,  న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సంబంధాలపై ఈ ఘటన పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? ఏపీ హైకోర్టులో జరిగిన ఈ సంఘటనకు ముగింపు ఎక్కడ? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. న్యాయవ్యవస్థలో క్రమశిక్షణ అవసరమని భావించే వారు జడ్జి నిర్ణయాన్ని సమర్థిస్తుండగా..  మానవతా దృక్పథం ఉండాలని మరికొందరు కోరుతున్నారు.

By
en-us Political News

  
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు. ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
వేద పండితులు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పెన్నా నది తీరం నుండి పుట్టిమట్టి తీసుకొచ్చి అమ్మవారి ప్రతిబింబాన్ని ప్రతిష్టించి జలాలతో అభిషేకాలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.