అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు

Publish Date:May 8, 2026

Advertisement

అమెరికా, ఇరాన్  మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెచ్చరిల్లాయి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న అమెరికా యుద్ధనౌకకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ డ్రోన్‌ను అమెరికా రక్షణ దళాలు విజయవంతంగా కూల్చివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే, అమెరికాకు చెందిన  యుఎస్ఎస్ బాక్సర్  అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా..  ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్..  నౌకలోని సిబ్బందికి,  నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ముందుకు రావడంతో, ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా అమెరికా సైన్యం ఆ డ్రోన్‌ను పేల్చివేసింది.

ఈ పరిణామంపై శ్వేతసౌధం నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం.. ఇరాన్ ఉద్దేశపూర్వకగానే అమెరికా నౌకలపై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ట్రంప్ విమర్శించారు. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ, శాంతి భద్రతలను విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను సహించేది లేదని   హెచ్చరించారు. తమ సిబ్బందిని, ఆస్తులను రక్షించుకోవడానికి అమెరికాకు పూర్తి హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.

గత కొద్దికాలంగా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు సరఫరాకు అత్యంత ప్రధానమైన హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు అమెరికాకు కంటగింపుగా మారాయి. గతంలో కూడా ఇరాన్ ఇలాంటి డ్రోన్లను అమెరికా నిఘా ప్రాంతాల్లోకి పంపడం, ప్రతిగా అమెరికా ఆంక్షలు విధించడం వంటి పరిణామాలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి.

 ఇరాన్  అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. అమెరికాయే కాల్పుల విరమణను ఉల్లంఘించి తమ నూనె ట్యాంకర్ సహా రెండు నౌకలపై దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. దానికి ప్రతిస్పందనగానే తాము అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్, బందర్ అబ్బాస్ వంటి నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న తాత్కాలిక ప్రశాంతతకు తెరపడి, యుద్ధ వాతావరణం నెలకొంది.

By
en-us Political News

  
ఈ లీగల్ బ్యాటిల్‌లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే 5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను జారీ చేసింది. మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం.
బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ బ్యాంకు రుణాలకు గ్యారెంటీగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు తాకట్టు పెట్టారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.