ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శుక్రవారం (మే 8) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో కేకేఆర్ అలవోక విజయం సాధించింది. ముఖ్యంగా కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విధ్వంసకర సెంచరీతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో పాతుమ్ నిస్సంక అర్ధ సెంచరీతో రాణించగా, అశుతోష్ శర్మ 39 పరుగులు చేయడంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో రెండు వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశారు.
143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే, అంగ్‌క్రిష్ రఘువంశీ త్వరగానే ఔటయ్యారు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పారు. ముఖ్యంగా అలెన్ బౌండరీల కంటే సిక్సర్లకే ప్రాధాన్యత ఇస్తూ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు పూర్తి చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
అలెన్‌కు కామెరాన్ గ్రీన్ 33 పరుగులు.. సంయమనంతో ఆడుతూ సహకారం అందించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఢిల్లీ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్ వేసిన ఒకే ఓవర్‌లో అలెన్ మూడు సిక్సర్లు బాదాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో సిక్సర్‌తో అలెన్ తన సెంచరీని, జట్టు విజయాన్ని ఒకేసారి పూర్తి చేయడం విశేషం. దీంతో కేకేఆర్ మరో 34 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fin-allen-sixers-fest-in-delhi-36-219270.html
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
వేద పండితులు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పెన్నా నది తీరం నుండి పుట్టిమట్టి తీసుకొచ్చి అమ్మవారి ప్రతిబింబాన్ని ప్రతిష్టించి జలాలతో అభిషేకాలు చేశారు.