ఆమె హృదయం సంచిలో ఉంది..

Publish Date:Jun 14, 2021

Advertisement

లబ్ డబ్ శబ్దం వింటూ జీవితాన్ని లయబద్ధంగా కొనసాగిస్తాం. మరి ఆ శబ్దం ఆగిపోతే... జీవితం ఆగిపోతుందా.. ఆగిపోదు అని నిరూపిస్తున్నారు సెల్వా హుస్సేన్. 39 ఏళ్ల సెల్వా శరీరం లోపల గుండె లేకపోయినా గుండెధైర్యంతో జీవితాన్ని కొనసాగించవచ్చని కృత్రిమ గుండెను బ్యాగ్ లో మోస్తూ చిరునవ్వుతో ఎందరికో స్ఫూర్తి నిస్తున్నారు. ఆమె ప్రపంచంలోనే కృత్రిమ గుండెతో జీవిస్తున్న రెండవ మహిళ సెల్వా( మొదటి మహిళ కాథ్లీన్ షోర్స్ ) బ్రిటన్ రాజధాని లండన్ లోని ఇల్ఫోర్డ్ లో నివసించే సాధారణ మహిళ సెల్వా హుస్పేన్. భర్త, ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలో పెనుతుఫాన్. చిన్నపాపాయికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడు ఆమె అనారోగ్యం బారిన పడ్డారు. ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. ఫ్యామిలీ డాక్టర్ ను కలవడానికి ఇంటి నుంచి కాస్త దూరం నడిచారు. అంతే అడుగు ముందుకు పడలేదు. వెంటనే లండన్‌లోని హేర్‌ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి హార్ట్ లో సమస్య ఉందని వెంటనే మరో గుండెను అమర్చాలని చెప్పారు. ఆమె ప్రాణాలు నిలబడాలంటే మరో గుండె కావల్సిందే. అయితే గుండె దాతల కోసం అప్పటికే వందలాది మంది ఎదురుచూస్తున్నారు. సెల్వా పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. మరో గుండె అనేది సాధ్యమయ్యే విషయంగా కనిపించలేదు. దాంతో కృత్రిమ గుండె అమర్చడానికి డాక్టర్ల బృందం సిద్ధపడింది. 27 జూన్ 2017న హేర్ ఫీల్డ్ సర్జరీ డిపార్ట్ మెంట్ హెడ్ ఆండ్రీ సైమన్, సర్జన్ డయానా గార్సియా సాజ్ ఆధ్వర్యంలో ఆరుగంటల పాటు జరిగిన ఆపరేషన్ లో ఆమె గుండెను తొలగించారు. దాని స్ఠానంలో కృత్రిమ గుండె కవాటాలను ఇంప్లాట్ చేశారు. దానిని పని చేయించే యంత్రాంగాన్ని శరీరం వెలుపల ఏర్పాటు చేశారు.

 

ఆపరేషన్ తర్వాత నెలరోజుల పాటు సెల్వా ఆసుపత్రిలోనే ఉన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో నడవడం, మాట్లాడటం, తినడం, తాగటం, కండరాల బలాన్ని పెంపొందించుకోవడం తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. పుట్టుకతో తన శరీరంలో ఉన్న గుండెను ఆసుపత్రిలో వదిలేసి కృత్రిమ గుండెతో ఇంటిదారి పట్టారు. ఆ తర్వాత  భర్త, పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నారు. ఆమె గుండె స్థానంలో ఏర్పాటుచేసిన కృత్రిమ గుండె  నిమిషానికి 138 సార్లు కొట్టుకుంటుంది. ఈ హృదయ స్పందనలతో శరీరమంతా రక్త ప్రసరణ జరుగుతుంది. సెల్వాను సజీవంగా ఉంచుతుంది. ఈ గుండెను పనిచేయించే పరికరాన్ని మాత్రం ఎప్పుడు ఆమెతో ఉండేలా బ్యాగ్ లో అమర్చారు.  6.8 కిలోల బరువున్న ఈ బ్యాగ్ ను ఆమె అనుక్షణం తనతో ఉంచుకోవాల్సిందే. ఇందులోని పరికరం రెండు బ్యాటరీలతో ఉంటుంది, ఇది ఎలక్ట్రిక్ మోటారు , పంపు ద్వారా ఆమె శరీరంలో రక్త ప్రసరణ కోసం ఛాతీలోని ప్లాస్టిక్ సంచిలోకి జతచేయబడిన గొట్టాల ద్వారా గాలిని నెట్టివేస్తాయి. ఇందులో బ్యాటరీ ఆగిపోతే కేవలం నిమిషంన్నరలోనే తిరిగి బ్యాటరీ అమర్చాలి. లేకపోతే ఆమె శరీరంలో రక్తప్రసరణ ఆగిపోతుంది. ఆమెతో పాటు భర్త ఉంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాడు.

 

జీవితంలో చిన్నచిన్న సమస్యలకే మనం బాధపడిపోతాం. కానీ, శరీరంలో ఎంతో కీలకమైన గుండె లేకపోయినా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. తన ప్రాణాలను కాపాడే కృత్రిమ గుండెను భుజానికి తగిలించుకుని  చిరునవ్వుతో జీవిస్తున్న సెల్వాకు హాట్సాఫ్..

By
en-us Political News

  
విటమిన్ B12 లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, అలసట, తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయా? ఈ పోషక లోపం లక్షణాలు, కారణాలు మరియు తీసుకోవాల్సిన ఆహారాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రెగ్నెన్సీ సమయంలో ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే 5 సులువైన ఇంటి చిట్కాలు మరియు జాగ్రత్తల పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఉదయం పూట ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు, బరువు తగ్గడానికి దీన్ని ఎలా త్రాగాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
బాదం, పిస్తా కంటే తక్కువ ధరలో లభించే వేరుశనగల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. చలికాలంలో రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, బరువు నియంత్రణ మరియు పోషక వివరాల పూర్తి సమాచారం.
చెవి నొప్పి మరియు గ్రేడ్ 2 టింపానిక్ మెంబ్రేన్ రిట్రాక్షన్ సమస్యతో బాధపడుతున్నారా? ఆయుర్వేద నిపుణుల సలహాలు, షడ్బిందు తైలం నస్య కర్మ, గృహ చికిత్సలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి సమాచారం తెలుసుకోండి.
ఉడికించిన గుడ్లు వర్సెస్ ఫ్రైడ్ ఎగ్స్.. ఏ పద్ధతిలో వండుకుంటే శరీరానికి ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది? బరువు తగ్గడానికి ఏది మంచిది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
యూరప్‌లో ఒక చిన్నారి నేర్పిన జీవిత పాఠం! గెలుపుతో పాటు ఓటమిని, వద్దు అనే తిరస్కారాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిపే అద్భుతమైన స్ఫూర్తిదాయక వెబ్ స్టోరీ కథనం.
మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉపయోగపడుతుంది? మెరిసే, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి సింపుల్ DIY ఫేస్ మాస్క్‌లు మరియు అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ పూర్తి వివరాలు.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుందనే అపోహ నిజమేనా? చల్లటి నీరు, తడి జుట్టు మరియు రోజూ షాంపూ వాడకం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
కాలుష్య గాలిలో ఒక గంటపాటు ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై పడే తీవ్ర ప్రభావం గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
చలికాలంలో గాలిలో తేమ తగ్గి పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు పొడిబారకుండా కాపాడుకోవడానికి 7 సులభమైన దినచర్య అలవాట్లు మరియు నిపుణుల చిట్కాలను తెలుసుకోండి.
షుగర్ పేషెంట్లు రాత్రి పూట డిన్నర్ లోకి రైస్ తినాలా లేదా చపాతీ తినాలా? ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలు మరియు కార్బోహైడ్రేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.