సంజు శాంసన్ హీరోచిత సెంచరీ.. చెన్నైకి తొలి విజయం

Publish Date:Apr 11, 2026

Advertisement

వరుస పరాజయాల తరువాత చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా పుంజుకుంది.   సొంత గడ్డపై శనివారం (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేస్తూ ఈ సీజన్‌లో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ వీరోచిత శతకంతో చెలరేగగా, బౌలింగ్ విభాగంలో జేమీ ఓవర్టన్ పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

చెన్నై  చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నైతొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.  నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శాంసన్‌కు తోడుగా యువ ఆటగాడు ఆయుష్ మాత్రే అద్భుతమైన సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆయుష్ 36 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు పునాది వేశాడు. చివర్లో శివమ్ దూబే మెరుపులు మెరిపించడంతో చెన్నై స్కోరు 200 మార్కు దాటేసింది. ఈ సెంచరీతో సీఎస్‌కే తరఫున శతకం బాదిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజు చరిత్ర సృష్టించాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో ధాటిగానే ఆడింది. ఓపెనర్లు పాథుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ జట్టుకు మంచి పునాది వేశారు. అయితే మధ్య ఓవర్లలో చెన్నై బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా జేమీ ఓవర్టన్ తన అద్భుత స్పెల్‌తో 4 కీలక వికెట్లు తీసి ఢిల్లీ ఢిల్లీ పతనాన్ని శాసించాడు.

మరోవైపు అన్షుల్ కంబోజ్ 3 వికెట్లతో రాణించగా, అరంగేట్రం చేసిన గుర్జప్‌నీత్ సింగ్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ 60 పరుగులతో చేసిన ఒంటరి పోరాటం వృధా అయ్యింది.   చివరకు ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులకే పరిమితమై, 23 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తన ఖాతా  తెరిచింది. గత కొన్ని మ్యాచ్‌లుగా చెపాక్ మైదానంలో ఎదురవుతున్న ఓటముల పరంపరకు ఈ గెలుపుతో బ్రేక్ పడింది. సంజు శాంసన్ ఫామ్‌లోకి రావడం, బౌలింగ్ దళం సమష్టిగా రాణించడం సీఎస్‌కే అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.  

By
en-us Political News

  
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, టెక్నాలజీ ప్రభావం సమాజంలోని ప్రతి వర్గానికీ ఎలా చేరుతోందో చూపించే ఆసక్తికర ఉదాహరణ ఇది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో ఓ రైతు పొలం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం—ప్రాణ భద్రత.
77 ఏళ్ల గణపతి ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అంటే డయాబెటిస్, కీళ్లనొప్పులు, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ ఆయనను అడవుల నుంచి బయటకు పంపిందని సమాచారం.
అమెరికా విధించిన రెడ్ లైన్స్ వెనుక బలమైన కారణం ఉందన్న జేడీ వాన్స్, ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని సాధిస్తే, అది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం ఒక్క అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచ శాంతికే ముప్పన్నారు.
హైదరాబాద్ వాతావరఖ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. . రానున్న పది రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ దుర్ఘటనలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాస్ రావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ వార్త న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు.
నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ (ఈ3) కార్యక్రమం చేపడతామన్నారు.
బీహార్‌కు చెందిన యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడుతున్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు. 2025-26 సంవత్సరాల్లో గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, నెటిజన్లు సూర్యవంశీ గురించి పలు ప్రశ్నలు సంధించారు. అందులో మొదటిది- వైభవ్.. వయసు, పుట్టిన తేదీ వివరాలు. ఇది నెటిజన్లు వేసిన టాప్ క్వశ్చిన్ గా నిలుస్తోంది. కేవలం 13-14 ఏళ్లకే ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఆడటం వల్ల వైభవ్ సూర్యవంశీ రియల్ ఏజ్ అనే పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.
సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల్లో నిజ‌ముందని తేల్చింది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 146 మంది ఎంపీలు లోక్‌సభలో సంతకాలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.