ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం.. ఇక ఇరాన్ పై అమెరికా సైనిక చర్యేనా?

Publish Date:Apr 11, 2026

Advertisement

అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చల్లో ఇరాన్ అమెరికా విధించిన కఠినమైన నిబంధనలను అంగీకరించలేదు.  దాదాపు 21 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో అమెరకా ఉపాధ్యక్షుడు డీన్ వాన్స్ పాల్గొన్నారు.  అమెరికా విధించిన నిబంధనల విషయంలో  ఇరాన్ మొండి పట్టుదలకు పోతోందని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు చెప్పారు.  ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల తయారీని పూర్తిగా నిలిపివేయాలన్న ట్రంప్ షరతుకు ఇరాన్ నో అంటోందంటున్నారు.  

అమెరికా విధించిన  రెడ్ లైన్స్  వెనుక బలమైన కారణం ఉందన్న  జేడీ వాన్స్, ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని సాధిస్తే, అది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం ఒక్క అమెరికాకు మాత్రమే  కాదు ప్రపంచ శాంతికే ముప్పన్నారు. ఇక ఇరాన్ పై అమెరికా తదుపరి వైఖరి ఏమిటన్నది అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ నిర్ణయిస్తారన్న జేడీ వాన్స్  సైనిక చర్యపై పరోక్ష సంకేతాలిచ్చారు.  ఇప్పటికే మధ్యప్రాచ్యానికి అమెరికా తన యుద్ధ విమానాలను, విమాన వాహక నౌకలను పంపిన నేపథ్యంలో ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

అదలా ఉండగా..  ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాత్రం చర్చలు 'నిర్మాణాత్మకంగా' సాగాయని, కొన్ని ప్రాథమిక సూత్రాలపై అంగీకారం కుదిరిందని చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్ అయితే ఈ చర్చలను కంటితుడుపు చర్యగా కొట్టి పారేసింది.   . అమెరికా ఆంక్షల నుండి విముక్తి పొందాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంటే.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెడితేనే అది సాధ్యమని ట్రంప్ ప్రభుత్వం కరాఖండీగా చెబుతోంది.  

చర్చల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం ఇస్లామాబాద్ లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా నిరోధించడమే అమెరికా ప్రధాన లక్ష్యమన్నారు.  ఈ దిశగా  ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించామనీ,  దురదృష్టవశాత్తు పురోగతి సాధించలేకపోయామనీ అన్నారు.  ప్రస్తుతం చర్చల నుంచి వైదొలుగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అని పరోక్షంగా ఇరాన్ పై సైనిక చర్య తప్పదన్న సంకేతాలిచ్చారు. 

By
en-us Political News

  
సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం—ప్రాణ భద్రత.
77 ఏళ్ల గణపతి ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అంటే డయాబెటిస్, కీళ్లనొప్పులు, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ ఆయనను అడవుల నుంచి బయటకు పంపిందని సమాచారం.
హైదరాబాద్ వాతావరఖ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. . రానున్న పది రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నైతొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ దుర్ఘటనలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాస్ రావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ వార్త న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు.
నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ (ఈ3) కార్యక్రమం చేపడతామన్నారు.
బీహార్‌కు చెందిన యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడుతున్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు. 2025-26 సంవత్సరాల్లో గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, నెటిజన్లు సూర్యవంశీ గురించి పలు ప్రశ్నలు సంధించారు. అందులో మొదటిది- వైభవ్.. వయసు, పుట్టిన తేదీ వివరాలు. ఇది నెటిజన్లు వేసిన టాప్ క్వశ్చిన్ గా నిలుస్తోంది. కేవలం 13-14 ఏళ్లకే ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఆడటం వల్ల వైభవ్ సూర్యవంశీ రియల్ ఏజ్ అనే పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.
సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల్లో నిజ‌ముందని తేల్చింది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 146 మంది ఎంపీలు లోక్‌సభలో సంతకాలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించారు.
వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కస్టమర్లను సంప్రదించి ఆర్డర్లు స్వీకరించేవారని పోలీసులు తెలిపారు. చెల్లింపులు ఫోన్ పే ద్వారా తీసుకుని, సరుకును రాపిడో, పోర్టల్ డెలివరీ సేవలతో పంపిణీ చేస్తున్నట్లు విచారణలో తేలింది.
టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 74) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 38 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించారు.
ఇరాన్ నుండి పాకిస్థాన్ మీదుగా భారత్‌కు సహజ వాయువును అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును పది బిలియన్ డాలర్ల వ్యయంతో 2,700 కిలోమీటర్ల పొడవుతో ఈ పైల్ లైన్ చేపట్టాలని భావించారు.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తన మీడియా సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందన్న విజయసాయి.. తన మీడియా ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదనీ, ప్రజల సమస్యలపైనే గళమెత్తుతుందనీ చెబుతున్నారాయన. రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాల గొంతుకగా తన మీడియా సంస్థ నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తుందని చెప్పారు విజయసాయి.
అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగడం పట్ల జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత రవాణా అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్న ఆయన.. దీనిని అడ్డుకోవడం మంచిది కాదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.