సచిన్ కోహ్లీ రికార్డులు.. ఇక మిగలవా?
Publish Date:Apr 11, 2026
Advertisement
బౌలర్ ఎవరో చూసేదే ల్యా.. బాలు కనిపించిందా లేదా? దాన్ని ఎంత దూరం తరమాలి? ఇదీ వైభవ్ సూర్యవంశీ గురించి క్లుప్తంగా చెబితే. దీంతో పెద్ద పెద్ద బూమ్రాలు సైతం అతడి బ్యాటింగ్ దెబ్బకు గింగిరాలు తిరుగుతున్నారు. దీంతో వైభవ్ సూర్యవంశీ నెటిజన్ల హాట్ టాపిగ్గా మారిపోయాడు. అతడి గురించి గూగుల్ లో ఎలాంటి ప్రశ్నలు సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు? అంటే.. సచిన్, కోహ్లీ వంటి వారి రికార్డులకు ఇప్పట్లో వచ్చిన ఢోకా లేదని భావించిన ప్రపంచ క్రికెట్ అభిమానులకు.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ని బట్టీ చూస్తుంటే.. బాప్ రే.. ఎవరితడు? ఈ వయస్సులో ఏమా, టాలెంట్, ఆ సత్తా వెనక దాగిన విధ్వంసం? ఆపై అతడికి ఇంతటి కెపాసిటీ ఎక్కడిదంటూ.. గూగుల్ సెర్చింజన్ని ఒకటే తవ్వేస్తున్నారు నెటిజన్లు. వాటిలో బాగా ఎక్కువ సెర్చ్ చేసిన క్వశ్చన్లేంటన్నది ఇప్పుడు చర్చగా మారింది. బీహార్‌కు చెందిన యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడుతున్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు. 2025-26 సంవత్సరాల్లో గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, నెటిజన్లు సూర్యవంశీ గురించి పలు ప్రశ్నలు సంధించారు. అందులో మొదటిది- వైభవ్.. వయసు, పుట్టిన తేదీ వివరాలు. ఇది నెటిజన్లు వేసిన టాప్ క్వశ్చిన్ గా నిలుస్తోంది. కేవలం 13-14 ఏళ్లకే ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఆడటం వల్ల వైభవ్ సూర్యవంశీ రియల్ ఏజ్ అనే పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. అంటే వైభవ్ సూర్యవంశీ అసలు వయస్సు ఎంత? అని సెర్చ్ చేస్తున్నారట నెటిజన్లు. అధికారికంగా వైభవ్ పుట్టిన రోజు గురించి అడగ్గా ఆ డేట్ ఇదిగో.. 2011 మార్చి 27న జన్మించినట్టు చెబుతోంది గూగుల్. ఇక వైభవ్ వయసు వివాదం. వైభవ్ వయస్సుపై గతంలో సోషల్ మీడియాలో కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఆయన ఫిజికల్ పవర్ పై పాత ఇంటర్వ్యూలను బట్టి కొందరు వివాదాలు లేవనెత్తారు. దీంతో వైభవ్ సూర్యవంశి అసలు వయసు అదేనా!? అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. దీంతో బీసీసీఐ బోన్ డెన్సిటీ టెస్ట్ నిర్వహించింది. సూర్యవంశీ వయసు అదేనని నిర్దారించింది. వైభవ్ సూర్యవంశీ గురించి అడిగే మరో ప్రశ్న.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించడంతో, ఆయన ఎంతకు అమ్ముడయ్యారో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపారు. దీంతో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ప్రైజ్ 20252026 సీజన్ అని ప్రశ్నిస్తున్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్ వైభవన్ ను రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ఈ సీజన్లో వైభవ్ దంచి కొడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో 17 బాల్స్ కి 52 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్ లో 18 బాల్స్ కి 31. మూడో మ్యాచ్ లో 14 బాల్స్ లో 39, నాలుగో మ్యాచ్ లో 26 బాల్స్ లో 78 పరుగులు చేశాడు. అంతేనా.. 11 సిక్సర్లతో రికార్డు కూడా తిరగరాశాడు. ఇలా చెలరేగిపోతున్న వైభవ్ బ్యాటింగ్ శైలిని కోహ్లీతో పోల్చుకుంటున్నారు కొందరు. దీంతో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్ ఎవరని కామెంట్ చేస్తున్నారు. అయితే అండర్ నైన్టీన్ లో ఫాస్టెస్ట్ సెంచురీ చేశాడు వైభవ్. ఇక సూర్యవంశీ కుటుంబ నేపథ్యం, ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? క్రికెట్ కోచ్ ఎవరు వంటి వ్యక్తిగత వివరాలను నెటిజన్లు గూగుల్ చేస్తున్నారు. వైభవ్ తండ్రి, సొంతూరు వంటివి కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కాగా.. , బీహార్ లోని సమస్తిపూర్ ఆయన స్వస్థలం. 2025 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ రిపోర్ట్ ప్రకారం, భారత్ నుంచి అత్యధికంగా సెర్చ్ చేయబడిన పర్సనాల్టీస్ లో.. వైభవ్ సూర్యవంశీ మొదటి స్థానంలో నిలిచాడు.
http://www.teluguone.com/news/content/sachin-and-kohli-records-disappear-36-217166.html





