Publish Date:Mar 31, 2013
బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కి 1993 ముంబై బాంబు ప్రేలుళ్ళ కేసులో అక్రమంగా ఆయుధాలు కలిగిన నేరంలో ఇటీవలే సుప్రీం కోర్టు 5 సం.ల జైలు శిక్ష విదించిన సంగతి తెలిసిందే. నాటి నుండి ఆయనకు క్షమాభిక్ష పెట్టలని కొందరు, వద్దని మరి కొందరూ వాదనలు మొదలు పెట్టడంతో ఖిన్నుడయిన సంజయ్ దత్త్ మీడియాతో మాట్లాడుతూ తనకు క్షమాభిక్ష అవసరం లేదని, సుప్రీం కోర్టు తీరుపుకు కట్టుబడి జైలు శిక్ష అనుభవించేందుకు సిద్దంగా ఉన్నానని, అందువల్ల తన కోసం ఎవరూ కూడా ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరవద్దని ఆయన అన్నారు. అయినప్పటికీ, ఆయనకు అనుకూలంగా, వ్యతిరేఖంగా అనేక మంది మహారాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ శంకర్ నారాయణన్ కి లేక్షలు వ్రాసారు. సంజయ్ దత్త్ కు క్షమాబిక్ష పెట్టమని కోరుతూ వ్రాసిన వారిలో అలనాటి నటి మరియు ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు జయప్రద కూడా ఒకరు. సంజయ్ దత్త్ సత్ప్రవర్తన మరియు సినిమా రంగానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు క్షమాభిక్ష పెట్ట వలసిందిగా ఆమె గవర్నర్ కు లేఖ వ్రాసారు. అయితే, సంజయ్ దత్త్ క్షమాభిక్షపై చెలరేగుతున్న రాజకీయ దుమారం చూసిన తరువాత దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా అది మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉందని భావించిన గవర్నర్, జయప్రద వ్రాసిన లేఖపై ఎటువంటి సలహాలు, సూచనలు చేయకుండానే మహారాష్ట్ర హోం శాఖకు పంపించేసారు. ఇంతకాలం సంజయ్ దత్త్ కు అనుకూలంగా మాట్లాడిన మహారాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఆయనకి క్షమాభిక్ష పెడుతుందా లేక దానిని కేంద్ర హోం శాఖకు పంపి చేతులు దులుపుకొంటుందో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sanjay-dutt-39-22101.html
2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న లోకేష్ తనకు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ సబ్బానాయుడితో మంచి పరిచయం, అనుబంధం ఉందన్నారు.
తమిళ సినిమా లెనిన్ ఇండియన్ అనే సినిమాతో రోజా వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. ఈ మేరకు ఆ మూవీ మేకర్స్ రోజా తమ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
జూబ్లీ హిల్స్‌లో సెంటిమెంటో గెలుస్తుందో డెవలప్‌మెంటో గెలుస్తుందో తెలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి అని టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు టీడీపీ నాయకులను ఆదేశించారు
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గోన్ననున్నారు.
హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ పెద్దగా కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థి ఎంపికకే చాలా సమయం తీసుకున్న ఆ పార్టీ.. ప్రచారంలోనూ వెనుకబడింది. ప్రచార సరళిని బట్టి చూస్తుంటే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అన్న అభిప్రాయం కలుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నాగబాబు ఎమ్మెల్సీ అయిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదని నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం శ్రేణులు అంటుండేవి. ఎమ్మెల్సీగా నాగబాబు తన తొలి పర్యటనను తన సోదరుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం నుంచే మొదలు పెట్టారు. కానీ ఆ పర్యటన ఆద్యంతం తెలుగుదేశం, జనసేన క్యాడర్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లే విధంగానే సాగింది.
రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టి బెరుకు లేకుండా, బెదురు లేకుండా నిలదొక్కుకుని ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారారు.
రైతులు కోరినా జగన్ మాత్రం పొలాల్లోకి అడుగుపెట్టలేదు. ఇదే రకం పరిశీలనో అర్ధంగాక రైతులు తలలుబాదుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్న సమయంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నానన్నారు. మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో పాతిక జిల్లాల్లో పంటనష్టం జరిగిందన్నారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదన్నారు.
ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో మైనారిటీ తీరని పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ కేటీఆర్ పై షఫీయుద్దీన్ ఫిర్యాదు చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.