LATEST NEWS
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతి  పేరు వెనుక ఉన్న వ్యక్తి ఎవరన్న   సీక్రెట్ బయటపెట్టారు.  అమరాతి  ప్రగతికి, పురోగతికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానికి అమరావతి అని పేరు పెట్టాలనే ప్రతిపాదన వెనుక  ఉన్న వ్యక్తి ఈనాడు  అధినేత   రామోజీరావు అని వెల్లడించారు.  రాజధాని నిర్మాణం చేపడుతున్న ప్రారంభ సమయంలో రామోజీరావు  తనకు స్వయంగా ఫోన్ చేశారని గుర్తు చేసుకున్న చంద్రబాబు.. గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న ఆ ప్రాంతానికి ఉన్న ప్రాచీన విశిష్టత, చారిత్రక నేపథ్యంపై తన మీడియా బృందంతో ప్రత్యేకంగా రీసెర్చ్ చేయించి ఒక సమగ్ర నివేదికను రూపొందించినట్లు చెప్పారనీ, ఆ సదర్భంగానే ఆయన రాజధానికి అమరావతిపేరు సూచించారనీ చంద్రబాబు వెల్లడించారు. ఆ తరువాత రామోజీరావు తనకు ఆ పరిశోధనా పత్రాన్నిపంపారనీ, దాని  ఆధారంగానే  ఆంధ్రప్రదేశ్ రాజధానికి 'అమరావతి' అనే పేరు పెట్టాననీ అన్నారు. రామోజీ నోట వెంట అమరావతి పేరు వినగానే  తనకు  పవిత్ర భావన కలిగిందనీ, ఒక్కసారిగా ఒళ్లు పులకరించిందనీ చంద్రబాబు చెప్పారు.  శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా  అమరావతి' పేరు  ప్రకటించినప్పుడు రాష్ట్రంలో ఏ   రాజకీయ నాయకుడి నుంచి  ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రాలేదన్న ఆయన అమరావతికి  ఎవరూ ప్రత్యామ్నాయ పేరును కూడా సూచించలేకపోయారన్నారు.  అమరావతి అనే పదంలో ఉన్న మహత్తర శక్తే అందుకు కారణమన్నారు.  జగన్ హయాంలో మూడు రాజధానుల నిర్ణయం వల్ల అమరావతి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. ఆ సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు పార్టీ ఖాతాలో నిధులు లేకపోయినా, స్వయంగా జోలె పట్టి నిధులు సేకరించి సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయపోరాటానికి సహకరించిన సందర్భాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని ఉద్యమ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముళ్ల కంపలను సైతం లెక్కచేయకుండా రైతులకు మద్దతుగా నిలిచారని ప్రశంసించారు. అలాగే తన సతీమణి నారా భువనేశ్వరి కూడా రైతుల ఉద్యమానికి   తన చేతి గాజులను విరాళంగా ఇచ్చి మద్దతు పలికారని  గుర్తు చేసుకున్నారు. అమరావతి   నిర్మణంలో   ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, భవిష్యత్తులో ఎక్కడా విద్యుత్ స్తంభాలు లేదా పదేపదే రోడ్లు తవ్వే పరిస్థితి లేని విధంగా భూగర్భ డక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో సైబరాబాద్,  ఓఆర్ఆర్ నిర్మించిన అనుభవంతో అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజలందరూ ఆరోగ్యం, సంపద,  ఆనందంతో ఉండాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్న చంద్రబాబు అమరావతి ప్రజా రాజధానిగా.. రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని భరోసా ఇచ్చారు.  Amaravati Capital Name Story,  Chandrababu Naidu, Ramoji Rao,  Amaravati Research Paper, AP Capital Amaravati History, TeluguOne
వైఎస్ జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్  అభివృద్ధి అనవాలు కూడా లేని పరిస్థితి ఉండేది.  జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా  పరిస్థితి ఉండేది.  దాంతో  జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు   చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.   జగన్ సర్కార్ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రంలోకి పెట్టుబడులు, పరిశ్రమల సంగతి అటుంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోయిన పరిస్థితి.  ఇక కొత్తగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల గురించి మాట్లాడకుండా ఉండడమే ఉత్తమమన్నట్లుగా అప్పట్లో పరిస్థితులు ఉండేవి.   రాష్ట్ర విభజన తరువాత    చంద్రబాబు నాయుడు హయాంలో  ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి.  అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురానికి వచ్చింది.  చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి, విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జగన్ రెడ్డి పాలనలో  సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో  ఆ గ్రూప్, రూ.2200 కోటల పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే కాకుండా  జగన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏపీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని కుండబద్దలు కొట్టేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన అమర రాజా కంపెనీ జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక రూ,9500 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించేసింది. ఇలా చెప్పాలంటే జాబితా చాలా చాలా పెద్దగానే ఉంటుంది. మొత్తం మీద ఒక్క ముక్కలో చెప్పాలంటే  జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు రావు  ..ఉన్న పెట్టుబడులు నిలవవు అన్నట్లుగా ఆయన హయాంలో పరిస్థితి మారిపోయింది. అటువంటి పరిస్థితి 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత పూర్తిగా మారిపోయింది. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలూ క్యూడుతున్న పరిస్థితి ఏర్పడింది.  ఇక ఐటీ రంగం విషయానికి వస్తే.. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరి  ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి..  అయితే  2019లో రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అవన్నీ ఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది.  జగన్‌ నిర్వాకం వలన అప్పట్లో ఐ‌టి ఎగుమతులలో దేశంలో అట్టడుగు స్థాయికి  ఆంధ్రప్రదేశ్ పడిపోయింది.  2021-2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ నుంచి రూ.11.59 లక్షల కోట్ల విలువల ఐ‌టి ఎగుమతులు జరిగితే వాటిలో ఆంధ్రప్రదేశ్‌ వంతు కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే!  అలాంటిది 2024లో రాష్ట్రంలో చంద్రబాబునాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది! జగన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం మందగమనంతో సాగిన సాఫ్ట్‌వేర్ ఎగుమతులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండంటే రెండేళ్లలో  రెండు రెట్లకు పైగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా రూపుదిద్దుకున్న పారిశ్రామిక విధానాలు, ఐటీ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు,  విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలలో పెరిగిన మౌలిక సదుపాయాలు ఈ విప్లవాత్మక  వృద్ధికి  కారణాలు. గతంలో నామమాత్రపు స్థాయిలోనే పరిమితమైన ఎగుమతులు, ఇప్పుడు వేల కోట్ల రూపాయల రాబడిని తెచ్చిపెడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తున్నాయి.    రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న  ప్రోత్సాహకాలు, పెట్టుబడుల ఆకర్షణ విధానం,   ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోత్సహించే ఎకోసిస్టమ్ కారణంగా గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్‌ను తమ  డెస్టినేషన్‌గా భావిస్తున్నారు. ఐటీ దిగ్గజాలు తమ ద్వితీయ, తృతీయ స్థాయి కార్యాలయాలను ఏపీ ప్రధాన నగరాల్లో నెలకొల్పడానికి ఉత్సాహం చూపుతున్నారు.ఇదే రీతిలో సాఫ్ట్‌వేర్ ఎగుమతులు వృద్ధి కొనసాగితే.. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్  దేశంలోనే అగ్రగామి ఐటీ హబ్‌ల జాబితాలో నిలవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  AP Software exports growth, Andhra Pradesh IT exports, Vizag IT hub, , Andhra Pradesh tech sector, TeluguOne
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరి వింతగా విడ్డూరంగా ఉంది. అసలు మొదటి నుంచి రాష్ట్ర రాజధాని విషయంలో ఆ పార్టీకి ఒక నిర్దుష్ఠ అభిప్రాయం, విధానం ఉన్నట్లు కనిపించదు. పదే పదే మాట మారుస్తూ మడమ తిప్పుతూ వైసీపీ ప్రతిష్ఠను మసకబార్చుకుంది. 2014లో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికిన వైపీపీ, ఆ పార్టీ అధినేత జగన్.. ఆ తరువాత అధికారంలోకి రాగానే మాట మార్చారు. మూడు రాజధానులంటూ పవర్ లో ఉన్న ఐదేళ్లూ మూడుముక్కలాట ఆడారు. ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయకుండానే గడిపేశారు. న్యాయరాజధాని, శాసన రాజధాని, అడ్మినిస్ట్రేటివ్ రాజధాని అంటూ కబుర్లతో కాలక్షేపం చేసి రాష్ట్రాన్ని రాజధాని లేని అనాథగా మార్చారు. ఇప్పుడు అనూహ్య వేగంతో రాజధాని పనులు జోరుగా సాగుతున్న వేళ.. విమర్శలకు దిగుతూ.. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా అన్న వేమన పద్యాన్ని గుర్తుకు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు.  సరే  ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధాని అమరావతి అన్న చట్టబద్ధత సాధించింది. ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటు ఆమోందం పొందడంతో.. అమరావతి విషయంలో ఇక అడ్డంకులు, చిక్కులూ పూర్తిగా తొలగిపోయినట్లైంది. అయితే జగన్ అండ్ కో మాత్రం అమరావతి క్రెడిట్ చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దక్కుతుందన్న ఆక్రోశంతో కొత్త కొత్త పేర్లతో, వింత వింత ప్రతిపాదనలతో జనంలో కన్ఫ్యూజన్ సృష్టించడానికి విఫలయత్నాలు మాత్రం కొనసాగిస్తునే ఉన్నారు. ఆ క్రమంలో తాము ఔనన్నదే కాదంటూ.. కాదన్నదే ఔనంటూ ఉన్న కొద్ది పాటి ప్రతిష్టనూ మంటగలుపుకుంటున్నారు.  జగన్ మావిగన్ ప్రతిపాదనా, మావిగన్ నినాదమే 2029 ఎన్నికలలో వైసీపీ అజెండా అని  ప్రకటించి అమరావతి విషయంలో తమ అయిష్టతను విస్పష్టంగా చాటుకున్నారు. ప్రజా ఆకాంక్షలతో తనకు ఇసుమంతైనా సంబంధం లేదనీ మావిగన్ ప్రతిపాదనతో  జగన్ మరో సారి రుజువు చేసుకున్నారు. మావిగన్ ప్రకటనతో వైసీపీ విధానమైన మూడు రాజధానుల సిద్ధాంతానికి వైసీపీ తిలోదకాలిచ్చేసింది. ఇప్పుడు తాజాగా అమరావతికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ వేళ ఆ పార్టీ సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, వెళ్లగక్కిన అక్కసు.. ఆ పార్టీకి ఒక విధానమంటూ లేదా అన్న సందేహాలు కలిగేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డును ఇలా చంద్రబాబు ప్రారంభించారో లేదో.. అలా మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని.. చంద్రబాబును ఉద్దేశించి వేసిన ప్రశ్నలు, చేసిన విమర్శలూ విస్మయం గొలుపుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలను చంద్రబాబుకు ఆపాదించి.. తమ పార్టీ అధినేత జగన్ నే నిలదీస్తున్నట్లుగా ఉన్నాయి.    అమరావతి, సీడ్ యాక్సిస్ రోడ్‌ మొదలు పెట్టి ఎన్నేళ్ళయింది? ఒక రోడ్డు, ఒక  బ్రిడ్జి నిర్మించి  గొప్ప ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు అంటూ విమర్శించిన పేర్ని నానికి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు జాప్యం అవ్వడానికి కారణమేంటో తెలియదని ఎవరైనా ఎలా అనుకుంటారు. ఆ రోడ్డు పూర్తి కాకుండా అడ్డుకోవడానికి 65 సెంట్ల భూమి విషయంలో కోర్టును ఆశ్రయించి అడ్డుకున్నదెవరు? అని ఎవరైనా ప్రశ్నిస్తూ.. జవాబు జగన్ అని వస్తుందని పేర్ని నానికి తెలియదనుకోవాలా?  అక్కడితో ఆగలేదు.. 65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి? ఒరిగిందేంటి?   అమరావతి రైతులను ఎంతగా వేధించారో, అవమానించారో, అవహేళన చేశారో  అందరికీ తెలిసిందే.    అవన్నీ పక్కన పెడితే.. వచ్చే ఎన్నికలలో వైసీపీ  గెలిచి మళ్ళీ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారనీ, అప్పుడు.. మావిగన్‌ రాజధానిగా చేసుకొని పాలిస్తామని చెప్పుకుంటున్న వైసీపీ.. యాక్సిస్ రోడ్డుపైనా, చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించడం దేనికీ?  మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారన్న విశ్వాసం లేకపోవడం వల్లేనా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  మొత్తం మీద పేర్ని నాని రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ అయోమయాన్నీ, ఆ పార్టీలో ఉన్న గందరగోళాన్ని తన ప్రెస్ మీట్ ద్వారా మరోసారి బయటపెట్టారు.  Amaravati Seed Access Road,  CM CBN,  Perninani, Undavalli Steel Bridge, AP Capital Development 
గుడివాడ వన్ టౌన్  ఎస్ఐ వై.వి.వి. సత్యనారాయణను  వేకెన్సీ రిజర్వ్ కు పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేపాయి. వైవీవీ సత్యనారాయణ అకస్మిక బదలీ, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్ లో ఉంచడానికి వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానితో ఆయన సంబంధాలే కారణమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అసలింతకీ జరిగిందేంటంటే.. మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ  వైసీపీ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో  నిరసన ర్యాలీ యత్నాన్ని పోలీసులు అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు. ఈ విషయంపై ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ, కొడాలి నాని మధ్య వాగ్వాదం జరిగింది.  ఈ ఘటన తర్వాత ఎస్ఐ వైవీవీ సత్యనారాయణను గుడివాడ నుంచి బదలీ చేసి వీఆర్ లో ఉంచారు. ఇక్కడే వైవీవీ సత్యనారాయణ బదలీకి ఆయనపై బదలీ వేటుకు కారణమేంటన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో జరుగుతోంది.  కొడాలి నానితో  సత్సంబంధాలున్నాయన్న ఆరోపణలతో బదలీ అయ్యారా? లేక కొడాలి నాని ర్యాలీ యత్నాన్ని అడ్డుకునే సమయంలో ఆయనతో దురుసుగా వ్యవహరించారన్న కారణంతో వీఆర్ కు పంపించారా అన్న రెండు భిన్నమైన ప్రశ్రలు ఈ చర్చల్లో ప్రముఖంగా ఉన్నాయి.  ప్రతిపక్ష నేతతో సదరు అధికారి అత్యంత చనువుగా మెలిగారనే కారణంతోనే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ కథనాలకు బలం చేకూరుస్తూ.. ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ కొడాలి నానితో ఎస్ఐ నవ్వుతూ సంభాషిస్తున్నట్లు ఉన్న ఒక ఫొటో  సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ   విధి నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించలేదనే ఆరోపణలు రావడంతోనే శాఖాపరమైన చర్యలు పడ్డాయని పోలీసు వర్గాలూ చెబుతున్నాయి.  అదే సమయంలో మరో కోణంలో కూడా ఈ బదలీపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.  మాజీ మంత్రి కొడాలి నాని పట్ల   ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ దురుసుగా వ్యవమరించిన కారణంానే బదలీ వేటు పడిందంటున్నారు.  ఈ కోణంలో వ్యాఖ్యలు చేస్తున్న వారు కూడా..  ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ.  కొడాలి నానితో ఆగ్రహంగా మాట్లాడుతున్నట్లుగా కనిపించే ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.   ఇలా ఎస్పై వైవీవీ సత్యనారాయణ బదలీ రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా ప్రతిపక్ష నాయకులపై దురుసుగా ప్రవర్తించారనే కారణంతో ఏకపక్షంగా ఒక పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవడం చాలాచాలా అరుదు.  అందుకే కొడాలి నానితో సదరు అధికారి సాన్నిహిత్యంగా ఉండటమే బదిలీకి ప్రధాన కారణమై ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Gudivada SI sent to VR,  Kodali Nani, YVV Satyanarayana transferred,  GudivadaYCP rally, Krishna district police transfers
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాల్లో మళ్లీ  చర్చనీయాంశంగా మారారు. ఇటీవల రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ..  ఆయన అడుగులు మాత్రం రాజకీయంగా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నయని అనిపిం చకతప్పదు.  దీనిపై ప్రముఖ విశ్లేషకుడు  భరద్వాజ తెలుగువన్ న్యూస్ చానల్ లో ప్రత్యేకంగా మాట్లాడుతూ..  హైదరాబాద్‌ ఫిలింనగర్ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేయడం, నూతన మీడియా సంస్థ స్థాపనకు యత్నాలు జరపడం ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారన్న సంకేతాలేనన్నారు.  తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.  ఢిల్లీ స్థాయిలో వైసీపీకి లైజనింగ్ బాధ్యతలు చూసే సరైన నేత అవసరం ఉన్నందున, జగన్ పిలుపు కోసం ఈ  సంకేతాలు పంపుతున్నారని విశ్లేషించారు.   కొత్త పార్టీ స్థాపన కాకుండా బిజెపి లేదా జనసేన వైపు విజయసాయి రెడ్డి అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయన్న భరద్వాజ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆ పార్టీలోకి వెళ్తారా లేక స్వతంత్రంగానే ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తారా అనేది చూడాల్సి ఉందన్నారు. మీడియా ఛానెల్ ఏర్పాటు ప్రక్రియ ద్వారా విజయసాయి, తనకంటూ ఒక వేదికను  సిద్ధం చేసుకుంటున్నారన్నది వాస్తవమన్నారు.    Vijayasai Reddy New Party, Bharat Jana Vikas, YSRCP AP Politics, Vijayasai Reddy News Channel, AP Politics, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
Havish is gearing up for a much-needed big break with Nenu Ready, and the film’s latest single, Masthugundira Yavvaram, adds more energy to the buzz surrounding the movie. The song comes with a catchy mass beat while retaining a melodious flavour, making it an appealing youthful number. Composed by Mickey J. Meyer, the song gets its energetic vibe from the vocals of Anurag Kulkarni and Manisha Erabathini, while Kasarla Shyam’s Telangana-flavoured lyrics give it a distinctly native touch. Interestingly, instead of presenting another routine romantic number, the song plays around with the love-hate equation between Havish and Kavya Thapar’s characters. Havish and Kavya are the biggest attractions of the song. Their chemistry, energetic dance moves and vibrant body language give the number a lively feel, with Kavya matching Havish’s energy perfectly. Havish, in particular, looks comfortable with the mass choreography and gets plenty of opportunities to showcase his dance and expressions. Directed by Trinadha Rao Nakkina, Nenu Ready promises to be a complete youthful entertainer with romance, comedy and commercial elements. With Kanchana Koneru producing the film, the team appears confident about delivering a much-needed success for Havish, who is looking to make a strong comeback with this project. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    అభిమానుల హోరు మధ్య నిన్న 'ఇరుముడి' ట్రైలర్ వచ్చిన విషయం తెలిసిందే. అలా రిలీజ్ అయ్యిందో లేదో, సోషల్ మీడియాలో మాస్ మహారాజా అభిమానుల హంగామా మాములుగా లేదు. హిట్ పక్కా, రికార్డులే తరువాయి అంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాలో సందడి వాతావరణం తీసుకొస్తున్నారు. కానీ అదే టైంలో ఇరుముడి టైటిల్ పై జరుగుతున్న చర్చ వైరల్ గా మారింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడూతు 'ఇరుముడి కేవలం ఒక ఆధ్యాత్మిక లేదా భక్తి కథ మాత్రమే కాదు. ఒక తండ్రి తన జీవితంలో ఎదుర్కొనే సంఘర్షణ, అయ్యప్ప భక్తుడి విశ్వాసం, గ్రామంలో జరిగే క్రైమ్ మిస్టరీ అనే మూడు  కీలకమైన విభిన్న కోణాల్ని మూవీలో చూపించాం. కథలోని ఈ మూడంశాలను కలిపే ఒక బలమైన భావనగా 'ఇరుముడి' అనే పవిత్రమైన టైటిల్ ని ఎంచుకున్నామని చెప్పుకొచ్చాడు. అయితే, ఈ వివరణపై స్వామి అయ్యప్ప భక్తులు  అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  Also read: Toxic: యష్ ని మా రాష్ట్రంలో ఉండనివ్వం.. టాక్సిక్ పై ప్రముఖ నటి ఆగ్రహం శబరిమల యాత్ర చేసే భక్తులు 41 రోజుల కఠినమైన దీక్ష సమయంలో ఎంతో పవిత్రంగా భావించి నెత్తిన మోసే 'ఇరుముడి' పేరును, క్రైమ్ మిస్టరీ, నెగెటివ్ ఛాయలున్న కథాంశానికి ఎందుకు వాడారని ప్రశ్నిస్తున్నారు. సినిమాలో తండ్రీకూతుళ్ల అనుబంధం, ఆధ్యాత్మికత, క్రైమ్ మిస్టరీ అనే 3 విభిన్న కోణాలు ఉన్నాయని స్వయంగా దర్శకుడే చెప్తున్నప్పుడు, సినిమాకి 'త్రిముడి' అనే మరో పేరుని ఎన్నుకోవచ్చు కదా!  అత్యంత నిష్ఠతో కూడిన ఇరుముడి శబ్ద ప్రాశస్త్యాన్ని ఇలాంటి క్రైమ్ నేపథ్యం ఉన్న చిత్రానికి ఉపయోగించడం శబరిమల భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 21న సినిమా విడుదల తేది దగ్గరపడుతున్న తరుణంలో ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే.  Irumudi, Ravi Teja, Priya Bhavani Shankar, Shiva Nirvana
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందించిన మూవీ 'విశ్వనాథ్ & సన్స్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ రొమాంటిక్ ఫామిలీ డ్రామా.. రేపు (ఆగష్టు 14) థియేటర్లలో అడుగుపెట్టనుంది. 'విశ్వనాథ్ & సన్స్'పై నాగవంశీ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇటీవల తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ల వాట్సాప్ గ్రూప్‌లో నాగవంశీ పెట్టిన మెసేజ్ అంటూ.. ఒక మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   ఆ మెసేజ్‌లో ఏముంది అంటే.. "ఆగష్టు 14న వెంకీ అట్లూరి స్టయిల్ బ్లాక్ బస్టర్ రాబోతుంది. నా టైం, మీ టైం బాగుంటే.. ఈ సినిమా అద్భుతాలు చేయవచ్చు. సినిమా అయితే నాకు చాలా చాలా నచ్చింది" అని నాగవంశీ మెసేజ్ చేసినట్టుగా ఉంది. 'సార్', 'లక్కీ భాస్కర్' లాంటి సినిమాలతో కట్టిపడేసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి మార్క్ మేజిక్ మళ్లీ రిపీట్ కాబోతోందని నాగవంశీ మాటలను భట్టి అర్థమవుతోంది. మరి థియేటర్లలోకి వస్తున్న 'విశ్వనాథ్ & సన్స్' మూవీ నాగవంశీ నమ్మకాన్ని నిజం చేస్తుందేమో చూడాలి.        Vishwanath and Sons, Naga Vamsi, Venky Atluri, Suriya, Mamitha Baiju  
Prabhas appears to be leaving nothing to chance with Fauzi, directed by Hanu Raghavapudi. At the Ravi Teja's Irumudi trailer launch, Mythri Movie Makers producer Ravi Yerneni revealed that Prabhas has been closely monitoring the film’s shoot and is even visiting the sets on days when he has no scenes to film. According to Ravi, the actor spends time observing the proceedings and is determined to ensure that the film lives up to expectations. The extra involvement comes at an interesting point in Prabhas’ career. His previous outing, The Raja Saab, ended up being a major disappointment commercially despite the star’s massive opening. The film reportedly grossed around Rs. 208 crore worldwide, making it a significant underperformer given its scale. Interestingly, Fauzi has already been in production for a considerable period, but the team is now entering its final stretch. Prabhas is reportedly aiming to wrap his portions by September-end before moving on to Sandeep Reddy Vanga’s Spirit. Recent reports suggest he is expected to dedicate more than 60 shooting days to the final Fauzi schedule. With Fauzi scheduled for December 3, 2026, Prabhas seems keen to end the year on a positive note. The actor’s increased involvement suggests that he is treating this comeback with more caution after The Raja Saab. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  యష్ వన్ మాన్ షో  టాక్సిక్ ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. అదే టైం లో  బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయనే విషయం కూడా అర్ధం అవుతుంది.  రీసెంట్ గా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి రిషికా సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'టాక్సిక్  ట్రైలర్‌లో ప్రదర్శించిన అశ్లీలత చూసి  తీవ్రంగా నిరాశ చెందుతున్నాను. నిజ జీవితంలో ఒక బాధ్యతాయుతమైన భర్తగా, ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఉన్న యష్ నుంచి సమాజం, ముఖ్యంగా మహిళలు మరింత గౌరవాన్ని  బాధ్యతాయుత ప్రవర్తనని  ఆశిస్తారు.నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి ఐదుగురు అగ్రశ్రేణి కథానాయికలు నటిస్తున్నప్పటికీ, వారి క్యారెక్టర్స్ ని కేవలం గ్లామర్, భోగవస్తువులుగానే చూపించడం ఏమాత్రం సహించరాని విషయం.  భారతీయ సంస్కృతిని, మహిళల గౌరవాన్ని కాపాడలేనప్పుడు, మహిళలను గౌరవించడం చేతకాకపోతే మిమ్మల్ని కర్ణాటక నేల వదిలి వెళ్ళేలా చేస్తాం. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ కర్ణాటక ప్రాంతానికి చెందినవారు కాకపోవడం వల్ల ఆమెకు ఇక్కడి సాంప్రదాయాలు, విలువలు తెలియకపోవచ్చు. కానీ కన్నడ నేలపై పుట్టి పెరిగి ఈ స్థాయికి ఎదిగిన యష్‌కూడా ఇటువంటి వివాదాస్పద సన్నివేశాలకి  ఎలా అంగీకారం తెలిపారని ఆమె సూటిగా ప్రశ్నించారు. రుషికా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట ప్రత్యక్షమవ్వగానే క్షణాల్లో వైరల్‌గా మారి కన్నడ నాట పెను దుమారం రేపాయి.   Also read:కరాటే కల్యాణి వ్యాఖ్యలు వైరల్: #పావలా శ్యామల కుమార్తె మాధవికి 'మా' సాయం అప్పటి వరకే  అయితే, రుషికా సింగ్ చేసిన వ్యాఖ్యలపై యష్ అభిమానులు మరియు నెటిజన్లు అత్యంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను టార్గెట్ చేస్తూ నెటిజన్లు ఎదురుదాడికి దిగారు. సినిమాలో నటిస్తున్న ప్రొఫెషనల్ నటీమణులు తమ సొంత సమ్మతితోనే ఆయా సన్నివేశాల్లో నటించారని, ఒక కల్పిత కథతో కూడిన చలనచిత్రంలో పాత్రలను చూసి నటుడి వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని ముడిపెట్టడం ఎంతవరకు న్యాయమని యష్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, గతం లో రుషికా సింగ్ చేసిన బోల్డ్ ఫోటోషూట్లు, గ్లామరస్ సన్నివేశాల వీడియోలను రీషేర్ చేస్తూ ఆమె ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతున్నారు. ఆగస్టు 26న విడుదల కానున్న ఈ పాన్-ఇండియా చిత్రం చుట్టూ ముసురుకున్న ఈ రచ్చ రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందోనని సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కన్నడ పరిశ్రమలో సుప్రసిద్ధ దిగ్గజ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు కుమార్తె అయిన రుషికా సింగ్, 'కళ్ళ మళ్ళ సుళ్ళ', 'బెంకి బిరుగాలి', 'కంఠీరవ' వంటి ప్రముఖ చిత్రాల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. Yash, Toxic, Rishika Singh, Tollywood
National Award winner Sukriti Veni Bandreddi has added another achievement to her growing list of accomplishments. The young talent has now won the Ensemble Excellence Award from Berklee School of Music, adding a new dimension to her artistic journey. Sukriti, daughter of filmmaker Sukumar and Thabitha Sukumar, shot to national fame with her debut film Gandhi Tatha Chettu. Her performance in the film earned her the Best Child Artist award at the 71st National Film Awards, making her one of the youngest Telugu talents to receive the prestigious honour. Interestingly, acting is not the only area where Sukriti has been nurturing her talent. She has also been pursuing music, and her latest recognition from Berklee further highlights her abilities beyond the screen. Gandhi Tatha Chettu has already brought Sukriti several honours at film festivals and award ceremonies, including recognition at the Minsk International Film Festival and the Dadasaheb Phalke Film Festival. With a National Award in acting and now an international recognition for her musical talent, Sukriti Veni Bandreddi is slowly establishing an identity of her own, beyond being known as Sukumar’s daughter. Her latest achievement is yet another indication that the young artist has plenty more to offer in the years ahead. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Jr NTR has been discharged from KIMS Hospitals, Secunderabad, following a successful arthroscopic shoulder surgery. The actor was admitted to the hospital after suffering a shoulder injury in late July and underwent the procedure on August 12. KIMS Hospitals confirmed that the surgery was successful and that NTR is doing well. Following his discharge, the actor will begin a structured rehabilitation programme under medical supervision as part of his recovery. Doctors have indicated that he is expected to make a full recovery in around two to three months. NTR had earlier thanked his fans, friends and family for their prayers and support following the surgery. He also expressed gratitude to the team of doctors at KIMS and assured everyone that he was doing well. The actor’s latest picture from KIMS has now surfaced, showing him posing with the hospital’s medical team after his discharge. The update has come as a relief to fans who had been concerned about his health. NTR will continue shooting for Dragon after recovering fully.  Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  సీనియర్ నటి పావలా శ్యామల ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే. 75 సంవత్సరాల వయస్సులో, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించి, వెండితెరపై నవ్వులు పూయించిన ఒక గొప్ప కళాకారిణి, జీవిత సంధ్య వేళ రూపాయి సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం సినీ ప్రపంచాన్ని, ప్రేక్షకులని తీవ్రంగా కలచివేసింది. అయితే ఆమె మరణం తర్వాత నటి కరాటే కల్యాణి వెల్లడించిన విషయాలు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ('మా') తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  పావలా శ్యామల భౌతికకాయం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో ఉన్న సమయంలో నటి కరాటే కల్యాణి దగ్గరుండి అంత్యక్రియల బాధ్యతలను చూసుకున్నారు. 'మా' (Movie Artists Association) అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించి, పావలా శ్యామల అంతిమ సంస్కారాలకు అవసరమైన పూర్తి వ్యయాన్ని భరిస్తుందని, ఆమె అనాథ కాదని, సినీ పరిశ్రమ ఆమె కుటుంబానికి అండగా ఉంటుందని ప్రకటించారు. దహన సంస్కారాల ఖర్చుల కోసం తక్షణమే నిధులు విడుదల చేయడం మాత్రమే కాకుండా, గతంలో పావలా శ్యామలకు అందించిన పింఛను సాయాన్ని గుర్తుచేశారు అయితే అసలు సమస్య శ్యామల మరణంతో ముగిసిపోలేదు; ఆమె ఏకైక కుమార్తె మాధవి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.  మాధవి కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న మాధవికి తల్లి తప్ప వేరే ఆధారం లేకపోవడంతో, శ్యామల మరణం తర్వాత ఆమె జీవనం ఎలా గడుస్తుందనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో కరాటే కల్యాణి మీడియా ముందుకు వచ్చి 'మా' అసోసియేషన్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని బహిర్గతం చేశారు. మాధవికి నెలకు కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా లేదా పింఛను రూపంలో అందించడానికి 'మా' సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ఆ సహాయం కేవలం ఒక్క సంవత్సరం (1 Year) మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.  ఒక్క సంవత్సరం గడిచిన తర్వాత మాధవి పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. జీవితాంతం అనారోగ్యంతో పోరాడే వ్యక్తికి కేవలం 12 నెలల కాలపరిమితితో సాయం చేయడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. గత కొన్నేళ్లుగా పావలా శ్యామల కుటుంబం తీవ్రమైన పేదరికంలో మగ్గుతోంది. నెలకు 6,000 నుండి 10,000 వరకు అద్దె చెల్లించలేక, నిత్యం మందుల ఖర్చుల కోసం వేలాది రూపాయలు వెచ్చించలేక వారు ఎంతో నరకం అనుభవించారు. గతంలో పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు లక్షలాది రూపాయల సాయం అందించినప్పటికీ, ఆసుపత్రి బిల్లులు, రెగ్యులర్ డయాలసిస్ మరియు మందుల ఖర్చులకే ఆ డబ్బు అంతా ఖర్చయిపోయింది.  కరాటే కల్యాణి మాట్లాడుతూ, శ్యామల కుటుంబానికి మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని, అయితే సినీ పరిశ్రమ మరియు ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. 'మా' అసోసియేషన్ ఒక సంవత్సర కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా మాధవికి సహాయాన్ని పొడిగించాలని, లేదా ప్రభుత్వ పెన్షన్ పథకం ద్వారా శాశ్వత జీవనోపాధి కల్పించాలని పలువురు కళాకారులు కోరుతున్నారు. కళామతల్లికి దశాబ్దాల పాటు సేవ చేసిన ఒక సీనియర్ నటి కుమార్తె ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉండటం చిత్ర పరిశ్రమకే ఒక పెద్ద పరీక్షగా మారింది. దాతలు, ప్రభుత్వం మరియు టాలీవుడ్ పెద్దలు ముందుకు వచ్చి మాధవికి శాశ్వత ఆర్థిక భద్రత కల్పిస్తారని ఆశిద్దాం.   Pavala Syamala, Karate Kalyan, Manchu Vishnu
  షకీలా..ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు.  జయం, నిజం వంటి చిత్రాలతో పాటు పలు చిత్రాల్లో తనదైన మేనరిజంతో అలరించింది. మలయాళంలో అయితే షకీలా సినిమాలు రిలీజైతే మోహన్ లాల్, మమ్మూట్టి లు తమ సినిమా రిలీజ్ ని వాయిదా వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి షకీలా ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. షకీలా తాజాగా తనకు ఎదురైన ఒక భయంకరమైన ఆరోగ్య సమస్యను, అందుకు దారితీసిన పరిస్థితులని  బయటపెట్టి అందరినీ షాక్ కి గురిచేశారు. ఆమె మాట్లాడుతూ ' నిత్య జీవితంలో భాగమైపోయిన స్మార్ట్‌ఫోన్ నా  జీవితంలో ఊహించని నరకాన్ని చూపించింది. అతిగా ఫోన్ వాడటం వల్ల  ఏకంగా మెడకు శస్త్రచికిత్స  చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. సినిమా అవకాశాలు తగ్గి ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోవడంతో, ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి  స్మార్ట్‌ఫోన్‌ని  ఒక వ్యసనంలా మార్చుకున్నాను. ప్రతిరోజూ మంచంపై ఒకే పక్కకు వంగి పడుకుని వరుసగా 4 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్‌లో గేమ్స్ ఆడటం  అలవాటుగా మారింది. గేమ్ ఆడిన తర్వాత కాఫీ లేదా టీ తాగి వచ్చి, మళ్లీ అదే విధంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూడటంతో  మెడలోని నరాలు తీవ్రంగా ఒత్తిడికి గురై దెబ్బతిన్నాయి.  Also read: ఓనం 2026 బాక్సాఫీస్ యుద్ధం: మలయాళంలో బాక్సాఫీస్ కింగ్ ఎవరు! మెడ నొప్పి తారాస్థాయికి చేరడం, కాళ్లూ చేతులు కదల్చలేని పరిస్థితి రావడంతో వెంటనే  చెన్నైలోని మేడ్వే ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. మెడ భాగంలో ఒక టైటానియం స్క్రూని అమర్చారు.  ఆపరేషన్‌కి 3 లక్షల వరకు ఖర్చయింది.  స్మార్ట్‌ఫోన్ అనేది అవసరమే  అయినప్పటికీ పరిమితి దాటి వాడితే ప్రాణాల మీదికి తెస్తుంది. ముఖ్యంగా పిల్లలకి  మొబైల్ ఫోన్లు ఇచ్చి అలవాటు చేయవద్దని తల్లిదండ్రులకి  విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. మెడకు ప్రత్యేకమైన నెక్ కాలర్ ధరించి రికవరీ అవుతున్న ఆమె, ప్రస్తుతం నడవడానికి, కనీసం భోజనం చేయడానికి, మంచం పైనుంచి లేవడానికి కూడా కేర్‌టేకర్‌ల సహాయంపై ఆధారపడుతున్నారు. Shakeela, Cell Phone, Tollywood  
    ఒకప్పుడు మన సినిమాలో కామెడీ యాక్టర్ మలయాళంలో డైలాగ్ చెపితే ఎగతాళి చేస్తూ నవ్వుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏ ఇంట్లో చేసినా ఓటిటిలో వస్తున్న మలయాళ సినిమాలు చూస్తూ ఆ క్యారక్టర్ ఇలా ఈ క్యారక్టర్ ఇలా అని ఊసులాడుకుంటూ దట్ ఈజ్ మలయాళ సినిమా అని  నిద్రలోకి జారుకుంటున్నాం. సినీ ఫార్మేట్ ప్రకారం కథ, కథనం, క్యారక్టర్ ల తీరు తెన్నులు, కథ మూడ్ కి తగ్గ సాంగ్స్ తో సినిమాలు తెరకెక్కించి విజయాన్ని అందుకుంటున్నారు. అలాంటి మలయాళ సీమలో ఓనం పండక్కి జరుగుతున్న బాక్స్ ఆఫీస్ వార్ సినీ ప్రియులని ఆకట్టుకుంటుంది.   ఓనం 2026 సీజన్ మాత్రం మలయాళ చిత్రసీమ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన పోరుకు వేదికగా మారబోతోంది. ఒకే వారం వ్యవధిలో పరిశ్రమకు చెందిన ముగ్గురు అగ్ర యువ కథానాయకులు తమ ప్రతిష్టాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటమే అందుకు ప్రధాన కారణం.  దర్శకుడు వైశాఖ్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఖలీఫా', నహాస్ హిదాయత్ కాంబినేషన్‌లో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా తెరెకెక్కిన 'ఐయామ్ గేమ్', మరియు గిరీష్ ఏడీ దర్శకత్వంలో నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్' చిత్రాలు ఆగస్టు 20న ఒకేసారి విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. గతంలో ఓనం సీజన్ అంటే కేవలం మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి దిగ్గజ నటుల చిత్రాల మధ్యే ప్రధాన పోటీ ఉండేది. 1980ల కాలంలో మోహన్‌లాల్ నటించిన 'సుఖమూ దేవి', 'మనకు పార్కన్ ముంతిరితొప్పుకల్' చిత్రాలు, మమ్ముట్టి నటించిన 'ఆవనాజి', 'సాయం సంధ్య' వంటి నాలుగు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడి రికార్డులు సృష్టించిన చరిత్ర ఉంది. ఆ తర్వాత ఫాజిల్ తెరకెక్కించిన 'హరికృష్ణన్స్' (1998) లాంటి మల్టీస్టారర్ బ్లాక్‌బస్టర్లు ఓనం పండుగకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  అయితే ప్రస్తుత తరం హీరోల్లో పరిస్థితి మునుపటి కంటే భిన్నంగా ఉంది. 2026 ఓనం రేసులో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలీ ముగ్గురూ ప్రస్తుతం సొంత గడ్డపై తమ కెరీర్‌లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వీరి స్థానాన్ని, స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడానికి ఈ ఓనం విజయం వారికి అత్యంత కీలకంగా మారింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరోలకు ఈ పండుగ బాక్సాఫీస్ రేసు నిజంగానే 'డూ ఆర్ డై' పరీక్షగా నిలుస్తోంది.  ముఖ్యంగా నివిన్ పౌలీ పరిస్థితిని పరిశీలిస్తే, గత ఏడాది చివర్లో రూ. 151 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన 'సర్వం మాయ' చిత్రంతో ఆయన మళ్లీ పూర్వ వైభవం సాధించారని అభిమానులు భావించారు. కానీ, 2026 ఏడాది ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. సక్నిల్క్ లెక్కల ప్రకారం, సర్వం మాయ తర్వాత కేవలం రెండు నెలల వ్యవధిలో విడుదలైన 'బేబీ గర్ల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 4.61 కోట్లు మాత్రమే వసూలు చేయగా, 'ప్రతిచ్ఛాయ' చిత్రం రూ. 8.59 కోట్లకు పరిమితమై అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి Also read: అగధ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఏం ఎస్ రాజు హిట్ కొట్టినట్లేనా! . దీంతో నివిన్ మళ్లీ మొదటికొచ్చి పడ్డారు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ 'బెత్లెహెం కుటుంబ యూనిట్' సినిమాపైనే ఉన్నాయి.  మరొకవైపు, ఇతర భాషల్లో వరుస విజయాలు సాధిస్తున్న దుల్కర్ సల్మాన్‌కు మలయాళీ ప్రేక్షకుల వద్ద సరైన హిట్ దక్కి చాలా కాలమైంది. ఓటీటీలో నేరుగా విడుదలైన 'సెల్యూట్' తర్వాత ఆయన నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం 'కింగ్ ఆఫ్ కొత్త' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2023 ఓనం సీజన్‌లో ఆర్‌డిఎక్స్ (RDX) చిత్రం సంచలన విజయం సాధించి కింగ్ ఆఫ్ కొత్తను వెనక్కి నెట్టింది. ఈ నేపథ్యంలో దుల్కర్ నటించిన 'ఐయామ్ గేమ్' విజయం సాధించడం ఆయన మలయాళ మార్కెట్‌కు ఎంతో అవసరం.  పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కూడా ఈ ఓనం యుద్ధం కీలకమే. 'విలాయత్ బుద్ధ' (2025) దారుణంగా విఫలం కావడం, 'పల్లిచట్టంబి' (2026)లో వచ్చిన కామియో రోల్ ట్రోల్స్‌కు గురికావడం, అలాగే భారీ అంచనాలతో వచ్చిన 'ఐ, నోబడీ' (2026) చిత్రం కేవలం5.37 కోట్ల గ్రాస్‌కే పరిమితం కావడం ఆయన మార్కెట్‌పై ప్రభావం చూపింది.   కాబట్టి 'ఖలీఫా' పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతేడాది మోహన్‌లాల్ 'హృదయపూర్వం'తో బరిలోకి దిగినప్పటికీ, కళ్యాణి ప్రియదర్శన్ 'లోక: చాప్టర్ 1: చంద్ర' చిత్రం ఏకంగా303.86 కోట్ల ఆల్‌టైమ్ రికార్డు సాధించి సంచలనం సృష్టించింది. మరి ఈ 2026 ఓనం బాక్సాఫీస్ పోరులో ఈ ముగ్గురు స్టార్స్‌లో ఎవరు విజయం సాధించి తమ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువస్తారో చూడాలి. Prithviraj Sukumaran,  Dulquer Salmaan, Nivin Pauly
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.   స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు. వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.   వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.                                                                                                                                                   *రూపశ్రీ.  
నేటికాలంలో ప్రేమ, ఆకర్షణ మధ్య తేడాను తెలుసుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆకర్షణను ప్రేమగా పొరబడేవారు.. హద్దులు దాటి ముందుకు వెళ్లేవారు కోకొల్లలు ఉన్నారు. అయితే.. నిజమైన ప్రేమకు, ఆకర్షణకు మధ్య గల తేడా గురించి మాత్రమే కాకుండా..  ప్రేమకు  అనుబంధానికి మధ్య తేడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?  వివరంగా తెలుసుకుంటే.. నిజమైన ప్రేమ, ఆకర్షణ..అనుబంధం.. ఒకరితో కలిసి ఉంటే సంతోషంగా ఉండటం ప్రేమ కావచ్చు, కానీ వారు లేకుండా అశాంతిగా ఉండటం ఎల్లప్పుడూ ప్రేమ కాదని అంటున్నారు. చాలాసార్లు  బంధాలలో  ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకుంటున్నారనే ఫీలింగ్ ఎంత డీప్ గా ఉంటుందంటే..  ప్రేమలో ఉన్నామో లేక ఎదుటి వ్యక్తి పట్ల ఆకర్షితులవుతున్నారో,  లేదా లోతుగా అనుబంధంలో ఉన్నారో  కూడా    తెలియనంతగా ఉంటుంది. ప్రేమ మనసును విశాలం చేస్తుంది, అయితే అనుబంధం  నెమ్మదిగా మనసును బంధిస్తుంది. ప్రేమలో స్వేచ్ఛ, అనుబంధంలో  సొంతమనే బావన ఉంటుంది.. నిజమైన ప్రేమ  వ్యక్తిని తన కోరికలకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించదు. అది ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలను, భావాలను , స్వేచ్ఛను గౌరవిస్తుంది. దీనికి విరుద్ధంగా అనుబంధం ఎక్కువగా ఉంటే మాత్రమే ఉంటే  ఎదుటి వ్యక్తి ఎల్లప్పుడూ తన కోరికల ప్రకారమే ప్రవర్తించాలనే వాంఛను బలపరుస్తుంది. ఇది స్వార్థం కూడా కావచ్చు. నమ్మకం ఉన్నచోట.. భయం ఉండదు..  సంబంధంలో నిజమైన ప్రేమ ఉంటే, దూరం ఉన్నా లేదా ఎంత బిజీగా ఉన్నా నమ్మకం నిలిచి ఉంటుంది. అయితే, అనుబంధం ఎక్కువగా ఉంటే..  కాలంతో పాటు అవతలి వ్యక్తి తమను విడిచిపెడతారేమోనని పదేపదే ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా చేసే ఫోన్ కాల్స్, అరుదుగా , లేదా ఒంటరిగా సమయం గడపడం వంటివి కూడా ఆందోళనకు కారణం కావచ్చు. అందుకే మనసు స్థిరంగా ఉండాలి. ప్రేమలో సాన్నిహిత్యం ఉంటే.. అనుబంధం  కోల్పోతామేమో అనే భావన ఉంటుంది.. ఒకరిని మన సొంతవారిగా భావించడం సహజం. ఆ సొంతమనే భావనే భయంగా మారినప్పుడు సమస్య మొదలవుతుంది. ఆ వ్యక్తి లేకుండా మన జీవితం అసంపూర్ణంగా ఉందని, మన సంతోషం పోతుందని, లేదా మనల్ని మనం చూసుకోలేమని అనిపించడం మొదలైనప్పుడు, ఈ భావన ప్రేమను దాటి అనుబంధంగా డెవలప్  చెందుతుంది. అంచనాలు ఉంటే బంధం బలహీనమవుతుంది.. బంధంలో అంచనాలు ఉన్నప్పుడు ఆ బంధం బలహీనంగా మారుతుందట. అంచనాలు ఉన్నప్పుడు ఆ అంచనాలను చేరుకోలేక పోవడం వల్ల  డిజప్పాయింట్ కావడం జరుగుతుంది.  ఇది బంధంలో ఉన్న మనిషి మీద కూడా అభిప్రాయం మారేలా చేస్తుంది. గొడవలు,  వాగ్వాదాలకు కూడా కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ కోసం  తమను తాము కోల్పోతే.. చాలామంది ప్రేమ కోసం తమను తాము కోల్పోతారు.  ఇలా చేయడం వల్ల ప్రేమించిన వ్యక్తి మీద ఆధారపడినట్టు అవుతుంది.  ఆ వ్యక్తి ఏదైనా అన్నా లేదా దూరమైనా.. ఆ సమయంలో జీవితం మొత్తం శూన్యమైనట్టు అనిపిస్తుంది. అంతే కాదు..  చూసుకోవడానికి  తమకంటూ ఏమీ మిగలకుండా అయినట్టు అనిపిస్తుంది.                                                                                                                                              *రూపశ్రీ.  
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.  అయితే మనిషి మెదడు  ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండదని అంటున్నారు నిపుణులు. సమాచారాన్ని వేగంగా గ్రహించడంలో  సహాయపడటానికి..  మనస్సు కాగ్నిటివ్ బయాసెస్ అని పిలువబడే మానసిక పరిస్థితి పై ఆధారపడుతుంది. ఈ మార్గాలు సమయాన్ని ఆదా చేయగలిగినప్పటికీ, అవి ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే ,  చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకునే విధానాన్ని కూడా వక్రీకరించగలవని అంటున్నారు. దీని ఫలితంగా  మెదడు ఒక విషయాన్ని వేరేగా అన్వయించుకుంటుంది, అందుకే అదే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిర్థారణలో పక్షపాతం..  ఇప్పటికే నమ్ముతున్న విషయాలను బలపరిచే సమాచారం కోసం  మెదడు సహజంగానే వెతుకుతూ ఉంటుందట.  ఎవరితోనైనా విభేదిస్తే, వారితో విభేధించడానికి గల అభిప్రాయానికి గల కారణాలను,  సాక్ష్యాలను విస్మరించి, వారు తప్పు అని చెప్పడానికి గల ప్రతి కారణంపై  దృష్టి పెడతారట. నిజాన్ని తెలుసుకోవడానికి  బదులుగా, మనస్సు తరచుగా తను అనుకున్నదే కరెక్ట్ అనే విషయాన్ని నిరూపించడం  కోసం వెతుకుతూ ఉంటుందట.  ఇలా నిజాలు తెలుసుకునే విషయంలో మెదడు పక్షపాతం వహిస్తుందట. హెలో ఎఫెక్ట్.. చాలామంది చక్కగా దుస్తులు ధరించి,  శుభ్రంగా ఉంటూ, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు.  ఇలాంటి వారి విషయంలో చాలామంది పాజిటివ్ గానూ,  వాళ్లదిమంచి వ్యక్తిత్వం అని అనుకుంటారు.  దీని కారణం మెదడే.. ఇలాంటి వాళ్లు మంచోళ్లు అని మెదడు అనుకుంటుందట.  ఇలాంటి ప్రభావాన్ని హెలో ఎఫెక్ట్ అని అంటారు. ఒక వ్యక్తిలో  మంచి గుణాన్ని గమనించినప్పుడు, ఎటువంటి నిజమైన ఆధారం లేకపోయినా,  మెదడు వారికి ఇతర మంచి లక్షణాలు కూడా ఉన్నాయని దానంతట అదే ఊహించుకుంటుంది. వాస్తవాల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి బదులుగా,  మనస్సు దానికి నచ్చినట్టు మంచి మంచి స్టోరీస్ ను ఊహించుకుని మరీ  వారిని చాలా మంచోళ్లను,  అన్నీ మంచి గుణాలే ఉన్నోళ్లుగా భావిస్తుంది. ఎమోషనల్ లాజిక్.. ఎమోషన్స్ అనేవి వాస్తవాన్ని చూసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైనా ఆందోళనగా అనిపిస్తే, ఆ పరిస్థితి ప్రమాదకరమైనదని అనుకోవడం,  ఎందులో అయినా ఫెయిల్యూర్ ఎదురైతే నిజంగానే పూర్తీగా విఫలమయ్యారని అనుకోవడం జరుగుతుంది. మనిషిలో ఉండే ఫీలింగ్స్  సరైనవే అయినప్పటికీ, అవి ఎల్లప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండవు. ఎమోషన్స్ ను  వాస్తవాల నుండి వేరు చేయడానికి కొంత సమయం తీసుకోవాలి, యాంత్రికంగా రియాక్ట్ అయ్యే  బదులు మరింత ఆలోచనాత్మకంగా స్పందించాలి.  అలా ఉంటేనే మంచిది.  లేకపోతే మెదడు చేతిలో మోసపోవాల్సి వస్తుంది. సన్క్ కాస్ట్ పాలసీ.. ఇప్పటికే చాలా సమయం , శ్రమను  ఒక పని కోసం వెచ్చించారు అనే కారణంతో  అందులో  అలాగే కొనసాగుతూ ఉంటే దాన్ని 'సన్క్ కాస్ట్ ఫాలసీ' (sunk cost fallacy) అంటారు.  మెదడు తరచుగా గత పెట్టుబడిని భవిష్యత్ విలువతో గందరగోళానికి గురిచేస్తుంది. దీనివల్ల ఏదైనా  ఇకపై ఉపయోగపడకపోయినా దాని నుండి బయటపడటం కష్టమవుతుంది.  ఇప్పటికే గడిపిన సమయాన్ని తిరిగి పొందలేరని గుర్తుంచుకోవాలి.  ఎలా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారో అదే  అత్యంత ముఖ్యం. నెగిటివ్  ప్రభావం.. ఎవరైనా విమర్మించినప్పుడు, తిట్టినప్పుడు, బాధపెట్టినప్పుడు.. అది  రోజుల తరబడి మనసులో నిలిచిపోతుంది, కానీ ఎన్నో మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు  త్వరగా మర్చిపోతారు. ఇలా జరగడానికి కారణం, మెదడు సహజంగానే సానుకూల అనుభవాల కంటే ప్రతికూల అనుభవాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఇది  ఒకప్పుడు, ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండటానికి,  మానవులు మనుగడ సాగించడానికి సహాయపడింది. అయితే ఈ రోజుల్లో, ఇది రోజువారీ ఎదురుదెబ్బలను అవి నిజంగా ఉన్నదానికంటే చాలా పెద్దవిగా అనిపించేలా చేస్తుంది. నెగిటివ్ కంటే పాజిటివ్ ను మెదడులో ఇముడ్చుకోవాలి. అప్పుడే మెదడు పనితీరు ఆరోగ్యకరంగా ఉన్నట్టు. స్పాట్ లైట్ ఎఫెక్ట్..  తప్పులను,  రూపాన్ని, లేదా ఒక ఇబ్బందికరమైన క్షణాన్ని అందరూ గమనిస్తారని నమ్మడం చాలా సులభం. వాస్తవానికి, చాలా మంది తమ సొంత జీవితాలు , విషయాలపైనే దృష్టి పెడతారు. ఈ స్పాట్‌లైట్ ఎఫెక్ట్ వల్ల అందరూ తమను నిరంతరం గమనిస్తున్నారనే భావన కలుగుతుంది. కానీ నిజానికి అలా జరగకపోయినా  అదేలా భావిస్తుంటారు. ఈ ఆలోచనను  వదిలేయడం వల్ల,  రోజువారీ జీవితంలో మరింత ఆత్మవిశ్వాసంతో, తక్కువ భయంతో  ఉండటానికి సహాయపడుతుంది. పైన చెప్పుకున్నవిధంగా.. వివిధ కారణాల వల్ల చాలామందికి తమ మెదడే శత్రువులా మారి మోసం చేస్తుంది.                                                                                                                                               *రూపశ్రీ.
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు. అయితే పదేపదే తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు తగ్గకపోవడం లేదా శరీరంలో ఒక వైపు మాత్రమే అకస్మాత్తుగా తిమ్మిరి రావడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడానికి నరాలకు సంబంధించిన సమస్యలు ఒక కారణం కావచ్చు. నరాలు దెబ్బతిన్నప్పుడు తిమ్మిరితో పాటు మంట, జలదరింపు, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా చేతులు, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే శరీరంలో ఒక వైపు అకస్మాత్తుగా చేయి లేదా కాలు తిమ్మిరిగా మారడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. ముఖ్యంగా వీటితో పాటు ముఖం ఒక వైపు వంగడం, మాట స్పష్టంగా రాకపోవడం, నడవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా వచ్చే తిమ్మిరికి, నరాల దెబ్బతినడం లేదా స్ట్రోక్‌కు సంబంధించిన తిమ్మిరికి తేడా ఏమిటి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? శరీరంలో ఒక వైపు మాత్రమే తిమ్మిరి ఎందుకు వస్తుంది? ఈ విషయాలపై Dr. Anirudh Deshmukh ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. సాధారణ తిమ్మిరి ఎప్పుడు ఆందోళన చెందాల్సిన సమస్యగా మారుతుంది? నరాల సమస్యకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? స్ట్రోక్‌ను సూచించే సంకేతాలు ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. అకస్మాత్తుగా ఒక వైపు తిమ్మిరి, బలహీనత లేదా స్ట్రోక్‌ను సూచించే ఇతర లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే వైద్య సహాయం పొందండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తూ చేసే ఒక సాధారణ యోగాభ్యాసం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో చేయడం ముఖ్యమని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ప్రాణాయామం చేయడం సరికాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఉన్న సమస్యలను బట్టి విధానం మారవచ్చు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ శ్రావంతి రఘు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి? వీడియోలో అనులోమ విలోమాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేయాలో చూపించారు. శ్వాసను నెమ్మదిగా, నియంత్రణతో తీసుకోవడం, వదలడం వంటి అంశాలను సరైన పద్ధతిలో పాటించడం గురించి వివరించారు. ప్రాణాయామం చేసేటప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడం, తొందరపడకుండా శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యమైన అంశాలు. మొదటిసారి ప్రయత్నించేవారు నిపుణుల సూచనతో ప్రారంభించడం మంచిది. BP ఉన్నవారు చేయవచ్చా? అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కొన్ని శ్వాసాభ్యాసాలను తగిన జాగ్రత్తలతో చేయవచ్చు. అయితే అధిక బీపీ ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే విధమైన ప్రాణాయామ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా శ్వాసను బిగపట్టడం వంటి పద్ధతులను స్వయంగా ప్రయత్నించకుండా, నిపుణుల సూచనలు పాటించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చేయవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నిపుణుల సలహా తీసుకుని సాధన చేయవచ్చు. అయితే ప్రాణాయామం ఏదైనా వ్యాధికి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులు సూచించిన మందులు, ఆహారం, వ్యాయామాన్ని కొనసాగిస్తూ మాత్రమే యోగాభ్యాసాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. సైనసైటిస్ ఉన్నవారు? సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. ముక్కు పూర్తిగా బ్లాక్‌గా ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు బలవంతంగా శ్వాసాభ్యాసం చేయకూడదు. అవసరమైతే యోగా థెరపిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే స్ట్రెస్, BP శాశ్వతంగా పోతాయా? ప్రాణాయామం వల్ల రిలాక్సేషన్, శ్వాస నియంత్రణ, మానసిక ప్రశాంతతకు సహాయం లభించవచ్చు. అయితే రోజూ 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే స్ట్రెస్ లేదా బీపీ శాశ్వతంగా పూర్తిగా నయమవుతాయని చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఒక వైద్య పరిస్థితి. దాని కోసం వైద్యుల సూచనలు, మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. ఈ వీడియోలో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సరైన పద్ధతి ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రావంతి రఘు వివరిస్తున్నారు. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు బీపీ, డయాబెటిస్, సైనసైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాణాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా థెరపిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)