Publish Date:Feb 10, 2025
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అన్ని రోడ్లూ ప్రయాగ్ రాజ్ వైపే అన్నట్లుగా భక్తుల రాక కొనసాగుతుండటంతో ప్రయాగ్ రాజ్ కు వెళ్లే మార్గాలన్నిటిలోనూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ కారణంగా వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జాం ఇదేనని అధికారులు అంటున్నారు.
Publish Date:Feb 10, 2025
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోమారు నోటీసులు పంపారు. తాడేపల్లి ప్యాలెస్ బయట ఇటీవల స్వల్ప అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పించింది. జగన్ పై హత్యాయత్నం అంటూ వార్తలను వండి వార్చింది. ఈ అగ్నిప్రమాదం తాడేపల్లి ప్యాలెస్ బయట రోడ్డు పక్కన ఉన్న లాన్ లో జరిగింది.
Publish Date:Feb 10, 2025
మాజీ మంత్రి విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఏపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనను వేధించారంటూ కోటి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో విడదల రజనీపై కేసు నమోదైన సంగతి తెలసిందే.
Publish Date:Feb 10, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం ఫిబ్రవరి 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నించిపోయాయి.
Publish Date:Feb 10, 2025
చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 22 మంది రామ సైన్యం పేరిట దేవాలయంలో దూరినట్టు రంగరాజన్ చెప్పారు
Publish Date:Feb 10, 2025
జనసేనాని పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్న ఆయన ఇక ముందగా తాను నిర్ణయించుకున్నట్లు ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరడానికి రెడీ అయిపోయారు.
Publish Date:Feb 10, 2025
రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. స్వయం ప్రకటిత మేధావిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరపరిచితుడు. వైఎస్ కు నమ్మిన బంటుగా ఉండవల్లి రాజకీయాలలో గుర్తింపు పొందారు. ఆయన ఆశీస్సులతో రాజమహేంద్రవరం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ సభ సభ్యుడిగా ఆయన రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏం చేశారో తెలియదు కానీ, రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం ప్రకటించి.. తన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రేయోభిలాషిగా మిగిలిపోయారు.
Publish Date:Feb 10, 2025
జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేస్తున్న లక్ష్మి అనే మహిళను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో లక్ష్మి ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో జైపూర్ పోలీసులు తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద అరెస్ట్ చేశారు
Publish Date:Feb 10, 2025
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని మాపక సిబ్బంది నిన్నటి నుంచి మంటలనార్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మదీనా సమీపంలోని దివాన్ దేవ్ డి ప్రాంతంలో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
Publish Date:Feb 10, 2025
వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులందరూ అటవీ భూముల ఆక్రమణలో నిండా మునిగినట్లే. చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు అందరూ దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని విజిలెన్స్ నివేదిక తేటతెల్లం చేసింది.
Publish Date:Feb 10, 2025
తెలుగు రాష్ట్రాల్లో ఎంఎల్ సి ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.
Publish Date:Feb 10, 2025
స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవాలకు చెల్లు చీటీ పాడే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తున్నది. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ. లోకల్ బాడీ ఎన్నికలలో ఏకగ్రీవాలకు తావులేదని చెబుతూ ఎన్నికలు జరిగి తీరాల్సిందేనంటూ ఓ నివేదిక రూపొందించింది.
Publish Date:Feb 10, 2025
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్య స్నానం ఆచరించారు. అంతకముందు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో లక్నో చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు.