విద్యుత్తు చార్జీల పై చిరు రివర్స్ గేర్

Publish Date:Mar 31, 2013

Advertisement

 

 

 

 

విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయాన్ని తప్పుబడుతూ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆయన ఆజాద్‌కు ఆ లేఖ పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై విద్యుత్ భారం మోపడం సరికాదంటూ దానివల్ల జరిగే నష్టాలను లేఖలో వివరించారు.


ఈఆర్సీ టారిఫ్ నిర్ణయించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, కానీ, ఉపసంఘం పరిశీలన లేకుండానే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయంటూ నిర్ణయం తీసేసుకున్నారని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు, మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉండగా విద్యుత్ చార్జీలను పెంచారని, ఇది ఎన్నికల్లో విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.


ఇప్పటికే విపక్షాలన్నీ విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్యమబాట పట్టాయని, కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. చార్జీల పెంపుపై నియోజకవర్గాల్లో సమాధానం చెప్పుకోవడం పార్టీ నేతలకూ ఇబ్బందికరమేనన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆ లేఖలో ఆజాద్‌ను కోరారు.

By
en-us Political News

  
తెలంగాణ‌లో రోజుకు 2వేల పైచిలుకు క‌రోనా కేసులు. అదే ఏపీలో రోజూ నాలుగున్న‌ర వేల‌కు పైగా కేసులు. రెండు వేల కేసులొస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఎందుకైనా మంచిద‌ని విద్యార్థుల‌కు సంక్రాంతి సెల‌వులు పెంచింది. జ‌న‌వ‌రి 30 వ‌ర‌కూ హాలిడేస్ ప్ర‌క‌టించింది. ఇక‌, రోజూ సుమారు 5వేల కేసులు వ‌స్తున్న ఏపీలో మాత్రం సెల‌వులు పెంచే ప్ర‌స‌క్తేలేదంటోంది ప్ర‌భుత్వం. ఆ మేర‌కు విద్యాశాఖ మంత్రి సురేశ్ క్లారిటీ ఇచ్చేశారు. 
కాంగ్రెస్ పార్టీలో ముఠా తగాదాలు,అంతర్గత కుమ్ములాటలు మామూలు వ్యవహరం. చేతికి ఉన్న ఐదేళ్లు ఎలా అయితే, సమానంగా ఉండవో, అదేవిధంగా హస్తం పార్టీలో అందరూ ఒకే మాట మీద ఉండరు. తెలంగాణలో అయితే, ఈ పరిస్థితి కొంచెం ఎక్కువగానే శ్రుతిమించి రాగాన పడింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన దగ్గర నుంచి, సీనియర్ నాయకులు చిర్రుబుర్రులాడుతూనే ఉన్నారు.చాప కింద నీరులా అసమ్మతి సెగ రాజేస్తునే ఉన్నారు.
భోజ‌న‌మంటే ఏముంటుంది? అన్నం, రెండు మూడు కూర‌లు, సాంబార్‌, పెరుగు, స్పీట్‌. అంతేగా. పోనీ, పండ‌గ స్పెష‌ల్ అనుకుంటే.. మ‌రో నాలుగైదు వెరైటీలు అద‌నం. ఎంత‌కాద‌న్నా.. 20-25 ఐట‌మ్స్‌కు మించి ఉండ‌వు. కానీ, గోదారోళ్లు ఆతిథ్యం అలా ఆషామాషీగా ఉండ‌దుగా. అస‌లే సంక్రాంతి. కాబోయే అల్లుడు ఇంటికొచ్చె. ఇక ఆ వంట‌కాలు మామూలుగా ఉంటాయా చెప్పండి. విందు భోజ‌నంతో వెర్రెత్తించింది ఓ కుటుంబం. 
అదో క‌న్వెన్ష‌న్. పెళ్లిళ్లు, ఫంక్ష‌న్లు జ‌రిగే ఫంక్ష‌న్ హాల్‌. మామూలుగా అయితే ఇంతే. కానీ, అది వైసీపీ నేత‌, మంత్రి కొడాలి నానికి చెందిందైతే అంత రొటీన్‌గా ఎందుకుంటుంది. కొడాలి నోరులానే.. గుడివాడ కె క‌న్వెన్ష‌న్‌ను గ‌బ్బు  గ‌బ్బు చేసేశారు. గుడివాడ‌కు గోవా క‌ల్చ‌ర్‌ను తీసుకొచ్చారు. సంక్రాంతి సంద‌ర్బంగా.. మందు, చిందు, జూదంతో ర‌చ్చ రంబోలా చేస్తున్నార‌ని అంటున్నారు. 
ఒమిక్రాన్ ఎరియంట్’గా కరోనా మహమ్మారి  మళ్లీ విజృంభిస్తున్న నేపద్యంలో రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా అధికార వర్గాల సమాచారం. ఓ వంక కేంద్ర ప్రభుత్వం, స్థానిక పరిస్థితుల అదారంగా అవసరమైన మేరకు ఆంక్షలు విధించాలని, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.అదే సమయంలో ఆర్థిక, ఉపాథి కార్యక్రమాలు దెబ్బ తినకుండా, సామాన్యుల జీవనోపాధికి సమస్యలు లేకుండా  చర్యలు ఉండాలని సూచించింది. ఈ నేపధ్యంలో, కరోనా కట్టడిలో తొలి చర్యగా తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ సలహా మేరకు అన్ని విద్యాలయాలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ విద్యా సంస్థల సెలవులను పొడిగిస్తూ కీలక ప్రకటన చేశారు.
మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలనుంచి తాను పూర్తిగా వైదొలిగినట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనకు రాజ్య  సభ టికెట్ ఆఫర్ చేశారని, అందుకు తాను అంగీకరించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు.
దేశ వ్యాప్తంగా కొవిడ్ -19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి నేటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. గత సంవత్సరం ఇదే రోజున  దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. చరిత్రలో ఈ రకమైన అత్యంత భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడు లేదని తెలిపారు.
బాల‌య్య జోష్ అన్‌స్టాప‌బుల్‌. రీల్ లైఫ్‌లోనే  కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ బాల‌య్య ఎన‌ర్జీ, ఎంజాయ్‌మెంట్ అన్‌స్టాప‌బుల్‌. మామూలుగానే అఖండ జోరు మామూలుగా ఉండ‌దు. అలాంటిది త‌న‌కిష్ట‌మైన‌ సంక్రాంతి పండ‌గంటే.. ఇక శాత‌క‌ర్ణి ఆగుతారా.. అందుకే అక్కింట్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కారంచేడులో బాల‌కృష్ణ సంక్రాంతి వేడుక‌లను ఓ రేంజ్‌లో సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. 
ఆర్మీ జ‌వాన్లు సిన్సియ‌ర్‌గా ఉంటారు. ప్రాణాలు పోయినా త‌ప్పుడు ప‌నులు చేయ‌ర‌ని అనుకుంటారు. అయితే, అంద‌రు ఆర్మీ వాళ్లూ ఒకేలా ఉండ‌రు. అందులోనూ కొంద‌రు వెద‌వ‌లు ఉంటారు. అలాంటి ఓ ఆర్మీ సోల్జ‌ర్‌.. ఓ భారీ మోసానికి పాల్ప‌డ్డారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టి 50 కోట్లు అప్పుల పాల‌య్యాడు. ఆ అప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు.. ఆర్మీ ముసుగులో ఏకంగా 125 కోట్లు దోచేశాడు. విదేశాల‌కు పారిపోవాల‌నుకున్నాడు. అంత‌లోనే  ఆ ఆర్మీ ఆఫీస‌ర్ బండారం బ‌య‌ట‌ప‌డ‌టంతో.. వాడి ఖేల్‌ ఖ‌తం. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...
వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు క‌రోనా బారిన ప‌డ్డారు. జ‌లుబు, ఒళ్లు నొప్పులు ఉండ‌టంతో.. కొవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వ‌చ్చింద‌ని అంబ‌టి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తాను క్వారంటైన్‌కు వెళుతున్నాన‌ని.. త‌న‌ను క‌లిసిన వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.
తెలంగాణ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు పొడిగించింది. క‌రోనా కేసులు భారీగా పెరుగుతుండ‌ట‌మే ఇందుకు కార‌ణం.    
ఖాకీలు రెచ్చిపోయారు. టీడీపీ వారిపై విరుచుకుప‌డ్డారు. పై నుంచి ఆర్డ‌ర్స్ వ‌చ్చాయో ఏమో.. ఓ రేంజ్‌లో కుమ్మేశారు. ప్రజాస్వామ్య‌యుతంగా ఆందోళ‌న చేయ‌డ‌మే టీడీపీ శ్రేణులు చేసిన త‌ప్పు. అంతే. పోలీసులు ప‌సుపుద‌ళంపై దండ‌యాత్ర చేశారు. మీద‌ప‌డి దాడి చేశారు. పోలీసుల ఓవ‌రాక్ష‌న్ ఇప్పుడు ఓ టీడీపీ నేత ప్రాణాల మీద‌కు వ‌చ్చింది. 
విరాట్ కోహ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి బై బై చెప్పేశారు. ఇప్ప‌టికే విరాట్ టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్ప‌గా.. అందుకు రివేంజ్‌గా అన్న‌ట్టు బీసీసీఐ కోహ్లీని వ‌న్డే కెప్టెన్సీ నుంచి ప‌క్క‌కు త‌ప్పించింది. అప్ప‌టి నుంచీ అసంతృప్తిగా ఉన్న విరాట్‌.. తాజాగా ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓడిపోవ‌డంతో.. ఇక త‌ను టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్న‌ట్టు సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఈ న్యూస్ ఫ్యాన్స్‌కు నిజంగా షాకింగ్ న్యూసే. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.