సికింద్రాబాద్‌లో 800 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం

Publish Date:Mar 17, 2026

Advertisement

 

సికింద్రాబాద్ పార్సిగుట్టలో “ఫ్రెష్” అనే పేరుకు అసలు అర్థం ఏమిటో కొత్తగా నిర్వచనం చెప్పిన ఘటన వెలుగులోకి వచ్చింది. బయట బోర్డు మీద “ఏ వన్ ఫ్రెష్ చికెన్” అని మెరిసిపో తుంటే, లోపల మాత్రం కుళ్లిపోయిన చికెన్ నిల్వల తో దుర్వాసన రాజ్యం నడుస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం అధికా రులు కలిసి దాడి చేయ డంతో అసలు కథ బట్టబయలైంది. ఏ వన్ ఫ్రెష్ చికెన్ షాప్లో తాజాగా అమ్మాల్సిన చికెన్… “కాలం చెల్లిన క్లాసిక్”గా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి విక్రయిస్తున్న దృశ్యాలు చూసి అధికా రులు అవాక్కయ్యారు.

“ఫ్రెష్” అంటే రోజూ కట్ చేసిన చికెన్ అనుకుంటే పొరపాటే! ఇక్కడ ఫ్రెష్ అంటే “ఎప్పట్నుంచో ఫ్రిజ్‌లో ఫ్రీగా ఉన్నది” అన్నమాట...నడుస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం అధికారులు కలిసి దాడి చేసి.. సుమారు 800 కిలోల కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అది కేవలం షాపుకే కాకుండా వైన్స్, బార్‌లు, రెస్టారెంట్లకు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. “కిక్కు ఎక్కితే ఏం తింటున్నారో ఎవరికీ తెలియదు” అన్న ధీమాతో సరఫరా కొనసాగిందన్న మాట. ఇక లైసెన్స్ విషయానికి వస్తే… అది కూడా “చరిత్ర”లో భాగమే. గత జనవరిలోనే ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినా, వ్యాపారం మాత్రం పూర్తి ఊపులో సాగింది. అనుమతులకు విరుద్ధంగా గోడౌన్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

దాడి సందర్భంగా షాపు నిర్వాహకుడు షకీల్‌తో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ “ఫ్రెష్ కథ”లో ఇంకా ఎన్ని లింకులు బయటపడతాయో తెలుసుకునేందుకు టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఆరోగ్య శాఖ అధికారి అగ్నివేష్ మాట్లాడుతూ, ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించగా భారీగా నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన చికెన్ బయటపడిందని తెలిపారు. నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించామని, నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీఎన్ఎస్ చట్టం ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తానికి… “ఫ్రెష్” అనే బోర్డు చూసి నమ్మే రోజులే పోయాయి

By
en-us Political News

  
ప్రముఖ ఐటీ సంస్థలైన టీసీఎస్ కోల్ ‌కతా, టెక్ మహీంద్రా గోరేగావ్, హుబ్లీలోని ఇన్ఫోసిస్ కార్యాలయాల్లో పక్షపాత ధోరణులు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రార్థన సమయాల్లో వెసులుబాటు, సెలవుల మంజూరు, మతపరమైన చిహ్నాల ధారణ వంటి విషయాల్లో అసమాన నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు. గుర్గావ్ లోని విప్రో, హైదరాబాద్ లోని ఎల్ అండ్ టీ వంటి సంస్థల ఉద్యోగుల నుంచి కూడా దాదాపు ఇలాంటి పోస్టులే దర్శనమిస్తున్నాయి.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ ఉద్దేశాలపై అనుమానం వ్యక్తం చేసింది. ఓఆర్‌ఆర్‌ ఎక్కడ నిర్మించాలో ఒక రైతు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తూ.. ఇటీవల కాలంలో చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలను రాజకీయ దురుద్దేశాల దాఖలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఆపాలంటూ దాఖలైన ఈ పిటిషన్ కూడా అలాంటిదేనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వీడియోలో పునరుద్ఘాటించారు. తనపై ఇంత పెద్ద అభియోగం రావడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలకు పూర్తిగా సహకరిస్తానన్న మంగ్లీ, ఈ ఫైనాన్స్ చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదానికి తనకూ ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.
వర్క్ ప్లేస్ సమానత్వం అన్నది ఒక కంపెనీ సమస్య కాదు, దేశ భవిష్యత్తు ఈ ఆరోపణలు నిర్ధారించని వాంగ్మూలాలు అయినప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు.
నవ్వుతూ ఆపరేషన్ థియోటర్ కువెళ్లిన హారిక మరణించిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగపోయారు. ఆపరేషన్ వికటించి హారిక మరణించిందని వైద్యులు చెప్పారు.
తంలోలా కాకుండా, ఈసారి ప్రజలకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అనే వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. గురువారం నుండి ఈ నెల 30 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
ప్రమాద సమయంలో బోలేరో వాహనంలో మొత్తం 21 మందిఉన్నారు. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
14 ఏళ్ల ఇసా అరాస్ మెర్సిన్లీ అనే విద్యార్థి బుధవారం స్కూలుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో రెండు వేర్వేరు తరగతి గదుల్లో అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా పేలిన తూటాలతో విద్యార్థులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా బలగాల కదలికలను పర్యవేక్షించేందుకు ఇరాన్ ఆధునిక సాంకేతికతను ఆశ్రయించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన ఒక నిఘా ఉపగ్రహాన్ని ఇరాన్ ఉపయోగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. చైనాకు చెందిన ఎర్త్ ఐ కంపెనీ అభివృద్ధి చేసిన టీఈఈ 01బి శాటిలైట్ ద్వారా ఇరాన్ సక్సెస్ ఫుల్ గా అమెరికా సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది.
మట్టి లేకుండానే పంట.. ఇండోర్ సాగులో సరికొత్త రికార్డు సృష్టించిన యువ రైతులు.
రఘురామ కృష్ణరాజు ఆకివీడు రామాలయం అంశంపై బుధవారం హైకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించటం చర్చనీయాంశమైంది.
పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై ఇటీవల వెలువడుతున్న స్కాం ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.