ఆకివీడు కేసులో హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ

Publish Date:Apr 15, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు ఆకివీడు రామాలయం అంశంపై బుధవారం హైకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించటం చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై విజయవాడలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణం అనుమతులు లేకుండా జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన రఘురామ కృష్ణంరాజు స్వయంగా కోర్టుకు వెళ్లి తన వాదనలు వినిపించారు.

విచారణ సందర్భంగా రామాలయం నిర్మాణం భక్తుల విరాళాలతో జరుగుతోందని, అన్ని చట్టబద్ధ అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు కొనసాగిస్తామని రఘురామ కోర్టుకు హామీ ఇచ్చారు. చట్టపరమైన నిబంధనలను పూర్తిగా పాటిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో కోర్టు రామాలయంపై ఎటువంటి ప్రతికూల ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు, తన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. అలాగే చట్టపరమైన నిబంధనలు పాటిస్తామని ప్రభుత్వం నుంచి అండర్‌టేకింగ్ ఇవ్వాలని కోర్టు కోరగా, అందుకు ప్రభుత్వ న్యాయవాదులు అంగీకరించారని, దీంతో కేసు ముగించారన్నారు. 

అలాగే ఆలయం, చర్చి, మసీదు అన్న తేడా లేకుండా అన్ని మతపరమైన కట్టడాలకు చట్టం సమానంగా వర్తించాలన్నారు. ఏ నిర్మాణానికైనా జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఈ విషయంపై ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ఇతర అవసరాల పేరుతో అనుమతులు తీసుకుని మతపరమైన కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. కల్వరి టెంపుల్ పేరిట తాడేపల్లిగూడెం, నంబూరు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అయితే అధికారులు ఇప్పటికే ఈ అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపచేసేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. 

ఆకివీడు రామాలయం అంశం గురించి మీడియా ద్వారా తెలిసిందని, అక్కడికి వెళ్లే సమయంలో తనపై అడ్డంకులు సృష్టించారన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో స్వయంగా వాదనలు వినిపించాల్సి వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను అందరూ పాటించకపోతే ప్రజల్లో తప్పు సందేశం వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ మతానికి చెందినదైనా అక్రమ నిర్మాణాలను పాలకులు సహించరాదన్నారు. రామాలయానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ, నూతనంగా అన్ని అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణం కొనసాగుతుందని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ వ్యతిరేక మీడియా తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాయని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి రాజ్యాంగ విలువలను కాపాడేందుకు తాను చేస్తున్న కృషి వల్ల ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు ను, అడ్డుకునేందుకే సదరు మీడియా ఈ తరహా కుట్ర చేస్తోందని ఆరోపించారు.

By
en-us Political News

  
మట్టి లేకుండానే పంట.. ఇండోర్ సాగులో సరికొత్త రికార్డు సృష్టించిన యువ రైతులు.
పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై ఇటీవల వెలువడుతున్న స్కాం ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోల సృష్టి మరియు వ్యాప్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కూట‌మి ప్ర‌భుత్వం కృషితో క్రీడావికాసం సాధ్య‌మ‌వుతోంద‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ఉన్న సామాజిక పరిస్థితులు వేరు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వేరని వారు వాదిస్తున్నారు. కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల, అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారి వాదనలో వ్యక్తమవుతోంది. ఆర్థిక అసమానతల అంశంపై చర్చ తీవ్రమవుతున్న తరుణంలో.. కులం కంటే ఆర్థిక స్థితే ముఖ్యం అనే నినాదం బలంగా వినిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చినప్పటికీ, జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.
మీసేవ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు.
అథ్లెటిక్స్ ప్రపంచంలో పరుగు అంటేనే గుర్తొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. ఆయన సృష్టించిన రికార్డులు దశాబ్ద కాలంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి.
ఇరాన్ తో అమెరికా యుద్ధం అన్నది ఒక పెద్ద వ్యూహంలో చిన్న ఆటవిడుపు మాత్రమే అంటున్నారు అంతర్జాతీయ వ్యూహకర్తలు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ, ఒక భారీ వ్యూహంలో భాగమైన చిన్న చిన్న ఘర్షణలు మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అసలు సిసలు యుద్ధం అగ్రరాజ్యం అమెరికాకు, వేగంగా పురోగమిస్తూ.. అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతున్న చైనాకు మధ్య జరుగుతోంది.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
వెనిజులాలో రాజకీయ మార్పులు అక్కడి నుంచి చమురు సరఫరా అంతరాయం. ఇరాన్ లో ఘర్షణలు, చమురు ఎగుమతులు దెబ్బతినడం. రష్యాపై ఆంక్షలు, సరఫరా పరిమితి, సౌదీ ఉత్పత్తి తగ్గుదల, ధరలు పెరుగుదల. వీటి ఫలితంగా.. చైనా రోజువారీ చమురు దిగుమతుల్లో 20 శాతం తగ్గుదల. ఇది చైనా ఆర్థిక ఇంజిన్ కు పెద్ద దెబ్బ.
కాకినాడ పోలీసులు ప్రత్యేక బృందాలతో అతని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసి మంగళవారం తన తండ్రితో కలిసి ఒక పార్కులో ఉన్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం కాకినాడకు తరలించినట్టు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.