Publish Date:Apr 16, 2026
ఇటీవల ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఈ వ్యూహాత్మక మార్పులో ఒక కీలక మైలురాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభింస్తుంది. దీనివల్ల మలక్కా జలసంధి గుండా సాగే నౌకాయానాన్ని నిరంతరం పర్యవేక్షించే సామర్థ్యం అమెరికాకు పెరుగుతుంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల కదలికలపై ఆంక్షలు విధించి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా, ఇప్పుడు అదే తరహా ఒత్తిడిని చైనాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.
Publish Date:Apr 16, 2026
హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పై ఒత్తిడి పెంచిన తర్వాత, ఇప్పుడు అమెరికా దృష్టి మలక్కా జలసంధి వైపు మళ్లింది. ఇది చైనా ఎనర్జీ భద్రతకు అత్యంత కీలకమైన మార్గం. ఇటీవల ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న కొత్త రక్షణ ఒప్పందం, ఈ వ్యూహాత్మక మార్పుకు ప్రధాన సూచికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:Apr 16, 2026
లోకేష్ కన్నా అర్హులెవరు? ఏపీ భావి ముఖ్యమంత్రి ఆయనే.. వర్మ సంచలన వ్యాఖ్యలు!
Publish Date:Apr 16, 2026
ప్రముఖ ఐటీ సంస్థలైన టీసీఎస్ కోల్ కతా, టెక్ మహీంద్రా గోరేగావ్, హుబ్లీలోని ఇన్ఫోసిస్ కార్యాలయాల్లో పక్షపాత ధోరణులు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రార్థన సమయాల్లో వెసులుబాటు, సెలవుల మంజూరు, మతపరమైన చిహ్నాల ధారణ వంటి విషయాల్లో అసమాన నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు. గుర్గావ్ లోని విప్రో, హైదరాబాద్ లోని ఎల్ అండ్ టీ వంటి సంస్థల ఉద్యోగుల నుంచి కూడా దాదాపు ఇలాంటి పోస్టులే దర్శనమిస్తున్నాయి.
Publish Date:Apr 16, 2026
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ ఉద్దేశాలపై అనుమానం వ్యక్తం చేసింది. ఓఆర్‌ఆర్ ఎక్కడ నిర్మించాలో ఒక రైతు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తూ.. ఇటీవల కాలంలో చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలను రాజకీయ దురుద్దేశాల దాఖలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఆపాలంటూ దాఖలైన ఈ పిటిషన్ కూడా అలాంటిదేనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Publish Date:Apr 16, 2026
వర్క్ ప్లేస్ సమానత్వం అన్నది ఒక కంపెనీ సమస్య కాదు, దేశ భవిష్యత్తు
ఈ ఆరోపణలు నిర్ధారించని వాంగ్మూలాలు అయినప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు.
Publish Date:Apr 16, 2026
నవ్వుతూ ఆపరేషన్ థియోటర్ కువెళ్లిన హారిక మరణించిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగపోయారు. ఆపరేషన్ వికటించి హారిక మరణించిందని వైద్యులు చెప్పారు.
Publish Date:Apr 16, 2026
తంలోలా కాకుండా, ఈసారి ప్రజలకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అనే వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. గురువారం నుండి ఈ నెల 30 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
Publish Date:Apr 16, 2026
ప్రమాద సమయంలో బోలేరో వాహనంలో మొత్తం 21 మందిఉన్నారు. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Publish Date:Apr 16, 2026
14 ఏళ్ల ఇసా అరాస్ మెర్సిన్లీ అనే విద్యార్థి బుధవారం స్కూలుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో రెండు వేర్వేరు తరగతి గదుల్లో అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా పేలిన తూటాలతో విద్యార్థులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
Publish Date:Apr 15, 2026
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా బలగాల కదలికలను పర్యవేక్షించేందుకు ఇరాన్ ఆధునిక సాంకేతికతను ఆశ్రయించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన ఒక నిఘా ఉపగ్రహాన్ని ఇరాన్ ఉపయోగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. చైనాకు చెందిన ఎర్త్ ఐ కంపెనీ అభివృద్ధి చేసిన టీఈఈ 01బి శాటిలైట్ ద్వారా ఇరాన్ సక్సెస్ ఫుల్ గా అమెరికా సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది.
Publish Date:Apr 15, 2026
మట్టి లేకుండానే పంట.. ఇండోర్ సాగులో సరికొత్త రికార్డు సృష్టించిన యువ రైతులు.
Publish Date:Apr 15, 2026
రఘురామ కృష్ణరాజు ఆకివీడు రామాలయం అంశంపై బుధవారం హైకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించటం చర్చనీయాంశమైంది.