LATEST NEWS
  తెలుగువన్ ‘వాస్తవ వేదిక’లో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని తాజా రాజకీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు వాయిదా పడటం మహిళలను నిరుత్సాహానికి గురిచేస్తోందని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, మహిళలకు నిరీక్షణ కొత్త విషయం కాదని, 1996లో మాజీ ప్రధాని దేవేగౌడ కాలం నుంచి ఈ అంశం పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ఈ బిల్లుకు మద్దతు తెలిపిందని, బీజేపీ మాత్రం ఇటీవలి కాలంలో ఒకసారి మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంలో మహిళలకు సమాన హక్కులపై స్పష్టత లేదని, వారు మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరిస్తారని డోలేంద్ర ప్రసాద్ విమర్శించారు. మనుస్మృతిలో మహిళలకు సముచిత గౌరవం, హక్కులు లేవని, కుటుంబ పరిమితుల్లోనే వారి పాత్రను పరిమితం చేసినట్టు ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల లోక్‌సభలో ఆమోదం పొందిన 2023 మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో ఆలస్యం జరుగుతుందని, 2034 వరకు అమలు అయ్యే అవకాశం లేదని ఆయన తెలిపారు. అలాగే డిలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఈ అంశంపై గట్టిగా స్పందించడం లేదని రవిశంకర్ ప్రశ్నించగా, చెన్నైలో డిలిమిటేషన్ వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశానికి కేటీఆర్ హాజరై మద్దతు తెలిపారని డోలేంద్ర ప్రసాద్ వివరించారు. కేంద్ర రాజకీయాలపై మాట్లాడిన ఆయన, ఒకప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొకున్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు ప్రధాని మోదీ ముందు ఒత్తిడికి లోనవుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళలకు రాజకీయ ప్రతినిధ్యం పెరిగితే వారి జీవితాల్లో మార్పు వస్తుందా అనే ప్రశ్నను రవిశంకర్ ముందుకు తెచ్చారు. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.
  యువత తెలంగాణ జాగృతి పార్టీలో చేరాలని కవిత విన్నపం.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన ఒక రాజకీయ చేరికల సభను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు తెలంగాణలో యువత లేరా? లేక వారందరినీ విస్మరిస్తున్నారా? అంటూ ఆమె చేసిన ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరిక సభను ఉద్దేశించి కవిత తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. 75 ఏళ్ల వయసున్న నేతలను నవ యువకులుగా పేర్కొంటూ, వారే రాష్ట్రానికి దిక్కు అని చెప్పడం ఏంటని ఆమె నిలదీశారు. రాజకీయాల్లో వయసు మళ్లిన నాయకులనే పదే పదే తెరపైకి తీసుకురావడం యువత ఆకాంక్షలను అవమానించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. పదవుల కోసం, రాజకీయ లబ్ధి కోసం యువతను కాదని, సీనియర్లకే ప్రాధాన్యత ఇవ్వడం సమంజసమేనా అని ఆమె ప్రశ్నించారు. ఈ తరహా రాజకీయాలు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని, ఇప్పటికైనా పార్టీలు యువతకు సరైన వేదిక కల్పించాలని ఆమె సూచించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా తన సొంత పార్టీ నాయకత్వంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీలో మహిళలకు సరైన గౌరవం లేదని, స్వార్థపూరిత నిర్ణయాల వల్లే పార్టీ ఇప్పుడు ఈ స్థితికి చేరుకుందని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్ కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు స్వార్థపరుల వల్లే ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆమె విశ్లేషించారు. ఓటమికి కార్యకర్తలను, ప్రజలను నిందించడం సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ డీల్స్ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ప్రతిపక్షం లేకుండా చేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. కోర్టు తీర్పుల విషయంలో సీఎం వ్యాఖ్యలు సరికాదని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు కేవలం అధికార ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని కవిత కోరారు. రాబోయే కాలంలో కొత్త తరహా రాజకీయాలతో ప్రజల ముందుకు వస్తున్నానని, తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో యువతకు భాగస్వామ్యం పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బుధవారం (ఏప్రిల్ 22) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక రాజకీయ యోధుడిగా నాదెండ్ల ప్రస్థానం సాగిందని పేర్కొన్న చంద్రబాబు ఆయన మృతి పట్ల  ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతే కాదు నాదెండ్ల భాస్కరరావు భౌతికకాయానికి నివాళులర్పించడమే కాకుండా.. ఆయన కుమారుడు, ప్రస్తుత రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషాద సమయంలో మనోహర్‌కు,  వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేసిన ముఖ్యమంత్రి, నాదెండ్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి నాదెండ్ల భాస్కరరావు పలు సందర్భాల్లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గత కొన్నేళ్లుగా నాదెండ్ల భాస్కరరావు యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా ఎన్టీఆర్, చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా.. చంద్రబాబు వాటన్నింటినీ  పక్కన పెట్టి సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు పట్ల గౌరవం ప్రదర్శించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే..  కానీ మరణం సంభవించినప్పుడు వ్యక్తిగత విభేదాలకు, రాజకీయ  విభేదాలకు తావు ఉండకూడదని చంద్రబాబు నిరూపించారు. రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయన్న విమర్శల నడుమ.. ముఖ్యమంత్రి చంద్రబాబు హుందాగా వ్యవహరించారు.  గతాన్ని మరిచి, ఒక సీనియర్ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం ద్వారా చంద్రబాబు తన రాజకీయ పరిణితిని చాటుకున్నారు. ఒకప్పుడు రాజకీయంగా బద్ధశత్రువులుగా ఉన్నప్పటికీ, అంతిమంగా మానవీయతకే చందరబాబు పెద్దపీట వేశారని  రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.  అది పక్కన పెడితే నాదెండ్ల భాస్కరరావు మృతితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసినట్లయింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా నాదెండ్ల మృతికి సంతాపం ప్రకటించారు. 
1984 నాటి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు ఘటన చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో అతిపెద్ద మలుపు అని చెప్పవచ్చు. ఆ సమయంలో ఆయన ప్రదర్శించిన రాజకీయ చతురత, వ్యూహాలే ఆయనను ఒక శక్తిమంతమైన నాయకుడిగా నిలబెట్టాయి. చంద్రబాబు హీరోగా ఎదగడానికి ఆ ఘటన ఎలా కారణమైందంటే.. నాటి  సంక్షోభంలో సమర్థత,  క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏమిటో చూపించింది. చంద్ర‌బాబును ఇక్క‌డే ఈ ఘ‌ట‌న ఒక స‌మ‌ర్ధుడిగా నిల‌బెట్టింది.  ఆ నాడు ఏం జ‌రిగిందంటే..  ఎన్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన  రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని బెంగళూరు, మైసూర్ వంటి ప్రాంతాలకు తరలించడంలో చంద్రబాబు తనను తాను నిరూపించుకున్నారు. అప్పటి గవర్నర్ రామ్ లాల్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రపతి ముందు పరేడ్ చేయించడం వెనుక మాస్టర్ మైండ్ చంద్రబాబే. అంతకుముందు వరకు చంద్రబాబును కాంగ్రెస్ నుంచి వచ్చిన అల్లుడు,  ఒక ర‌కంగా  కోవ‌ర్ట్ గా భావించి, అనుమానించిన పార్టీ కార్యకర్తలు.. ఎన్టీఆర్ అభిమానులు.. ఈ ఘటన తర్వాత ఆయనను ఎన్టీఆర్ కు కుడిభుజంగా చూడటం మొదలుపెట్టారు. ఆపదలో ఉన్న మామకు అండగా నిలబడి, తిరిగి ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంలో చంద్రబాబు సఫలమయ్యారు.  ఆ 30 రోజుల ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ యంత్రాంగంతో చంద్రబాబుకు బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. ఇదే భవిష్యత్తులో ఆయన పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎదగడానికి పునాది వేసింది. 1984 ఘటన చంద్రబాబులోని రాజకీయ ప్రతిభను లోకానికి చాటిచెప్పింది. ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయి నుండి పార్టీని శాసించే స్థాయికి ఆయన ఎదగడానికి ఆ సంక్షోభమే ప్రధాన కారణమైంది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23) ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే బూత్ ల వద్ద భారీగా బారులు తీరారు.  ఇక పశ్చిమ బెంగాల్ లోని 16 జిల్లాల్లోని 152 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా త్రిముఖ పోరు జరుగుతోంది.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్ లో 4,023 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ 5.73 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యతం తేల్చనున్నారు. ఓటర్లలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులున్నారు.తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఒక పశ్చిమ బెంగాల్‌లో తొలివిడత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది.ఈ విడతలో   1478 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  వీరిలో  1.75 కోట్ల మంది మహిళలున్నారు. బెంగాల్‌లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధాన పోరు సాగుతున్నది. పోలింగ్‌ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.తమిళనాడులో ఉదయం 9గంటల వరకు 17.69 శాతం, పశ్చిమబెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదైంది. 
ALSO ON TELUGUONE N E W S
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ 'డార్లింగ్' (Darling) నేడు మళ్ళీ థియేటర్లలోకి అడుగుపెట్టింది. సుమారు 16 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైనప్పటికీ, ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి. (Darling Re Release) హైదరాబాద్‌లోని ప్రధాన థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్‌లలో కూడా 'డార్లింగ్' షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఉదయం షోల నుండే ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. కేవలం అభిమానులే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను మళ్లీ వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా 'డార్లింగ్', రీ-రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. సినిమాలోని ఒక్కో పాటకూ, డైలాగ్‌కూ అభిమానులు పేపర్లు చల్లుతూ, డాన్సులు చేస్తూ థియేటర్లను హోరెత్తిస్తున్నారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్ మధ్య కెమిస్ట్రీని, కరుణాకరణ్ మార్క్ ఫీల్ గుడ్ సీన్స్‌ని మళ్లీ పెద్ద తెరపై చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #Darling4K హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, 'డార్లింగ్' రీ-రిలీజ్ మొదటి రోజు వసూళ్లు అనేక చిన్న సినిమాల ఫుల్ రన్ కలెక్షన్ల కంటే ఎక్కువగా ఉండబోతున్నాయని సమాచారం. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వరల్డ్ వైడ్ గా రూ.3 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.5 కోట్లకు పైగా ఉండే అవకాశముంది.  
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela) బాలీవుడ్ డెబ్యూ మూవీ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.  కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని, విడుదల వాయిదా పడే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై దర్శకుడు అనురాగ్ బసు ఎట్టకేలకు స్పందించారు. ఈ సినిమా గురించి వస్తున్న రూమర్లను అనురాగ్ బసు కొట్టిపారేశారు. సినిమా పనులు పక్కా ప్లానింగ్‌తో జరుగుతున్నాయని, ఎక్కడా షూటింగ్ ఆగిపోలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్, కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ సినిమాతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీక్ - శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ఈ మ్యూజికల్ డ్రామాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అనురాగ్ బసు తన మార్క్ ఎమోషన్స్, అద్భుతమైన మ్యూజిక్‌తో ఈ ప్రేమకథను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ప్రస్తుతానికి సినిమా విడుదలలో ఎటువంటి మార్పులు లేవని, అనుకున్న సమయానికే ప్రేక్షకు ముందుకు వస్తుందని చిత్ర బృందం చెబుతోంది. శ్రీలీల ఈ క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌తో అక్కడ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.  
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అంటార్కిటికాలోని గడ్డకట్టే మంచు లొకేషన్లలో శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ భారీ షెడ్యూల్ ముగిసిన వెంటనే చిత్ర యూనిట్ ఒక లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ బ్రేక్ వెనుక జక్కన్న ఒక భారీ స్ట్రాటజీని సిద్ధం చేశారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రియలిస్టిక్ విజువల్స్ కోసం రాజమౌళి ఎక్కడా రాజీ పడకుండా ఎక్స్‌ట్రీమ్ లొకేషన్లను ఎంచుకున్నారు. అంటార్కిటికాలో జరుగుతున్న ఈ షెడ్యూల్ సినిమాలోనే అత్యంత కీలకమైనదిగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక టీమ్ లాంగ్ బ్రేక్ తీసుకోనున్నట్లు టాక్. ఈ గ్యాప్‌లో పోస్ట్-ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించనుంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు క్వాలిటీగా రావడం కోసమే రాజమౌళి ఈ లాంగ్ బ్రేక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజీపై ఫోకస్ పెట్టనున్నారని సమాచారం. మరోవైపు, 'వారణాసి' మూవీ ఏప్రిల్ 24న మెక్సికోలో జరగనున్న 'CCXP Mexico 2026'  ఈవెంట్‌లో గ్లోబల్ డెబ్యూ చేయనుంది. ఈ వేడుకలో సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ బీహైండ్-ది-సీన్స్ దృశ్యాలను, గ్లింప్స్‌ను ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో షూటింగ్ జరుగుతున్నప్పుడే గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజీని అమలు చేయడం రాజమౌళికి అలవాటు. ‘వారణాసి’ సినిమాకి అంతర్జాతీయ నిర్మాణ సంస్థల సహకారం ఉండటంతో, ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో ఉండబోతున్నాయి.  ఈ లాంగ్ బ్రేక్ సమయంలోనే సినిమా బిజినెస్, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ డీల్స్ క్లోజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, మహేష్ బాబును గ్లోబల్ ఐకాన్‌గా మార్చేందుకు రాజమౌళి పక్కా స్కెచ్‌తో ముందుకు వెళ్తున్నారు.   
ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ (Michael Jackson) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ 'మైఖేల్' (Michael). మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ (Jaafar Jackson) ప్రధాన పాత్రలో నటించిన ఈ బయోపిక్ గురించి ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మొదటి మాట.. "జాఫర్ జాక్సన్ అచ్చం మైఖేల్ జాక్సన్ లాగే ఉన్నాడు". కేవలం లుక్స్ పరంగానే కాకుండా, మైఖేల్ మేనరిజమ్స్, డ్యాన్స్ మూమెంట్స్, వాయిస్‌ను జాఫర్ అద్భుతంగా పండించాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. కొన్ని సీన్లలో అసలు మైఖేల్‌ను చూస్తున్నామా లేక జాఫర్‌నా అనే అనుమానం కలిగేలా ఆయన నటన ఉందని ప్రశంసలు కురుస్తున్నాయి. దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా, మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలు, వివాదాలు, ఆయన సంగీత ప్రయాణాన్ని ఎంతో ఎమోషనల్‌గా వెండితెరపై ఆవిష్కరించారని రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా మైఖేల్ చిన్ననాటి సంఘటనలు, ఐకానిక్ ఆల్బమ్స్ రూపొందించే క్రమంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.  ప్రేక్షకుల స్పందన (X Review): - "సినిమా చూస్తున్నంత సేపు గూస్‌బమ్స్ వచ్చాయి. ఇది కేవలం సినిమా కాదు, ఒక లెజెండ్‌కు దక్కిన నిజమైన నివాళి." - "ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ టాప్ నాచ్. జాఫర్ జాక్సన్ నటనకు ఆస్కార్ గ్యారెంటీ." - "సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు కన్నీళ్లు తెప్పిస్తాయి. మైఖేల్ అభిమానులకు ఇది ఒక విందు." మొత్తానికి 'మైఖేల్' చిత్రం కేవలం అభిమానులకే కాకుండా, సంగీత ప్రియులందరినీ ఆకట్టుకుంటోంది. మైఖేల్ జాక్సన్ గ్లోరీని మరోసారి వెండితెరపై చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.  
Gayapadda Simham, an upcoming realistic and hilarious drama releasing worldwide on May 1, is generating strong interest for its intriguing premise. Presented by Pavan Sadineni, the film is bankrolled by Kalyan Chakravarthy Manthina, Bhanu Kiran Pratapa, Vijay Krishna Lingamaneni, and Umesh Bansal.  Featuring a stellar lead cast of Tharun Bhascker, Faria Abdullah, Manasa Choudhary, and JD Chakravarthy, the film is directed by Kashyap Srinivas. For Chakravarthy, taking on the uniquely named character of Brutal Dharma was a decision driven entirely by the project's rock-solid script. Throughout his long career, Chakravarthy has firmly believed that no matter how fascinating a character might be, it simply cannot survive without a strong story anchoring it. He candidly reflects on his own cinematic journey to explain this philosophy, noting that his cult-classic roles in iconic films like Shiva and Satya became legendary only because the core narratives connected brilliantly with the audience.  To emphasize this practical reality, he often recalls how his absolute favorite personal performance in Wife of V. Varaprasad faded from public memory just because the film itself failed to succeed at the box office. Applying this hard-earned wisdom to Gayapadda Simham, Chakravarthy is deeply confident in the film's foundational writing.  He believes the script possesses the exact kind of inherent magic needed to elevate the viewing experience. This strong narrative core seamlessly supported his complex character arc, allowing him to project two entirely different psychological shades while looking exactly the same, making him trust that this new story has the undeniable power to leave a lasting impact.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చెప్తే సినిమా డైలాగ్ కదా అనుకున్నాం. కానీ అక్కడ ఉంది పవన్ కదా, ఆ డైలాగ్ ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి రాజకీయ యవనికపై ఉన్నా కూడా సినీ రికార్డుల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కానని అంటున్నాడు. మరి ఆ రికార్డుల డీటెయిల్స్ ఏంటో చూద్దాం.     మార్చి 19 న రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్(ustaad bhagat singh)ఫ్యాన్స్, ప్రేక్షకులకి వేసవి ఫీలింగ్ ని మర్చిపోయేలా చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఆశించని ఫలితాన్ని అందుకోలేకపోవడమే కాకుండా పవన్ పరాజయాల లిస్ట్ లో ఎంతో శ్రద్దగా, పకడ్బందీగా  వచ్చి చేరింది. ఈ మూవీ లాస్ట్ వీక్ ఏప్రిల్ 16 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చింది. అలా వచ్చిందో లేదో, నేను వచ్చింది సైలెంట్ గా ఉండటానికి కాదు రికార్డులు సృష్టించడానికి అనే రీతిలో సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఎంతలా అంటే వరల్డ్  వైడ్ గా. ఈ విషయాన్నీ నెట్ ఫ్లిక్స్ సంస్థే అధికారకంగా ప్రకటిస్తూ  పోస్టర్ రిలీజ్ చేసింది. Rajinikanth: రజినీకాంత్ 'విజయ్'కే ఓటు వేశాడా..లోపల మాటర్ పరిస్థితి ఇదే  సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ న్యూస్ పై ఫ్యాన్స్ స్పందిస్తు కొన్ని సార్లు రికార్డులు సృష్టించడం లేట్ అవ్వచ్చేమో గాని రికార్డులు సృష్టించడం మాత్రం పక్కా అని నెట్ ఫ్లిక్స్  పిక్ ని షేర్ చేస్తున్నారు.     
ధర్మ కీర్తిరాజు హీరోగా, నిఖిత స్వామి హీరోయిన్ గా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా 'అప్సర'.  కె ప్రవీణ్ నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శంకర్ రామ్ రెడ్డి నిర్మాత. రేణు కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పి.కె.హెచ్. దాస్, ఎడిటర్ గా గిరీష్ కుమార్ పనిచేశారు.  ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమాగా దర్శకుడు కె ప్రవీణ్ నాయక్ ఈ సినిమాను తెరకెక్కించారు. లవ్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్నీ అప్సర సినిమాలో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.  రేణు కుమార్ అందించిన సాంగ్స్ అన్నీ కుడా సినిమాకు హైలెట్ కాబోతున్నాయి. ధర్మ కీర్తిరాజు, నిఖిత స్వామి కెమెస్త్రి సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.  సుమన్ శర్మ, నాగేంద్ర యుఅర్ఎస్, కోటే ప్రభాకర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. వారి పాత్రలు సినిమాకు కీలకం.. అలాగే ముగ్గురు వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అప్సర సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.  
వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. కమర్షియల్ హంగుల కంటే కంటెంట్‌కే పెద్దపీట వేసే ఈ టాలెంటెడ్ హీరో, ప్రస్తుతం 'రావు బహదూర్' అనే ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా సమర్పిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 'రావు బహదూర్' చిత్రానికి 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి విలక్షణ చిత్రాలను అందించిన వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతోందని సమాచారం. తాజాగా విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ గ్లింప్స్‌లో సత్యదేవ్ ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిగా, కాస్త విభిన్నమైన మనస్తత్వం ఉన్న 'అరిస్టోక్రాట్' లుక్‌లో కనిపిస్తున్నారు. కాలానికి తగ్గట్టు మారకుండా తన పాత ప్రపంచంలోనే బతికే ఒక వ్యక్తి పాత్రలో సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. గతంలో సత్యదేవ్ నటించిన 'జీబ్రా', 'బ్లఫ్ మాస్టర్' వంటి చిత్రాలు ఆయన నటనలోని వైవిధ్యాన్ని చాటి చెప్పాయి. అలాగే రీసెంట్‌గా విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'లో ఆయన పోషించిన పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు 'రావు బహదూర్' కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్ నుంచి లుక్ వరకు కంప్లీట్ మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలో వికాస్ ముప్పాల, దీపా థామస్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేష్ మహా శైలికి తగ్గట్టుగానే ఈ సినిమా కేవలం ఒక థ్రిల్లర్ మాత్రమే కాకుండా, డార్క్ కామెడీ మరియు మ్యాజికల్ రియలిజం అంశాలతో మిళితమై ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. టీజర్ విడుదల సమయంలో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం సత్యదేవ్ ఎదుగుదలపై ప్రశంసలు కురిపించడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత బూస్ట్‌ని ఇచ్చింది. మహేష్ బాబు వంటి పెద్ద స్టార్ సినిమాను సమర్పించడం వల్ల ఈ చిన్న చిత్రానికి భారీ క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని 2026 సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అటు సత్యదేవ్ ఫ్యాన్స్, ఇటు వెంకటేష్ మహా మేకింగ్ స్టైల్‌ని ఇష్టపడే సినీ ప్రియులు ఈ 'రావు బహదూర్' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ మరియు మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్స్‌పై క్లారిటీ రానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కలయికలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' చేస్తున్న అల్లు అర్జున్, ఆ తర్వాత లోకేష్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ప్రముఖ రచయిత రత్నకుమార్ స్పందిస్తూ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.  "ఇది అంతర్జాతీయ ఆడియన్స్‌ ను మెప్పించేంత గొప్ప కథ. ఈ సినిమా కోసం మూడు వారాల పాటు చర్చలు జరిగాయి. అల్లు అర్జున్‌ గారితో మాట్లాడడం మా టీమ్‌కు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. మే రెండో వారం నుంచి పనులు మరింత వేగవంతం కానున్నాయి" అని రత్నకుమార్  చెప్పారు. లోకేష్ కనగరాజ్ సినిమాలకు స్క్రిప్ట్ వర్క్‌లో కీలక పాత్ర పోషించే రత్నకుమార్ మాటలతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. లోకేష్ మార్క్ యాక్షన్, అల్లు అర్జున్ స్వాగ్ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూవీ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని, ఇందులో బన్నీ క్యారెక్టరైజేషన్ ముందెన్నడూ చూడని విధంగా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం.  
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, కొన్నిసార్లు జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి మరియు పేద కుటుంబాల్లోని పరిస్థితులను ప్రతిబింబించే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. తాజాగా తెలుగు వన్ షేర్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. తండ్రి తాగే తాగుడుకు బలైపోతున్న ఒక చదువుకున్న కుర్రాడి ఆవేదన ఈ వీడియోలో అద్భుతంగా ఆవిష్కరించబడింది. కునాల్, సోనాలి బింద్రే, నాజర్, గౌండమణి, మణివణ్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ’ప్రేమికుల రోజు‘ చిత్రంలోని సన్నివేశాల సమాహారమే ఈ వీడియో. కదిర్  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.  వీడియో ప్రారంభంలోనే తండ్రీకొడుకుల మధ్య జరిగే వాగ్వాదం మనల్ని కదిలిస్తుంది. "ఒక్క పూట తిండి పెట్టే స్తోమత లేనివాడివి మమ్మల్ని ఎందుకు కన్నావు నాన్న?" అంటూ కొడుకు అడిగే ప్రశ్న ప్రతి పేదవాడి ఇంట్లోని ఘర్షణను గుర్తు చేస్తుంది. చదువుకొని గొప్ప స్థాయికి వెళ్లాలని తపించే కొడుకు ఒకవైపు, తాగుడుకు బానిసై కొడుకును కూలి పనులకు పంపాలనుకునే తండ్రి మరోవైపు.. ఈ ఇద్దరి మధ్య జరిగే ఈ హై-వోల్టేజ్ ఎమోషనల్ సీన్ గుండెల్ని పిండేసేలా ఉంది. ముఖ్యంగా, ఆ కుర్రాడికి జిల్లాలోనే పెద్ద కాలేజీ నుండి ఇంటర్వ్యూ లెటర్ రావడం, కానీ తండ్రి దాన్ని వ్యతిరేకించడం వంటి అంశాలు ఎంతో నాటకీయంగా ఉన్నాయి. "నేను పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు" అని ఆ కుర్రాడు చెప్పే డైలాగ్ ఈ సీన్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇంటి పరిస్థితి బాగోలేకపోయినా, తన లక్ష్యం కోసం ఆ అబ్బాయి పడే తపన అందరినీ ఆకట్టుకుంటోంది. కథ మరో మలుపు తిరుగుతూ, ఆ విద్యార్థి ముంబై వంటి నగరానికి చేరుకోవడం, అక్కడ ఒక గొప్ప కాలేజీ ఫౌండర్ అతనికి అండగా నిలవడం కనిపిస్తుంది. లక్షల రూపాయల సీటును ఒక పేద విద్యార్థికి ఉచితంగా ఇచ్చి ప్రోత్సహించే ఆ పెద్దమనిషి పాత్ర సినిమాలో స్ఫూర్తిని నింపుతుంది. ప్రేమలో పడి లక్ష్యాన్ని మరచిపోవద్దని, ప్రేమ అనేది జీవితానికి ఒక శక్తిగా ఉండాలి కానీ ఆటంకం కాకూడదని ఆయన చెప్పే హితబోధ నేటి యువతకు ఎంతో అవసరం. ఈ వీడియోలో చివరగా ఒక షాకింగ్ ట్విస్ట్ కూడా ఉంది. ఆ కాలేజీ ఫౌండర్ కూతురే, ఈ కుర్రాడు ప్రేమించిన అమ్మాయి అని తెలియడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది. తన కూతురికి కోటీశ్వరుల సంబంధం చూడాలని ఆ తండ్రి ఆశపడటం, అదే సమయంలో ఈ కుర్రాడిని తన సొంత కొడుకులా భావించడం మధ్య జరిగే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఈ వీడియోను మరింత రక్తి కట్టించింది. మొత్తానికి, ఈ సన్నివేశం కేవలం పేదరికం గురించి మాత్రమే కాకుండా, కృషితో ఏదైనా సాధించవచ్చనే సందేశాన్ని ఇస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతుండగా, నెటిజన్లు "ఇలాంటి సీన్లు చూస్తుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కుర్రాడు తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? తన ప్రేమను గెలిపించుకున్నాడా? అనేది తెలియాలంటే మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్ వేయాల్సిందే! ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన మ‌రిన్ని వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పట్లో ప్రతి ఇంట్లో కూలర్లు వాడుతున్నారు.  కాస్త అర్థిక స్థితి ఉన్నవారేతై ఏసీ లు కూడా పెట్టించుకుంటారు. కానీ రానురాను పెరుగుతున్న ఎండలు,  వాటి తాలుకూ వేడి కారణంగా కూలర్లు కూడా సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ.. సాధారణ కూలర్ ను కూడా చక్కగా ఏసీ లాంటి చల్లదనం ఇచ్చేలా చేయవచ్చు.  ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సాధారణ కూలర్ తో ఏసీ లాంటి చల్లదనం కావాలంటే.. ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే.. సాల్ట్ , ఐస్.. కూలర్  చల్లటి గాలిని అందించాలని  అనుకుంటే, ఐస్ లేదా ఉప్పు నీటిని కలపడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇది చాలా ఫేమస్ చిట్కా కూడా.  కూలర్ ట్యాంకులో రాళ్ల ఉప్పు,   ఐస్ క్యూబ్స్ వేస్తారు.  రాళ్ల ఉప్పు ఐస్ క్యూబ్స్ కరగకుండా ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీని వల్ల కూలింగ్ బాగా వస్తుంది. అయితే.. ఇది రెగ్యులర్ గా చేయడం మంచిది కాదు.. ఉప్పు తొందరగా చిలుము పట్టేలా చేస్తుంది. దీని వల్ల కూలర్ లోని మెటల్ భాగాలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా వేడి భరించలేని సమయాల్లో ట్రై చేయడం మంచిది. వెంటిలేషన్.. చాలా మంది ఏసీ లాంటి చల్లదనం వస్తుందని ఆశించి,  కూలర్లను మూసి ఉన్న గదులలో వాడుతుంటారు, కానీ ఇది  పెద్ద పొరపాటు. సరైన వెంటిలేషన్ ఉన్నప్పుడే ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేస్తుంది. గదిలో  వేడి గాలి బయటకు పోవడానికి , చల్లని గాలి లోపల ప్రసరించడానికి వీలుగా ఒక కిటికీని లేదా తలుపును తెరిచి ఉంచడం ముఖ్యం. సరైన వెంటిలేషన్ కూలర్ పనితీరును  మెరుగుపరుస్తుంది. శుభ్రత.. కాలక్రమేణా కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి పేరుకుపోయి, వాటి కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం లేదా మార్చడం ముఖ్యం. కూలర్ చాలా చల్లని గాలిని ఇవ్వాలి అంటే.. కూలర్ లోపల వట్టివేర్లతో తయారు చేసిన మ్యాట్లను  ఉపయోగించాలి. ఇది కూలింగ్ ను మెరుగుపరుస్తుంది. వట్టివేర్ల  గుండా నీరు ప్రవహించినప్పుడు, గాలి చల్లగా, తాజాగా మారుతుంది, మంచి  తేలికపాటి సువాసనను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం వల్ల వేసవి కాలంలో కూలర్ ఏసీ లాంటి చల్లదనాన్నిఇస్తుంది.                                     *రూపశ్రీ.
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం.. వీటితో పాటు కాస్త ఆర్థికంగా బాగున్నవారైతే.. హనీమూన్ కు కూడా వెళ్తారు. పెళ్లయిన మొదట్లో..  కొన్ని నెలలు ఎంతో అద్బులంలా.. అంతా పరిపూర్ణంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ హనీమూన్  అయిపోయాక లేదా పెళ్లైన  రెండు మూడు నెలల తర్వాత.. అసలైన లైఫ్ మొదలవుతుంది.  ఇక్కడే అందరూ ఊహించుకునే పెళ్లి జీవితానికి,  వాస్తవానికి మధ్య చాలా తేడా ఉందని తెలుసుకుంటారు.  అసలు అంగీకరించలేని ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి,  ఊహించుకున్న జీవితం చాలా రివర్స్ గా,  డిజప్పాయింట్ గా అనిపిస్తుంది.   పెళ్లి తర్వాత అర్థమయ్యే చేదు నిజాలు కొన్ని ఉన్నాయి. పెళ్ళి తర్వాత  జీవితం గురించి కలలు కనే ప్రతి ఒక్కరూ,  పెళ్లి తర్వాత జీవితాన్ని సినిమాటిక్ గా ఊహించుకునే ప్రతి ఒక్కరూ ఆ చేదు నిజాలను తెలుసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత వారు డిజప్పాయింట్ అయ్యే పరిస్థితి ఎదురవ్వదు.  ఆ చేదు నిజాలు ఏంటో తెలుసుకుంటే..  ప్రేమ అంటే.. పెళ్లికి ముందు,  పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు  ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, పొగడ్తలు చెప్పుకోవడమే అనుకుంటారు. నిజానికి చాలామందికి మొదట్లో అవే జరుగుతుంటాయి. కానీ పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత సాధారణ  జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రేమలో సరుకులు కొనడం, కరెంటు బిల్లు కట్టడం, బాధ్యతలు పంచుకోవడం కూడా ఉంటాయని మీరు గ్రహిస్తారు.  బయటకు వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని అనుకునేవారు.. పెళ్లైన కొన్ని నెలల తర్వాత.. ఈరోజు రాత్రి భోజనానికి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కేవలం బెడ్ రూమ్ ముచ్చట కాదు.. అది ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవడంలో కూడా ఉంటుంది. పర్పెక్ట్ లైఫ్ పార్టనర్.. పెళ్లికి ముందు కేవలం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల తమకు బెస్ట్ పార్ట్నర్ లభించారని అనుకుంటారు.  కానీ పెళ్ళి  తర్వాత  ఒకే ఇంట్లో కలిసి జీవించడం  మనిషిలో నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. మనిషి అలవాట్లు, మాటలు,   రోజువారీ ప్రవర్తన, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవ్వడం,  కోపం చేసుకోవడం, వాగ్వాదం ఇవన్నీ పెళ్లి తర్వాత ఉంటాయి. ఇవన్నీ పర్పెక్ట్ అనే ట్యాగ్ ను చెరిపేస్తాయి.  అయితే..  అందరూ ఒప్పుకోవాల్సన నిజం ఏమిటంటే.. ఎవరూ కంప్లీట్ గా పర్పెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరికీ బలాలు ఉంటాయి,  బలహీనతలు ఉంటాయి. రెండింటినీ అంగీకరించాలి. గొడవలు.. పెళ్లి తర్వాత గొడవ పడని భార్యాభర్తలు ఎక్కడా ఉండరు.  గొడవ పడని  భార్యాభర్తలు ఉన్నారని అనుకోవడం కూడా చాలా పొరపాటు.  విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. టీవీ రిమోట్ దగ్గర నుండి మొదలుకుని ఎన్నో విషయాలలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు ప్రతి వైవాహిక జీవితంలో ఒక భాగమే. డబ్బు.. ప్రేమకు దాని స్థానం ఉంది, అలాగే డబ్బుకు దాని స్థానం ఉంది. పెళ్లి తర్వాత, ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకోవడం, ఖర్చులను నిర్వహించుకోవడం, పొదుపు గురించి ఆలోచించడం వంటివి చాలా కీలకమవుతాయి. పెళ్లి తర్వాత దంపతులు తమ ఆర్థిక ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని గ్రహిస్తారు. కొందరు పొదుపు చేయాలనుకుంటే, మరికొందరు ఖర్చు చేయాలనుకుంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనా పరులైతే.. ఇద్దరి సంపాదన మీద ఒక్కరే అధికారం చూపించడం  వంటి పరిస్థితులు ఎదురైతే.. అది  వారి బంధంలో పెద్ద చీలికకు దారితీయవచ్చు. కాబట్టి వివాహం తర్వాత డబ్బు గురించి మాట్లాడటం మంచిదే కానీ.. డబ్బు కోసం బంధాన్ని విచ్చిన్నం చేయకూడదు. పర్సనల్ స్పేస్.. పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడటం నుండి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వరకు  పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత మారిపోతుంది. ప్రతి విషయంలోనూ  భాగస్వామిని కలుపుకోవాలి, వారి సౌకర్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు తమకోసం , స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. పైన చెప్పుకున్న విషయాలు చాలా సాధారణమైనవి. కానీ..పెళ్లికి ముందు చాలా జంటలు ఈ విషయాలలోనే ఊహించని అంచనాలు పెట్టుకుని, పెళ్లి తర్వాత చాలా డిజప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.                          *రూపశ్రీ.
 ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు, కానీ చాలా మందులకు ఉంటుంది.  ఈ టాబ్లెట్ల మీద గీత చూసిన చాలామంది ఇది ఒక డిజైన్ అని అనుకుంటారు, కానీ ఈ గీత వెనుక పెద్ద కథే ఉంది.. వైద్య పరిభాషలో, ఈ గీతను స్కోర్ లైన్ అంటారు. మందును సమాన భాగాలుగా విభజించడానికి ఈ గీతను రూపొందిస్తారని  నిపుణులు చెబుతున్నారు. టాబ్లెట్స్ పైన ఈ గీతలు ఎందుకు ఉంటాయి.  ఫార్మా కంపెనీలు ఇలా టాబ్లెట్ల మీద గీతలు ఉంచడం వెనుక కారణం ఏంటి?  వివరంగా తెలుసుకుంటే.. టాబ్లెట్ల మీద గీత.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని మాత్రలపై ఉండే గీత మందును సమాన భాగాలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది, తద్వారా రోగులు సులభంగా సగం మాత్రను తీసుకోవచ్చు. వైద్యులు తరచుగా సగం మాత్ర మోతాదును కూడా సూచిస్తారు. ఈ గీత మాత్రను సగానికి విరవడాన్ని సులభతరం చేస్తుంది. రోగికి సరైన మోతాదు అందేలా చూసుకోవడానికి, మాత్రను తయారుచేసేటప్పుడు ఈ గీత వచ్చేలా చేస్తారట. గీతలు లేని టాబ్లెట్లు.. మందుపై గీత లేని మాత్రలు. అంటే, టాబ్లెట్ల పై  గీత లేకపోతే ఆ మాత్రను విరవకూడదట. లేకపోతే, దాని ప్రభావం తగ్గిపోవచ్చట. కొన్ని మందులకు ఎంటెరిక్ కోటింగ్ లేదా సస్టెయిన్డ్ రిలీజ్ వంటివి ఉంటాయని, వాటిని విరిస్తే టాబ్లెట్ల ప్రభావం మారవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే గీత లేని టాబ్లెట్లను విరవడం వల్ల దుష్ప్రభావాల ప్రమాదం పెరగవచ్చని అంటున్నారు. డిజైన్ మాత్రం కాదు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాబ్లెట్ మధ్యలో ఉండే గీత కేవలం డిజైన్ కోసం పెట్టేది కాదు.  అది టాబ్లెట్ డోస్ తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గీత టాబ్లెట్‌ను సులభంగా విరవడానికి వీలు కల్పిస్తుంది. టాబ్లెట్ లో సగం డోసు తీసుకోవాల్సిన వారు  టాబ్లెట్‌ను సమాన భాగాలుగా విరవకపోతే సరైన డోస్ తీసుకోలేరు. దీని వల్ల  మందు కూడా ప్రభావవంతంగా పనిచేయదు.                                 *రూపశ్రీ.
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ అవసరం లేకుండా కొద్దిమోతాదులో అందుతుంది.  అయితే  అన్ని రకాల కూరగాయలను ఇనుప పాత్రలో వండకూడదు.  . కొన్ని కూరగాయలు ఐరన్ పాత్రలో వండినప్పుడు రియాక్షన్ జరిగి వాటి రుచి, రంగు లేదా పోషక విలువల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.  ఆహారం  నాణ్యత , రుచిని కోల్పోకుండా ఉండేందుకు, ఐరన్ పాత్రలు వాడే ప్తి ఒక్కరూ వాటిలో వండకూడని కూరగాయలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. టమోటా.. టమోటాలు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే  కూరగాయ. టమోటాలలో ఆమ్లం అధిక మొత్తంలో ఉంటుంది, ఇది ఐరన్ తో చర్య జరుపుతుంది. దీనివల్ల కూరగాయ రంగు ముదురుగా మారవచ్చు , కొద్దిగా వగరు రుచిని కలిగి ఉండవచ్చు. ఎక్కువసేపు వండటం ఈ ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అందువల్ల, టమోటా వంటి  కూరగాయలను స్టీల్ లేదా నాన్-స్టిక్ పాన్ లేదా బౌల్స్ లో వండాలి. పాలకూర.. పాలకూర వంటి ఆకుకూరలు ఐరన్ ప్రభావానికి గురైనప్పుడు వాటి  ఆకుపచ్చ రంగును కోల్పోయి, ముదురు రంగులోకి లేదా నల్లగా మారవచ్చు, దీనివల్ల అవి తినడానికి పనికిరావు. రుచిలో కూడా కొద్దిగా మార్పు ఉంటుంది. ఆకుకూరలను అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలలో వండటం ఉత్తమం. చింతపండు.. చింతపండు ఉపయోగించి వండే  కూరను ఇనుప పెనంలో వండకూడదు. వీటిలో ఉండే ఆమ్లాలు ఇనుముతో చర్య జరిపి ఆహారం రుచిని మార్చి, దానికి లోహపు రుచిని ఇస్తాయి. ఇది అనారోగ్యకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల, స్టీల్ లేదా నాన్-స్టిక్ పెనాన్ని ఉపయోగించాలి.  కేవలం చింతపండు మాత్రమే కాకుండా నిమ్మకాయ,  మామిడికాయ వంటివి కూడా ఐరన్ పాత్రలలో వండకూడదు. పెరుగు వంటలు.. పెరుగుతో చేసిన కూర లేదా పెరుగు గ్రేవీ వంటి కూరగాయల వంటకాలను ఇనుప పెనంలో వండినప్పుడు వాటి రుచి భిన్నంగా ఉంటుంది. పెరుగులోని పులుపు ఇనుముతో కలిసి కొద్దిగా చేదును కలిగిస్తుంది. అంతేకాకుండా రంగు ముదురుగా మారవచ్చు , కూరలో కొద్దిగా నలుపు కనిపించవచ్చు. నిమ్మకాయ.. కూరగాయలకు నిమ్మరసం కలపడం వల్ల వాటికి కొద్దిగా పులుపు, రుచి వస్తుంది, కానీ అది ఐరన్ తో  చర్య జరిపి రుచిని పాడుచేసే అవకాశం ఉంది.  దీనివల్ల ఆహారానికి లోహపు, వగరు రుచి వస్తుంది, కాబట్టి నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ వంట చేసిన తర్వాత, తినడానికి ముందు మాత్రమే కలపాలి. ఎక్కువ నీటి శాతం కలిగిన కూరలు.. అధిక నీటి శాతం ఉన్న కూరగాయలను ఐరన్ పెనంలో వండినప్పుడు వాటి రంగు, ఆకృతి మారవచ్చు. ఈ కూరగాయలను ఎక్కువ సేపు వండితే నల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని రసాయనాలతో చర్య జరపని పాత్రలలో వండటం మంచిది.                               *రూపశ్రీ.
  ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్య నుండి కళ్లకు ఉపశమం కలిగించడానికి చాలా మంది బ్లూ లైట్ కళ్లద్దాలు వాడుతున్నారు.  ప్రస్తుతం ఈ బ్లూ లైట్ కళ్లద్దాల వినియోగం చాలా ఎక్కువైంది కూడా.  అయితే, ఈ కళ్లద్దాలు నిజంగా  కళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తాయా? , లేక ఇవి కేవలం ఒక ట్రెండ్‌లో భాగమా? కంటి సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే.. బ్లూ లైట్ ఎఫెక్ట్.. నీలి కాంతి అనేది ఒక రకమైన అధిక శక్తి గల కాంతి. ఇది కేవలం డిజిటల్ స్క్రీన్‌ల నుండే కాకుండా, సూర్యరశ్మి నుండి కూడా వెలువడుతుంది. మనం గంటల తరబడి స్క్రీన్‌లను చూస్తూ ఉన్నప్పుడు, కళ్ళు పొడిబారడం, చికాకు, అలసట , తలనొప్పి వంటి కంటి సమస్యలను ఎదురవుతాయి. ఇలా కంటి సమస్యలు రావడాన్ని  డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటారు. ఈ సమస్యలకు స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతియే ప్రధాన కారణమని చాలా మంది భావిస్తారు. బ్లూ లైట్ గ్లాసెస్.. మార్కెట్లో లభించే బ్లూ లైట్ గ్లాసెస్, వాటి ప్రత్యేక లెన్సులు నీలి కాంతిని కళ్ళలోకి చేరకుండా అడ్డుకుంటాయని బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెబుతారు. నీలి కాంతి మనిషిలో నిద్ర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఇది కంటి ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుందని కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే శాస్త్రీయంగా ఇది నిరూపణ కాలేదు.  బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెప్పే విషయాలను పరిశోధనలు సమర్థించడం లేదు. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. బ్లూ లైట్ గ్లాసెస్  కంటి అలసటను తగ్గించడంలో అంత ప్రభావవంతంగా ఉండవు.  కంటి నొప్పి , పొడిబారడానికి అసలు కారణం బ్లూ లైట్ కాదు,  విరామం లేకుండా తదేకంగా  స్క్రీన్‌ను చూడటం ద్వారానే అసలు సమస్య వస్తోంది , కూర్చున్నప్పుడు  తప్పు పొజిషన్ లో కూర్చోవడం,  స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు తక్కువగా కనురెప్పలు వాల్చడం వంటివి కళ్లకు అలసట, పొడిబారడం వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అందువల్ల, కేవలం కళ్లజోడు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తొలగించలేము. బ్లూ లైట్ గ్లాసెస్ పనికిరావా? బ్లూ లైట్  కళ్లద్దాలు ధరించడం వల్ల కొంతమందికి కొంత సౌకర్యం కలగవచ్చనేది నిజమే. ముఖ్యంగా రాత్రి పొద్దుపోయే వరకు తమ మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లపై పనిచేసే వారికి కొంత ఉపశమనం లభించవచ్చు లేదా వారి నిద్ర పోవడానికి ఎక్కువ రిస్క్ లేకుండా ఈ బ్లూ లైట్ కళ్లద్దాలు కాస్త హెల్ప్ చేయవచ్చు.   కానీ పూర్తి కంటి రక్షణకు ఈ కళ్లద్దాలు పెట్టుకోవడం  ఏకైక పరిష్కారంగా భావించడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.                                    *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, రాత్రి పూట సరైన సమయానికి నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకు నిద్రపోవాలని  వైద్య నిపుణులు ఎందుకు చెబుతున్నారు? దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో ఈ వీడియోలో చూద్దాం.  ముఖ్య అంశాలు: శరీర పునరుద్ధరణ: రాత్రి 10 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మన శరీరంలో కణాల మరమ్మత్తు ప్రక్రియ వేగంగా జరుగుతుంది.  మెదడు ఆరోగ్యం: సరైన సమయానికి నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది, ఒత్తిడి (Stress) తగ్గుతుంది మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.  యునానీ వైద్య విధానం: నిద్ర మరియు ఆరోగ్యంపై యునానీ వైద్య శాస్త్రం చెప్పిన అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు.  బరువు నియంత్రణ: సరైన నిద్ర జీవక్రియను (Metabolism) మెరుగుపరిచి, బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందో వివరించబడింది. మీరు నిత్యం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటే మీ నిద్ర సమయాన్ని మార్చుకోవాల్సిందే. ఈ వీడియో చూసి, రాత్రి 10 గంటల నిద్ర వల్ల కలిగే మరిన్ని లాభాలను తెలుసుకోండి! ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) 🙏✨