తెలుగు రాష్ట్రాల్లో కుబేరులు వీరే...ఎక్కువ సంపద ఎవరిదంటే?

Publish Date:Mar 13, 2026

Advertisement

 

 

ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల జాబితాను ప్రకటించే ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించిన బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన కుబేరుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది. గత ఏడాది 205 మంది మాత్రమే ఉండగా, ఈసారి భారత బిలియనీర్ల సంఖ్య 229కి చేరింది. దేశంలో పలు రంగాల్లో వ్యాపారాలు విస్తరిస్తూ ఉండటంతో సంపద పెరుగుదల కూడా వేగంగా జరుగుతోందని ఫోర్బ్స్ నివేదిక చెబుతోంది.

ఫోర్బ్స్ వివరాల ప్రకారం భారత బిలియనీర్ల మొత్తం సంపద లక్ష కోట్ల డాలర్ల మార్క్‌ను దాటింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 92 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. గత సంవత్సరం ఇది 941 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈసారి గణనీయంగా పెరిగింది. దేశంలోని టాప్-10 అత్యంత ధనవంతుల సంపద మాత్రమే రూ. 33 లక్షల కోట్లకుపైగా ఉండటం విశేషం. మొత్తం బిలియనీర్ల సంపదలో ఇది మూడో వంతుకంటే ఎక్కువగా ఉందని ఫోర్బ్స్ వెల్లడించింది.

ఈ జాబితాలో  ముకేశ్ అంబానీ మరోసారి భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ఆయన సంపద గత ఏడాదితో పోలిస్తే దాదాపు 12 శాతం పెరిగింది. ఆయన తర్వాత స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. అదే సమయంలో సావిత్రి జిందాల్ దేశంలో అత్యంత ధనిక మహిళగా గుర్తింపు పొందారు. ఇక ఉదయ్ కొటక్ తొలిసారిగా భారత టాప్-10 ధనవంతుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

ఇంకా ఆసక్తికర విషయమేమిటంటే, అరవింద్ శ్రీనివాస్ (31) ఈసారి అత్యంత పిన్న వయస్కుడైన భారత బిలియనీర్‌గా నిలిచారు. ఆయన కృత్రిమ మేధస్సు రంగంలోని కంపెనీ పర్‌ప్లెక్సిటీ కో ఫౌండర్ సహ వ్యవస్థాపకుడు.

ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈసారి 10 మంది బిలియనీర్లు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. వారిలో మురళీ దివి అగ్రస్థానంలో నిలిచారు. దివీస్ ల్యాబోరేటరీస్ అధినేత అయిన ఆయన సంపద 10.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 93 వేల కోట్లు)గా ఉంది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కుబేరుల జాబితా ఇలా ఉంది:

మురళీ దివి (దివీస్ ల్యాబోరేటరీస్) - 10.1 బిలియన్ డాలర్లు (రూ. 93 వేల కోట్లు)
జీఎం రావు (జీఎంఆర్ గ్రూప్) - 3.9 బిలియన్ డాలర్లు (రూ. 35 వేల కోట్లు)
ప్రతాప్ సి. రెడ్డి (అపోలో హాస్పిటల్స్) - 3.6 బి.డాలర్లు (రూ. 33 వేల కోట్లు)
బి. పార్థసారథి రెడ్డి (హెటిరో గ్రూప్) - 3.4 బి.డాలర్లు (రూ. 31 వేల కోట్లు)
మహిమా దాట్ల (బయోలాజికల్ ఇ- లిమిటెడ్) - 3.2 బి.డాలర్లు (రూ. 29 వేల కోట్లు)
పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా)- 3 బి.డాలర్లు (రూ. 27 వేల కోట్లు)
ఎం. సత్యనారాయణ రెడ్డి (MSN గ్రూప్) - 2.9 బిలియన్ డాలర్లు (రూ. 26 వేల కోట్లు)
జూపల్లి రామేశ్వరరావు (మై హోం గ్రూప్)- 2.3 బి.డాలర్లు (రూ. 21 వేల కోట్లు)
పీవీ కృష్ణారెడ్డి (MEIL- మేఘా ఇంజినీరింగ్) - 2.1 బిలియన్ డాలర్లు (రూ. 19 వేల కోట్లు)
పీ పిచ్చి రెడ్డి (MEIL- మేఘా ఇంజినీరింగ్) - 2 బిలియన్ డాలర్లు (రూ. 18 వేల కోట్లు)

వ్యాపారం, ఔషధ తయారీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్య రంగాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు గణనీయంగా రాణించడం వల్ల ఈసారి బిలియనీర్ల జాబితాలో వారి ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇది దక్షిణ భారత వ్యాపార శక్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లైంది.

By
en-us Political News

  
పాఠశాలల్లో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ఉపాధ్యాయులు చేసే ప్రయత్నాలను నేరంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
పాప ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో.. ఆ కుటుంబం ఎక్స్ వేదికగా నారా లోకేష్ ను సహాయం కోసం అర్దించారు. వారి అభ్యర్థనకు తక్షణమే స్పందించిన నారా లోకేష్.. చిన్నారి పునర్విక బాధ్యత తీసుకున్నారు.
తెలంగాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దాదాపు ఓటమి అంచుల్లో ఉన్న స్థితి నుండి కోలుకుని ఆరెంజ్ ఆర్మీ అద్భుత విజయం సాధించింది. ఇంత వరకూ సన్ రైజన్ బౌలింగ్ విభాగంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఆఖరి ఓవర్లలో సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైకి విజయాన్ని అందించారు.
హైదరాబాద్ నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
కాంగ్రెస్, డీఎంకే, వాటి మిత్ర పక్షాలు నీచ రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో అడ్డుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసే చిన్న చిన్న పనులు కూడా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పోలీసులు నగరం మొత్తం ఒకేసారి తనిఖీలు నిర్వహించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్ వెలువడింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో దిల్లీ క్యాపిటల్స్ సత్తా చాటింది.
నటి ఖుష్బూ సుందర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలను వేధిస్తున్న లేఆఫ్స్ పర్వం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.