Publish Date:Mar 13, 2026
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. శుక్రవారం బస్ భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. అనంతరం లేబర్ కమిషనర్ కార్యాలయంలో సైతం సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె తేదీపై 14 రోజుల తరువాత నిర్ణయం తీసుకుంటామని.. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్లడం ఖాయమని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని, పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని సమ్మె నోటీసులో పేర్కొన్నాయి. అలాగే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని, అన్ని కేటగిరీల్లో పనిచేసే ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలన్న డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/strike-siren-in-telangana-rtc-36-215456.html
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.