భారతి బిల్డర్స్‌పై రూ.4.74 కోట్ల జరిమానా

Publish Date:Mar 13, 2026

Advertisement

 

రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటూ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ  భారీ జరిమానా విధించింది. మేడ్చల్ జిల్లా కొంపల్లి ప్రాంతంలో ప్రతిపాదించిన “భారతి లేక్ వ్యూ అపార్ట్‌మెంట్స్” ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన అనంతరం భారతి బిల్డర్స్‌పై రూ.4.74 కోట్ల జరిమానా విధిస్తూ రెరా కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021 సంవత్సరంలో ప్రీ-లాంచ్ స్కీమ్ పేరుతో భారతి బిల్డర్స్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ప్రాజెక్టు త్వరలో ప్రారంభమవుతుందని చెబుతూ పలువురు కొనుగోలుదారులను నమ్మించి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు, బుకింగ్ అమౌంట్‌లు వసూలు చేసినట్లుగా అధికారుల దర్యాప్తులో తేలింది. 

అయితే ప్రాజెక్టుకు అవసరమైన రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రజలను నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు సేకరించడం చట్టవ్యతిరేకమని అధికారులు స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం ప్రకారం, రెరా అనుమతి లేకుండా ప్రాజెక్టులను మార్కెట్ చేయడం లేదా కొనుగోలుదారుల నుంచి నిధులు సేకరించడం నిషేధిత చర్య....ఈ వ్యవహా రంపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో ప్రాజెక్టుకు ఎలాంటి అధికారిక అనుమతులు లేకపోవడం మాత్రమే కాకుండా, ఇప్పటి వరకు నిర్మాణ పనులు కూడా ప్రారంభించలేదు. కొనుగోలుదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినప్పటికీ ప్రాజెక్టు పురోగతి లేకపోవడం రెరా దృష్టికి వచ్చింది. 

దీంతో సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన అధికారులు వెంటనే ఆ సంస్థపై భారీ జరిమానా విధించారు. అదే సమ యంలో, బాధిత కొనుగోలుదారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రెరా కీలక ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తం డబ్బులను వడ్డీతో సహా 60 రోజుల్లో తిరిగి చెల్లించాలని భారతి బిల్డర్స్‌కు గట్టిగా ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన గడువులోగా డబ్బులు తిరిగి చెల్లించకపోతే మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

అదేవిధంగా, నిబంధనలు ఉల్లంఘించినం దుకు భారతి బిల్డర్స్‌ను రెరా “డిఫాల్టర్ ప్రమోటర్”గా ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం రెరా కఠినంగా వ్యవహరిస్తుందని అధికారులు స్పష్టంచేశారు.ఈ నేపథ్యంలోనే ప్రజలకు కూడా రెరా ముఖ్య సూచనలు చేసింది. ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు ఆ ప్రాజెక్టుకు రెరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా అన్నది తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది. 

రెరా వెబ్‌సైట్‌లో ప్రాజెక్టు వివరాలు, అనుమతులు, నిర్మాణ పురోగతి వంటి సమాచారం అందుబాటులో ఉంటుందని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కొనుగోలుదారులకు సూచించింది.రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ  అధికారులు తెలిపారు. అక్రమంగా డబ్బులు సేకరించే బిల్డర్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని కూడా హెచ్చరించారు.


 

By
en-us Political News

  
గమ్యానికి చేరుకోవడానికి కేవలం ఇరవై నిమిషాల దూరంలో ఉన్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం రెండు ప్రాణాలను బలితీసుకుంది. అదే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Publish Date:Apr 14, 2026
ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చేనెల 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఆ లోగా తమ సమస్యలు పరిష్కరించాలనీ లేకుంటే థియేటర్ల మూత తప్పదని స్పష్టం చేసింది.
జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు.
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు.
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.