ఆపరేషన్ సేఫ్ స్కూల్... 558 షాపులపై పోలీసుల ఏకకాల దాడులు

Publish Date:Apr 18, 2026

Advertisement

 

విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పోలీసులు నగరం మొత్తం ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్‌, పొగాకు ముప్పును మూలంలోనే అరికట్టాలనే సంకల్పంతో హైదరాబాద్ పోలీసులు శనివారం నగరవ్యాప్తంగా “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరిట భారీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. సుమారు 5 వేల మంది సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్‌లో విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు విక్రయాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. పొగాకు అలవాటు డ్రగ్స్‌ వైపు నడిపించే మొదటి మెట్టు అన్న అవగాహనతో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 

పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులు క్రమంగా వ్యసనాల బారిన పడుతున్నారన్న ఆందోళన నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్-న్యూ, లా అండ్ ఆర్డర్ సిబ్బంది కలిసి నగరంలోని 558 షాపుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.

సీపీ సజ్జనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాలు చిరాగ్ అలీ లేన్,రెడ్ హిల్స్, మెహదీపట్నం, గోషా మహల్  వంటి ప్రాంతాల్లో విద్యాసంస్థల సమీపంలోని దుకాణాలను పరిశీలించారు.గోషామహల్ ఎంజే బ్రిడ్జి వద్ద మీడియాతో మాట్లాడుతూ, మైనర్లకు పొగాకు అమ్మే వారిపై “ఉక్కుపాదం” మోపుతామని హెచ్చరించారు. డెకాయ్ ఆపరేషన్‌లో చిన్నారులకు పొగాకు విక్రయిస్తున్నట్లు ఆధారాలతో బయటపడిన దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా హెచ్-న్యూ విభాగంలో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు సీపీ ప్రకటించారు. విద్యాసంస్థల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ పోరాటం కేవలం పోలీసులదే కాదని, తల్లిదండ్రులు మరియు విద్యాసంస్థలు కలిసి బాధ్యత తీసుకోవాలని కోరారు. పిల్లల ప్రవర్తన, స్నేహితులు, స్కూల్ తర్వాత కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా పొగాకు విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 8712661601కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.


 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
కాంగ్రెస్, డీఎంకే, వాటి మిత్ర పక్షాలు నీచ రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో అడ్డుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసే చిన్న చిన్న పనులు కూడా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్ వెలువడింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో దిల్లీ క్యాపిటల్స్ సత్తా చాటింది.
నటి ఖుష్బూ సుందర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలను వేధిస్తున్న లేఆఫ్స్ పర్వం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
అత్తాపూర్ ఆర్డీవో కొప్పుల వెంకట్ రెడ్డికి జైలు శిక్ష విధించిన తెలంగాణ హై కోర్టు
యాంకర్ విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పేరు! ప్రస్తుతం స్టార్ యాంకర్‌గా, సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఆమె సంపాదిస్తున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల పరిస్థితిపై చర్చ జోరుగా సాగుతోంది.
అధికారిక గణాంకాలు అభివృద్ధిని సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నయో అద్ధం పడుతున్నాయి. ప్రజలకు అండగా ఉండాల్సిన బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వ రంగాలు ఇప్పుడు వాటి అస్థిత్వం కోసం సామాన్యుడిని ఆర్థికంగా వేధించే యంత్రాలుగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాబందులుగా మారుతున్నాయనే వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం ఈనెల 20న జరగనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.