సంస్కరణలు భవిష్యత్ ను మారుస్తాయి.. చంద్రబాబు

Publish Date:Oct 17, 2025

Advertisement

భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.   ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లను అందించి వారితో కొద్ది సేపు ముచ్చటించారు.  కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా? అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు సున్నా శాతం, 5 శాతం స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయనీ,  దీని వల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు.

నాటిన కొంత కాలానికి చెట్టు ఫలాలు ఇచ్చినట్లు సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని చంద్రబాబు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై వ్యాసరచన. పెయింటింగ్,  వక్తృత్వ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి నందుకు ఆయన వారినిఅభినందించారు. 

By
en-us Political News

  
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
తనకు భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.