ఏపీలో మరో కోనసీమ: కొబ్బరి చెట్లుండవు కానీ పచ్చదనం బ్రహ్మాండ్స్.. బాబు విజన్ లో రాయలసీమ.!

Publish Date:Oct 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో మరో కోనసీమ రూపుదాలుస్తోంది. కరవు, వర్షాభావం, వలసలకు, ఫ్యాక్షన్ గొడవలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రాయలసీమ.. చంద్రబాబు విజన్ కారణంగా కొనసీమలా మారి సస్యశ్యామలం కాబోతోంది.  హార్టీకల్చర్ హబ్ గా దేశంలోనే గుర్తింపు పొందేలా చంద్రబాబు రాయలసీమను తీర్చి దిద్దుతున్నారు. కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.

సీమను  దేశంలోనే నంబర్ వన్ హార్టీకల్చర్ హబ్ గా తీర్చిదిద్దేలా బృహత్తర ప్రణాళిక రూపొందించారు. రాయలసీమ రైజింగ్ అంటూ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో సీమ సమగ్ర, సంతుల్య అభివృద్ధికి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది.  వ్యవసాయాన్ని  సాంకేతికతతో అనుసంధానిస్తూ, రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.  అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ ప్రాజెక్టుకు  గాంధీ జయంతి రోజున శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

రాయలసీమలో ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్టును గ్రౌండ్ చేస్తున్నారు. 40 వేల352 కోట్ల ప్రభుత్వ పెట్టుబడులతో సాగునీరు, గ్రామీణ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్థి,  60 వేల కోట్ల రూపాయల  ప్రైవేటు పెట్టుబడులతో  పంటల సేకరణ, గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, రవాణా, మార్కెటింగ్ వంటి సదుపాయలను కల్పించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం, లక్ష్యం. మూడేళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  

ఈ ప్రాజెక్టు పరిధిలో రాయలసీమతో అనుసంధానమైన ప్రాంతాల్లోని 10 జిల్లాలను భాగస్వామ్యం చేయనున్నారు. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 201 క్లస్టర్లను  ఏర్పాటు చేయనున్నారు.  303 మండలాల్లోని  5 వేల 869 గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది లక్ష్యం. 

రాయలసీమలో ఇప్పటికే మామిడి, టమోటా, అరటి, దానిమ్మ, బత్తాయి వంటి పంటలు విస్తృతంగా సాగవుతున్నాయి. వీటితో పాటు అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం, స్ట్రాబెర్రీ వంటి అధిక విలువ కలిగిన పంటలను కూడా ప్రోత్సహించాలనే ఆలోచన ఉంది. మార్కెట్ డిమాండ్, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత ఆధారంగా పంటల ఎంపికకు రైతులకు మార్గదర్శకత్వం అందించనున్నారు. ఉత్పత్తి పెంపుతో పాటు నాణ్యత ప్రమాణాలు, ఎగుమతులకు అవసరమైన సదుపాయాలపై కూడా దృష్టి పెట్టనున్నారు. ఈ చర్యల ద్వారా రాయలసీమను దేశీయ, అంతర్జాతీయ పండ్ల మార్కెట్లతో అనుసంధానించాలనేది ప్రాజెక్టు లక్ష్యం. 

రాయలసీమ అభివృద్ధికి ప్రధాన అవరోధంగా ఉన్న నీటి కొరతను అధిగమించేందుకు సాగునీటి మౌలిక సదుపాయాలను ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. నీటి సమర్థ వినియోగం, సూక్ష్మ సేద్యం, ఆధునిక సాగు పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పంటలకు అవసరమైన నీటిని అందుబాటులో ఉంచడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునే పంట రకాలను ప్రోత్సహించడం కూడా కీలకంగా మారనుంది. అయితే సాగునీటి లభ్యత, ప్రాజెక్టుల పురోగతి, నీటి కేటాయింపుల ఆధారంగానే ఈ లక్ష్యాల సాధన ఆధారపడి ఉంటుంది. 

ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న ఈ సంస్థలో వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో ఆధునిక సాంకేతికత, పరిశోధన, కృత్రిమ మేధస్సు వినియోగం, శాస్త్రీయ సాగు పద్ధతులపై శిక్షణ అందించనున్నారు. రైతులు, వ్యవసాయ నిపుణులు, యువతకు నూతన పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంస్థకు కూడా మదనపల్లెలో శంకుస్థాపన జరిగింది. 

ఉద్యానవన పంటలు పండించిన తర్వాత వాటిని సరైన సమయంలో మార్కెట్‌కు చేర్చడం రైతులకు కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో పంటల సేకరణ కేంద్రాలు, శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ సదుపాయాలు, రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను సిద్ధం చేసి ఎగుమతులను ప్రోత్సహించేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల పంట కోత అనంతరం జరిగే నష్టాలను తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభిస్తాయి.  

[Rayalaseema Global Horticulture Hub, Andhra Pradesh Horticulture, Chandrababu Naidu Nirmala Sitharaman,  Madanapalle Indian School of Agriculture, Rayalaseema, Konaseema, CBN Vision, Telugu One] 

By
en-us Political News

  
లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే వైసీపీ అంగీకారం తెలిపింది.  కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రాతినిధ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకు భిన్నంగా 50శాతం పెంపునకు కేంద్రం ఓకే అంటే డీలిమిటేషన్ బిల్లుకు ఓకే అని వైసీపీ అధినేత ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమావేశాలలో  రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి  ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే రాజ్యాం సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే సభలో ఎన్డీయే కూటమికి అందుకు అవసరమైనంత సంఖ్యా బలం లేదు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1989 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అయిన ఎస్పీ కేటాయించే పరిమిత స్థానాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు పెచ్చరిల్లేలే చేయడానికి, తద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి నానా కష్టాలూ పడ్డారు. అయితే అవేం ఫలించలేదు అది వేరే సంగతి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్, బీఆర్ఎస్ అధినాయకత్వం మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనడానికే.
దీంతో ఆస్తిపై హక్కు కోరుతున్న షర్మిలే ఇది తమ కుటుంబ ఆస్తి అని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తనకు ఆ ఆస్తిపై హక్కు ఉందని షర్మిల నిరూపించుకోవాలంటే, ఆస్తి మూల యాజమాన్యం  నిధుల సమీకరణకు సంబంధించిన   ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ తరువాత ఆ కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ ఆ బాధ్యతను మరచి తోడబుట్టిన చెల్లితో  ఆస్తుల కోసం పంచాయతీలు పెట్టడం, కోర్టులను ఆశ్రయించడం,   బహిరంగ విమర్శలు చేయడం ఆయన ప్రతిష్ఠను మసకబార్చిందని అంటున్నారు.
తాజాగా గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 27 స్థానాలలో వైసీపీ పాతిక స్థానాలను తెలుగుదేశం కు కోల్పోయింది. వైసీపీ కేవలం గురివిడి ఎంపీపీ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన ఒక్క స్థానాన్ని తెలుగుదేశం కూటమి భాగస్వామ్యపార్టీ అయిన జనసే గెలుచుకుంది. 
జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది మార్చి నుంచే ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచే జగన్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.