పాపం జగన్: బీఆర్ఎస్ కూడా ఆడేసుకుంటోందిగా.?
Publish Date:Nov 25, 2026
Advertisement
జగన్ పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా మారింది. రాజకీయంగా తనకు మంచి దోస్తీ అయిన బీఆర్ఎస్ కోసం ఆయన గతంలో తాను చేయగలిగిన దానికన్నా, చేయాల్సిన దాని కన్నా ఎక్కువే చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు పెచ్చరిల్లేలే చేయడానికి, తద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి నానా కష్టాలూ పడ్డారు. అయితే అవేం ఫలించలేదు అది వేరే సంగతి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్, బీఆర్ఎస్ అధినాయకత్వం మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనడానికే. అలాగే 2019 ఎన్నికలలో జగన్ విజయం కోసం అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేయగలిగినంతా చేశారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని ఆ చేసిన సాయాన్ని అప్పట్లో బాహాటంగా చెప్పుకున్నారు కూడా. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. ఇక్కడ ఏపీలో వైసీపీ కనీసం ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ఉనికి మాత్రంగా మిగిలింది. అలాఒకప్పుడు సన్నిహిత మిత్రులుగా పేరొందినప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ను ఆడేసుకుంటోంది. విమర్శలు గుప్పించడమే కాదు.. తాము అధికారంలో ఉండగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పుడు సీఎంగా ఉన్న జగన్ ను గల్లా పట్టుకుని నిలదీయడానికి కూడ వెనకాడలేదని బాహాటంగా చెబుతూ, ఏపీ సీఎంగా జగన్ తమ చెప్పు చేతల్లో ఉండే వారనీ, అలా ఉంచామని చెప్పుకుంటోంది. ఇలా జగన్ ను తక్కువ చేసి మాట్లాడినా ఆయన మాత్రం కిమ్మనలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాజాగా కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడితే, తాము గల్లా పట్టుకుని నిలదీసి ఆ ప్రాజెక్టును ఆపించామని హరీష్ రావు అన్నారు. ఇదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఉద్దేశించి గల్లా పట్టుకున్నామన్న రీతిలో హరీష్ రావు వ్యాఖ్యానించడం.. జగన్ ను చులకన చేయడం, అవమానించడమేనని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి జగన్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి వైఖరి ప్రదర్శించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో, అప్పడు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు సైతం.. ఇదే వైఖరి ప్రదర్శించారంటూ ఉదాహరణలు చూపుతున్నారు. ఏపీలో రహదారుల దుస్థితి ఎలా ఉందో, విద్యుత్ కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడాలంటూ, అప్పట్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుపై కేటీఆర్ పొగడ్తల వర్షం: ఖండించలేక, సమర్థించలేక జగన్ సతమతం.! ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు జగన్ హయాంలో తమ మాట ఎలా చెల్లుబాటైందో చెప్పుకునే క్రమంలో జగన్ జగన్‌ను తక్కువ చేస్తూ, ఆయనపై విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడటం ఎక్కువైందంటున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన , ఆయన విజన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతిని ఎత్తి చూపుతున్నారు. అంటే బీఆర్ఎస్ నేతలు తమను గొప్పగా చూపుకోవడానికి జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కూడా వెనుకాడటం లేదని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ప్రజల ముందు తాము నీళ్ల విషయంలో ఏనాడూ రాజీపడలేదని చెప్పుకుని రాజకీయ ఇమేజ్‌ను పెంచుకోవడానికి మిత్రుడని చెప్పుకునే జగన్ ను పావుగా వాడుకుంటున్నారు. దీంతో ఏపీ ప్రయోజనాల కోసం తాము అప్పట్లో గట్టిగా పోరాడామని చెప్పుకునే అవకాశం జగన్ కు లేకుండా పోతోంది. అంతే కాకుండా బీఆర్ఎస్ ఒత్తిడికి లొంగి జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారన్న విమర్శలు ఏపీలో వైసీపీ అధినేత ఎదుర్కోవలసి వస్తున్నది. ఇంత జరుగుతున్నా జగన్ కనీసం బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై కనీసం స్పందించకపోవడంతో బీఆర్ఎస్ నేతలు చెబుతున్నదే వాస్తవమేనని ఏపీ జనం నమ్మే పరిస్థితి ఏర్పడింది. మీకు నచ్చవచ్చు: జగన్ మూర్ఖ వైఖరితో ఏపీకి నష్టం! కేసీఆర్ సంచలనం.. కేటీఆర్ ర్యాలీలో జగన్ ఫ్లెక్సీలు.. దీని భావమేమి తిరుమలేశా? [BRS, HarishRao, KTR, Damage, Image, Jagan, Krishna, water, Dispute, TeluguOne]
http://www.teluguone.com/news/content/brs-45-237934.html





