యలహంక ప్యాలెస్ విషయంలో: జగన్ చట్టపరంగా పై చేయి.. నైతికంగా ఘోర పరాజయం.!

Publish Date:Nov 22, 2026

Advertisement

ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉంటూ, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలిచిన వైఎస్ కుటుంబం, ఇప్పుడు  విచ్ఛిన్నమైంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన కనీస ప్రేమ, ఆప్యాయతలు  ఇసుమంతైనా కనిపించకపోవడం అటుంచి.. బద్ధ శత్రువుల్లా రోడ్డు కెక్కుతున్నారు.  దీనికి నిదర్శనంగా, షర్మిల, విజయమ్మ తమ కుటుంబ సభ్యులతో కలిసి యలహంక ప్యాలెస్‌ను సందర్శించడానికి వీల్లేదంటూ కోర్టును ఆశ్రయించి మరీ వారిని జగన్ అడ్డుకోవడాన్ని చెప్పుకోవచ్చు. 

కుటుంబ పెద్దగా జగన్ వైఫల్యానికి ఈ ఘటన పరాకాష్టగా చెప్పుకోవచ్చు. రక్తసంబంధం కంటే,  ఆస్తులు, అధికారమే మిన్న అన్నట్లుగా జగన్ తీరు ఉందని పరిశీలకులు అంటున్నారు.  తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన బాధ్యతలను,మాటలను విస్మరించి సొంత చెల్లెలు షర్మిల వాటా ఆస్తులనే కాకుండా, మేనకోడలు, మేనల్లుడి భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఆస్తులను కూడా లాగేసుకున్నారన్న విమర్శలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఆస్తుల పరంగా ఎవరి వాటాలు ఎవరికి దక్కాయి అనే చట్టపరమైన అంశాలు ఒకవైపు ఉన్నప్పటికీ, సొంత కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై సామాన్య ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ ఆస్తి తనదేనని, షర్మిల కుమార్తె అంజలి వివాహం కోసం అక్కడ అలంకరణ పనులు చేపట్టే హక్కు వారికి లేదని జగన్ కోర్టులో వాదించి, ముందస్తుగా కోర్టు ఉత్తర్వులను  పొందారు. దీని ఫలితంగా, పోలీసులు వారిని విమానాశ్రయం వద్దే అడ్డుకుని, యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా సమీపంలోని హోటల్‌లో బస చేయాలని సూచించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో   షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని మరో హోటల్‌లో బస చేయాల్సి వచ్చింది.

చట్టపరంగా చూస్తే, కోర్టు ఉత్తర్వులను పొందడంలో,  పోలీసుల ద్వారా షర్మిల, విజయమ్మలను అడ్డుకోవడంలో జగన్ విజయం సాధించి ఉండవచ్చు. కానీ, సామాజిక కోణంలో, నైతిక కోణంలో ఆయన ప్రతిష్ఠ కోల్పోయారనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.   ఆస్తి హక్కుల కోసం  సొంత చెల్లి, తల్లి వీధుల్లోకి వచ్చి పోరాడాల్సి రావడం, ప్రజల దృష్టిలో జగన్‌ కుటుంబ బంధాలకు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తిగా నిలబెడుతుందనడంలో సందేహం లేదు. 

ఇది కూడా చదవండి: ఇంత కంటే నీచం ఉంటుందా: ఇంత దిగజారుడుతనమా.. జగన్ పై షర్మిల ఫైర్.!​

సొంత చెల్లెలి వివాహం సమయంలో జనగ్ వ్యవహరించిన తీరు పట్ల రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ సొంత ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేలా కోర్టు ఉత్తర్వులను తీసుకురావడం, వైసీపీ అధినేత జగన్ పట్ల ప్రజల్లో ఒకింత వ్యతిరేకతను కారణమౌతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  షర్మిలను యలహంక ప్యాలెస్ లోకి  ప్రవేశించకుండా అడ్డుకోవడంలో జగన్ చట్టపరంగా పై ఇప్పటికిప్పుడు పై చేయి సాధించి ఉండవచ్చు కానీ, నైతికంగా మాత్రం ప్రజల దృష్టిలో దిగజారిపోయారని అంటున్నారు. ఎందుకంటే.. సొంత చెల్లెలి కూతురి వివాహ సమయంలో జగన్ వ్యవహరించిన తీరు నైతికంగా  ఇసుమంతైనా సమర్థనీయం కాదంటున్నారు.  

అన్నిటికీ మించి వైఎస్ తరువాత ఆ కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ ఆ బాధ్యతను మరచి తోడబుట్టిన చెల్లితో  ఆస్తుల కోసం పంచాయతీలు పెట్టడం, కోర్టులను ఆశ్రయించడం,   బహిరంగ విమర్శలు చేయడం ఆయన ప్రతిష్ఠను మసకబార్చిందని అంటున్నారు. తాజా ఘటనతో జగన్  ప్రజల నమ్మకాన్ని కోల్పోయారనీ,    ఈ మచ్చను తుడిచివేసి, ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం అంత సులువు కాదనీ అంటున్నారు. 

మీకు నచ్చవచ్చు: షర్మిల కుమార్తె పెళ్లికి జగన్ బెంగళూరు ప్యాలెస్: అనుమతి నిరాకరించిన మాజీ సీఎం.!​

యలహంక ప్యాలెస్ వద్ద ఉద్రిక్తత: బెంగళూరు చేరుకున్న షర్మిల.!

[Jagan Sharmila dispute,   Yelahanka Palace, controversy, Ethicaldimensions, TeluguOne]

By
en-us Political News

  
లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే వైసీపీ అంగీకారం తెలిపింది.  కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రాతినిధ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకు భిన్నంగా 50శాతం పెంపునకు కేంద్రం ఓకే అంటే డీలిమిటేషన్ బిల్లుకు ఓకే అని వైసీపీ అధినేత ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమావేశాలలో  రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి  ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే రాజ్యాం సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే సభలో ఎన్డీయే కూటమికి అందుకు అవసరమైనంత సంఖ్యా బలం లేదు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1989 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అయిన ఎస్పీ కేటాయించే పరిమిత స్థానాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు పెచ్చరిల్లేలే చేయడానికి, తద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి నానా కష్టాలూ పడ్డారు. అయితే అవేం ఫలించలేదు అది వేరే సంగతి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్, బీఆర్ఎస్ అధినాయకత్వం మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనడానికే.
దీంతో ఆస్తిపై హక్కు కోరుతున్న షర్మిలే ఇది తమ కుటుంబ ఆస్తి అని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తనకు ఆ ఆస్తిపై హక్కు ఉందని షర్మిల నిరూపించుకోవాలంటే, ఆస్తి మూల యాజమాన్యం  నిధుల సమీకరణకు సంబంధించిన   ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 27 స్థానాలలో వైసీపీ పాతిక స్థానాలను తెలుగుదేశం కు కోల్పోయింది. వైసీపీ కేవలం గురివిడి ఎంపీపీ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన ఒక్క స్థానాన్ని తెలుగుదేశం కూటమి భాగస్వామ్యపార్టీ అయిన జనసే గెలుచుకుంది. 
జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది మార్చి నుంచే ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచే జగన్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.