అమీన్‌పూర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డిపై రేప్ కేసు..!

Publish Date:Aug 7, 2026

Advertisement

 

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు పలు తీవ్రమైన సెక్షన్లను నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు *బీఎన్‌ఎస్‌ (BNS) సెక్షన్లు 68, 64(2)(a)(m), 89, 74, 75, 77, 78, 115(2), 308, 351(3)*తో పాటు ఐటీ యాక్ట్‌లోని 66(E), 67, 67(A) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇప్పటికే సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆయనను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఆరోపణలపై శాఖాపరంగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో తాజాగా బాధితురాలి ఫిర్యాదుతో క్రిమినల్‌ కేసు నమోదు కావడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు అనంతరం అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితు రాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేస్తున్నారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు, ఘటనకు సంబంధించిన పరిస్థి తులు, ఆమె కు ఎదురైన ఇబ్బందులపై పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు 
 అవసరమైన సాంకేతిక ఆధారాలను కూడా సేకరించే అవకాశం ఉంది. 

ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డిపై నమోదు చేసిన సెక్షన్లకు సంబంధించిన అంశాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా బాధితురాలు చేసిన ఆరోపణలు, వాటికి సంబంధించిన ఆధారాలు, డిజిటల్‌ కమ్యూనికేషన్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ ఆధారాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాలి స్టేట్‌మెంట్‌ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Rape case against Ameenpur Inspector Srinivasulu Reddy, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand
 

By
en-us Political News

  
తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందించిందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖలు మార్చే అత్యంత ప్రాధాన్యమైన పనుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ఒకటి.
దేశంలో ఇటీవల చోటుచేసుకున్న జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు, నీట్ పరీక్ష లీకేజీ వివాదాలు దానికి అనుబంధంగా జరిగిన నిరసనలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
దేవాలయాల సాక్షిగా, అమాయక ప్రజల ఆవేదన నడుమ ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న ఓ నిశ్శబ్ద పోరాటం ఇది.
తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల పోరాటం తర్వాత విషాదాంతం..!
అతి స్వల్ప కాలంలోనే విశాఖ రైల్వే జోన్ రికార్డు స్థాయి రాబడి సాధించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ వార్షికంగా 2వేల 493 కోట్ల నికర రాబడిని సాధించడం ద్వారా దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా నిలిచింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటనలో అధికారికంగాప్రకటించింది.
పశ్చిమాసియా రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..ముస్లిం దేశాల ముక్కోణపు వ్యూహం..!
తనను ఒక్కసారి కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారు.
మైనర్లకు వాహనాలు అప్పగిస్తే జరిగే ప్రమా దాలు ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయో మరో ఘటన చాటిచెప్పింది.
దళపతి విజయ్ కుటుంబంలో బిగ్ ట్విస్ట్..!
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పార్సిగుట్టలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ రసాభాసకు దారితీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.