తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం : ఎంపీ ఈటల

Publish Date:Aug 7, 2026

Advertisement

 

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందించిందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారని, ఇటీవల రాష్ట్రానికి వచ్చి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని అన్నారు. అదేవిధంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించి పార్టీ నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేశారని పేర్కొన్నారు.

బెంగాల్‌లో సాధించిన విజయాన్ని తెలంగాణలోనూ పునరావృతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధిష్ఠానం పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందని ఈటల రాజేందర్ చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, గతంలో అమలులో ఉన్న కొన్ని సంక్షేమ పథకాలను కూడా కొనసాగించకుండా తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. అందుకే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయకూడదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని అన్నారు. అదే సమయంలో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, పాలనలోని లోపాలు ఇంకా ప్రజల మదిలో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే అభిప్రాయం బలపడుతోందని తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణను గట్టెక్కించాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దోపిడీ, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయాలంటే బీజేపీ బలపడాలని ప్రజల్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.

పాన్ షాపులు, హోటళ్లు, చౌరస్తాలు, గ్రామాలు, పట్టణాలు ఇలా ప్రజలు ఎక్కడ కలిసినా తెలంగాణ రాజకీయ పరిస్థితులపైనే చర్చ సాగుతోందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య, రైతుల సమస్యలు, అసైన్డ్ భూముల అంశం, హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలు వంటి ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు.

ప్రజలకు నాయకత్వం వహించడం, వారిలో భరోసా కల్పించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులతో ఢిల్లీలో పార్టీ అగ్రనాయకత్వం కీలక సమీక్ష నిర్వహించిందని ఈటల రాజేందర్ వెల్లడించారు. రానున్న రోజుల్లో నాయకులంతా ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని, ప్రజలకు బలమైన నాయకత్వాన్ని అందిస్తూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పార్టీ అధిష్ఠానం సూచించినట్లు తెలిపారు

BJP Mission Telangana,  MP Etela Rajender, PM Narendra Modi,  Amit Shah, Nitin Nabhi, Delhi BJP Review Meeting, Telangana Politics,Congress Government, CM Revanth Reddy
 

By
en-us Political News

  
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖలు మార్చే అత్యంత ప్రాధాన్యమైన పనుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ఒకటి.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశంలో ఇటీవల చోటుచేసుకున్న జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు, నీట్ పరీక్ష లీకేజీ వివాదాలు దానికి అనుబంధంగా జరిగిన నిరసనలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
దేవాలయాల సాక్షిగా, అమాయక ప్రజల ఆవేదన నడుమ ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న ఓ నిశ్శబ్ద పోరాటం ఇది.
తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల పోరాటం తర్వాత విషాదాంతం..!
అతి స్వల్ప కాలంలోనే విశాఖ రైల్వే జోన్ రికార్డు స్థాయి రాబడి సాధించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ వార్షికంగా 2వేల 493 కోట్ల నికర రాబడిని సాధించడం ద్వారా దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా నిలిచింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటనలో అధికారికంగాప్రకటించింది.
పశ్చిమాసియా రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..ముస్లిం దేశాల ముక్కోణపు వ్యూహం..!
తనను ఒక్కసారి కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారు.
మైనర్లకు వాహనాలు అప్పగిస్తే జరిగే ప్రమా దాలు ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయో మరో ఘటన చాటిచెప్పింది.
దళపతి విజయ్ కుటుంబంలో బిగ్ ట్విస్ట్..!
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పార్సిగుట్టలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ రసాభాసకు దారితీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.