అవకాశాల గనిగా భారత్...త్వరలోనే రివర్స్ మైగ్రేషన్ : చంద్రబాబు

Publish Date:Mar 7, 2026

Advertisement

 

అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా భారతీయులు కనిపిస్తారని ఆయన స్పష్టం చేశారు. టెక్నాలజీ, టెలి కమ్యూనికేషన్స్ లాంటి సంస్కరణల్ని మొదటగా అందిపుచ్చుకోవటం వల్లే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి వివరించారు. ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల  మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో సాంకేతికత - సుపరిపాలన - భవిష్యత్తు అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు. సహకార సమాఖ్య దేశంగా కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని సీఎం వివరించారు. 

 


ఐటీలో భారతీయుల పరిజ్ఞానం అందరికీ తెలిసిందేనని .. డిప్లొమసి, ఫ్లెక్సిబిలిటీ విషయాల్లో వారికి మంచి పేరు ఉందని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు భారత్ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. నైపుణ్యం, వనరులు ఉన్న చోటుకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మేర జీసీసీలు భారత్ కు వచ్చాయన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా భారత్ దూసుకెళ్తోందని తెలిపారు. భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ ను భారత్ ఎగుమతి చేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అప్పుడు కుటుంబ నియంత్రణ-ఇప్పుడు జనాభా నిర్వహణ

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా  అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోందని.. ఆ ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే జాగ్రత్త పడుతున్నామని సీఎం వివరించారు. భారత్ లోని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 1.5 ఫెర్టిలిటీ రేటును 2.1 గా తీసుకెళ్లేందుకు పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని తీసుకువచ్చామని  సీఎం తెలియచేశారు. ప్రజాప్రతినిధిగా 30 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం చేసి ఇప్పుడు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి చర్చిస్తున్నామని తెలిపారు. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.

 

 

 

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఏజింగ్ సమస్యను ఎదుర్కొంటున్న దేశాలు జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. మూడో బిడ్డ పుడితే రూ.25 వేల ఆర్థిక సాయం, నెల వారీగా రూ. వెయ్యి అందించాలని నిర్ణయించామని చెప్పారు. చైల్డ్ కేర్ లీవ్‌లాంటి ప్రోత్సాహకాలు ఆలోచిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించే సామర్ధ్యం భారత్ కు మాత్రమే ఉందని అన్నారు. 

 

 

వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఇప్పుడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గతంలో ఉన్న పెద్ద కుటుంబాలు దేశానికి పెద్ద ఆస్తి అని.. ప్రస్తుతం అవి మైక్రో ఫ్యామిలీలు గా మారాయన్నారు. ఈ విషయంలో ప్రజల దృష్టి కోణం మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు. 

 అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్

విభిన్నంగా ఆలోచన చేసే వారి కోసం అమరావతిలో క్రియేటివ్ సిటీ నిర్మిస్తున్నామని.. డ్రోన్ సిటీ, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ సిటీలను కూడా నిర్మిస్తున్నామని అన్నారు. సమీప భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు రానున్నాయని.. గతంలో ఊహగానే ఉన్న డ్రోన్ అంబులెన్సులు కూడా రియాలిటీలోకి వచ్చేశాయన్నారు. ఏఐ డేటా సెంటర్లతో ఏపీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ డెస్టినేషన్ గా ఏపీ తయారవుతుందని అన్నారు. మెరుగైన సదుపాయాలతో వ్యాపార అనుకూల ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దామని.. పెట్టుబడులతో వస్తే జాప్యం లేకుండా అనుమతులు ఇస్తున్నట్టు పేర్కోన్నారు. 

 

 

అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సహా 110 దేశాల నుంచి 2700 మందికి పైగా ప్రతినిధులు,  మేధావులు, నిఫుణులు, వ్యూహకర్తలు హాజరయ్యారు. 2016 నుంచి జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ సదస్సుకు తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిర్వాహకులు ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఈ రైసినా డైలాగ్ కు హాజరై తన అభిప్రాయాలను వివరించారు.

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.