రాహుల్ గాంధీ మరీ ఇంత పిరికి వాడా?

Publish Date:Jul 31, 2014

Advertisement

 

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు నట్వర్ సింగ్ ఆత్మకథ పుస్తకం విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. ఈ పుస్తకంలో ఉన్నాయని చెబుతున్న అంశాలు ఎంతో ఆసక్తికరంగా వుండటమే కాకుండా కాంగ్రెస్ నాయకులకు కోపం తెప్పించేలా వున్నాయి. ఆల్రెడీ నట్వర్ సింగ్ పుస్తకంలోని విషయాల మీద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను కూడా తన ఆత్మకథ రాసినప్పుడు అసలు నిజాలు బయటపెడతానని ఉక్రోషంగా ప్రకటించారు. నట్వర్ సింగ్ పుస్తకం విడుదలకు ముందే ఇంత సంచలనం సృష్టించింది. పుస్తకం విడుదలయ్యాక పరిస్థితి ఎలా వుంటుందో తలుచుకుంటేనే భలేగా వుంది.

 

నట్వర్‌సింగ్ ఆత్మకథ పుస్తకంలో వెల్లడి అయిన విషయాలన్నిటీలో చాలా ఆసక్తికరంగా వున్న విషయం, సోనియాగాంధీ ప్రధానమంత్రి కాకుండా రాహుల్ గాంధీయే ఆపాడనే విషయం. సోనియాగాంధీ ప్రధానమంత్రి అయితే తన నానమ్మ ఇందిరమ్మలా, తండ్రి రాజీవ్ గాంధీలా తల్లి కూడా హత్యకు గురవుతుందని రాహుల్ భయపడ్డాడట. ఈ విషయంలో రాహుల్ మరీ పట్టుదలగా వ్యవహరించి తన తల్లి దేశానికి ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నాడట. నట్వర్ సింగ్ చెప్పినదాని ప్రకారం చూస్తుంటే రాహుల్ గాంధీ పరమ పిరికివాడన్న విషయం అర్థమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. మొన్నీమధ్య ముగిసిన ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ తన నాయనమ్మ చావు గురించి, తండ్రి చావు గురించి ప్రస్తావించి, తనను కూడా చంపేసే అవకాశం వుందని బేలగా మాట్లాడి ఓట్లు పొందాలని చూశాడు. అప్పుడే రాహుల్ గాంధీ పిరికితనం దేశానికి తెలిసిపోయింది. ఇప్పుడు నట్వర్ సింగ్ పుస్తకంతో ఆ విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. అయినా సోనియాగాంధీ ప్రధానమంత్రి అయితే హత్యకు గురవుతుందని రాహుల్ గాంధీ బుర్రకి ఎందుకు అనిపించిందో ఏంటో!

 

సోనియాగాంధీని ఎవరైనా చంపదలుచుకుంటే ప్రధానమంత్రి కాకపోయినా చంపుతారు. 2004 తర్వాత ఆము ప్రధానమంత్రి పదవిని చేపట్టకపోయినప్పటికీ, మన్మోహన్‌సింగ్‌ని అడ్డం పెట్టుకుని డిఫాక్టో ప్రధానమంత్రిగా పదేళ్ళపాటు రాజ్యం చేశారు కదా! సోనియాని చంపాలని ఎవరైనా అనుకునే పక్షంలో ఇలా పదేళ్ళు డిఫాక్టో ప్రధానిగా ఉన్నందుకయినా చంపుతారు. మరీ అంత చంపేస్తారని భయం ఉన్నప్పుడు రాహుల్ తన తల్లిని రాజకీయాల్లో ఉంచకుండా ఇంట్లోనే ఉంచేస్తే సరిపోయేదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనియా గాంధీ ప్రధానమంత్రి అయితే చంపేస్తారని రాహుల్ గాంధీ భయపడ్డాడు. మరి రాహుల్ గాంధీ తానే స్వయంగా ప్రధానమంత్రి అవ్వాలని కలలు కన్నాడే.. అప్పుడు తనను కూడా చంపేస్తారేమోనని భయం వేసి వుండాలి. అంత భయం వేసినా దేశం కోసం ఆయన ప్రాణాలకు తెగించి అయినా ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని అనుకుని వుండాలి. ఇదంతా ఇలా వుంటే, రాహుల్ గాంధీ తన పిరికితనంతో దేశానికి ఎలాంటి సందేశం ఇచ్చాడు? ప్రధానమంత్రి పదవి చేపడితే ప్రాణభయం వుంటుందని చెప్పకనే చెబుతున్నాడు. ఇది సమర్థనీయమైన అంశం కాదు. రాహుల్ గాంధీ తాను పిరికిగా ఆలోచించడమే కాకుండా.. దేశానికి కూడా పిరికిమందు నూరిపోసే ప్రయత్నం చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.