జగన్ ఫ్రస్ట్రేషన్ లో బ్యాలెన్స్ తప్పేశారా?
Publish Date:Jul 15, 2026
Advertisement
తప్పు ఒప్పు లేదు.. ఉచ్ఛం, నీచం లేదు... చట్టం, రాజ్యాంగం పట్టదు.. పాపం పుణ్యం అసలే లేదు. కావలసింది ఒక్కటే మరోసారి అధికారం దక్కించుకోవడం. అందుకోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కనీ అంతిమ లక్ష్యం అధికారమే. మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా సిద్దపడుతున్నారు. 2019 గత ఎన్నికలలో బాబాయ్ హత్య, కోడికత్తి లాంటి ఎన్నో డ్రామాలను రక్తి కట్టించిన జగన్ కు 2024 ఎన్నికలలో గులకరాయి వంటి ఎత్తుగడలు వికటించాయి. ఇక ఇప్పుడు 2029 ఎన్నికలలో విజయంపై జగన్ కుఇప్పటి నుంచే భయాలు పట్టుకున్నాయి. ఆ భయంతోనే జగన్ లో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఆయన తాజాగా విశాఖ పట్నం పర్యటనలో మాట్లాడిన మాటలనే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. సరే సముద్రంలో బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి.. తాను అధికారంలోకి రాగానే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చేశారు. అక్కడితో ఆగకుండా.. బోటు ప్రమాదానికీ, ఆ ప్రమాదంలో మత్స్యకారులు మరణించడానికి చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం, నిర్వాకమే కారణమంటూ విమర్శలు గుప్పించేశారు. సాధారణంగా జగన్ ప్రభుత్వంపై చేసే విమర్శలన్నీ ఆవు కథలాగే ఉంటాయి. అవి పక్కన పెడితే.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు. బైక్ యాక్సిడెంట్ చేసి ఓ నిరుపేద వ్యక్తి మరణానికి కారణమవ్వడమే కాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అసలు సంబంధం లేని మరో యువకుడిని నిందితుడిగా ఇరికించే ప్రయత్నం చేసి... ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాతే నిందితుడు సిదిరి అప్పలరాజు కుమారుడు పోలీసులకు లొంగిపోయాడు. అటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ.. 18 ఏళ్ల పిల్లోడిపై కేసు పెట్టడం తప్పు అన్నట్లుగా జగన్ మాట్లాడటం రాజకీయ పరిశీలకులనే కాదు, సామాన్య జనాలను కూడా విస్మయపరుస్తోంది. ఈ కేసులో నిందితుడిని వెనకేసుకురావడం ద్వారా చట్టం ముందు అందరూ సమానులే అనే ప్రాథమిక సూత్రాన్ని జగన్ రెడ్డి విస్మరించారు. నిందితుడు తమ పార్టీ నేత కుమారుడైనందున.. ఈ ప్రమాదంలో చనిపోయిన ఒ గొర్రెల కాపరి ప్రాణానికి అసలు విలేవే లేదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తికి చట్టాలపై కనీస అవగాహన లేకపోవడం, లేదా తెలిసి కూడా తప్పుడు కేసులను సమర్థించడం చూస్తుంటే ఆయన మైండ్ సెట్ ఎలాంటిదో అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయంటున్నారు. Sidiri Appalaraju, Son, Accident, Defend
http://www.teluguone.com/news/content/jagan-lost-his-balance-out-of-frustration-45-226063.html




