పెళ్లికి ఒప్పుకునే ముందు అబ్బాయిలను ఈ విషయాలు తప్పకుండా అడగాలి..!

Publish Date:Mar 11, 2026

Advertisement

వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం.  అటు ఏడు తరాలు,  ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది.  పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది.  అబ్బాయి విషయంలో అయినా, అతని కుటుంబం పరంగా అయినా, ఆర్థిక విషయాలు అయినా.. ఏ సమస్య వచ్చినా అమ్మాయిలు ఎక్కువ ఇబ్బందుల పాలవుతారు.

ఒకప్పుడు సమస్య వస్తే.. సర్దుకుపోవాలని అనుకునేవారు అమ్మాయిలు. కానీ.. నేటికాలంలో అలా లేదు.. సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు ముఖ్య కారణం.. అబ్బాయిలు, అతని కుటుంబ సభ్యులు అయినప్పుడు ఆమె వారిని ఎదిరించడానికి సిద్దపడుతోంది, ప్రశ్నిస్తోంది,  కానీ ఒత్తిడి అనుభవించేది కూడా అమ్మాయిలే. ఈ గొడవలు ఏమీ లేకుండా వివాహం తర్వాత జీవితం బాగుండాలంటే.. పెళ్లికి ఒప్పుకోవడానికి ముందు ప్రతి అమ్మాయి చేసుకోబోయే అబ్బాయిని అడగవలసిన ప్రశ్నలు కొన్నిఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే..

కెరీర్ లక్ష్యం..

 సంబంధం ఫైనల్ కాబోతుంటే లేదా ఇప్పటికే ఫైనల్ అయి ఉంటే,  కాబోయే భర్తను అతని కెరీర్ లక్ష్యాల గురించి అడగాలి. దీని గురించి ముందుగానే చర్చించడం మంచిది. అతను తన కెరీర్ గురించే కాదు.. అమ్మాయి  కెరీర్‌కు మద్దతు ఇస్తాడా?  లేదా.. ఈ విషయాలు ముందే మాట్లాడటం మంచిది.  ఎందుకంటే వివాహం తర్వాత కెరీర్ ను పక్కన పెట్టి ఇంటిని చూసుకోమని చెప్పేవారు చాలా ఎక్కువమంది ఉంటారు.

డబ్బు..

డబ్బు గురించి మాట్లాడితే.. ఈ అమ్మాయి మనీ మైండెడ్ అని ఎవరైనా అనుకుంటారేమో అని వెనకడుగు వేసే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. కానీ పెళ్లి తర్వాత జీవితంలో చాలా వరకు డబ్బు కారణంగా గొడవలు వస్తుంటాయి.  కాబోయే భర్తతో ముందుగానే డబ్బు నిర్వహణ గురించి చర్చించాలి. అతను డబ్బును ఎలా తెలివిగా ఆదా చేస్తాడో, అతను అప్పుల్లో ఉన్నాడా లేదా  అనే విషయాలు మాట్లాడాలి. అంతేకాదు.. ఇద్దరూ కలిసి ఇంటిని  ఎలా మెయింటైన్  చేస్తారనే విషయం కూడా చర్చించాలి.

లైఫ్ స్టైల్..

సంబంధాన్ని నిర్ధారించుకునే ముందు అతని జీవనశైలి గురించి ప్రశ్నలు అడగాలి.  భర్త జీవిత లక్ష్యాలను ప్రతి అమ్మాయి అడిగి  తెలుసుకోవాలి. అతనికి ప్రయాణం చేయడం ఇష్టమా? అతనికి సినిమాలు చూడటం ఇష్టమా?  రోజును ఎలా మలచుకుంటాడు.. ఇవన్నీ చర్చిస్తే.. వీటి సమాధానల మీదే అతని వ్యక్తిత్వం కూడా స్పష్టంగా తెలుస్తుంది.

పర్సనల్ సేవింగ్స్..

సంబంధం ఇక ఖాయం అనుకున్నప్పుడు వారితో వ్యక్తిగత పొదుపు గురించి చర్చించాలి.  వారి భవిష్యత్తు ప్రణాళికలను కూడా ముందుగానే తెలుసుకోవాలి. వారి ప్లానింగ్స్ ప్రకారమే భార్య భవిష్యత్తు అతనితో ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలుస్తుంది. దీని వల్ల ఏవైనా సమస్యలు ఉంటే ముందే పరిష్కారమవుతాయి.

లోన్ లు,  అప్పులు..

 కాబోయే భర్తకు ఏవైనా అప్పులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. అతని కుటుంబానికి ఏవైనా పెద్ద అప్పులు ఉన్నాయా లేదా బ్యాంక్ లోన్లు వంటివి ఉన్నాయా  అని కూడా ముందుగానే అడగాలి.

పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందే అమ్మాయిలు కాబోయే భర్తను అడిగి క్లియర్ చేసుకుంటే వివాహం తర్వాత జీవితం చాలా వరకు సంతోషంగా గడిచిపోతుంది.

                                       *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక...
ప్రపంచ దేశాలలో చాలా ఆనందంగా ఉండే ప్రజలుగా జపనీయులను చెబుతారు.  వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు.  వారి ఆరోగ్యం,  వారి సంతోషం వారి ముఖంలోనూ, వారి శరీరాకృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది...
ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి...
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు...
వేగంగా మారుతున్న  జీవనశైలి,  డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది...
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా...
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం...
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది...
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.