రాణి చీమలకు విదేశాల్లో భారీ డిమాండ్

Publish Date:Mar 14, 2026

Advertisement

 

శాస్త్రీయంగా మెస్సార్ సెఫలోట్స్ గా పిలిచే రాణి చీమలకు యూరప్, ఆసియా దేశాల్లో భారీగా డిమాండ్ పెరుగుతోంది. వీటిని అక్కడ చాలామంది పెంపుడు జంతువుల్లా పెంచుకోవడం ట్రెండ్‌గా మారింది. ఈ విషయాన్ని గత ఏడాది కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్  హెచ్చరించింది.

చీమలను అక్రమంగా తరలించే ప్రయత్నంలో ఝాంగ్ అనే వ్యక్తి వాటిని ప్రత్యేకంగా టెస్ట్ ట్యూబ్‌లలో పెట్టి తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని చీమలను టిష్యూ పేపర్ రోల్స్‌లో దాచిపెట్టి తన బ్యాగులో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రాసిక్యూటర్ అలెన్ ములామా కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, ఝాంగ్ బ్యాగులో మొత్తం 1,948 చీమలు ప్రత్యేక ట్యూబ్‌లలో సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. అదనంగా మరో 300 చీమలు మూడు టిష్యూ పేపర్ రోల్స్‌లో దాచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో మరింత ఆధారాలు సేకరించేందుకు నిందితుడి ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది.కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్‌కు చెందిన సీనియర్ అధికారి డంకన్ జుమా తెలిపారు. కెన్యాలోని మరికొన్ని పట్టణాల్లో కూడా చీమలను సేకరిస్తున్న గ్యాంగ్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందన్నారు.

ఇక గత ఏడాది మేలో వేల సంఖ్యలో రాణి చీమలను అక్రమంగా దేశం బయటకు తరలించే ప్రయత్నం చేసిన కేసులో నలుగురికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా 7,700 డాలర్ల జరిమానా విధించింది కెన్యా కోర్టు. కెన్యాలో ఇలాంటి కేసులో ఇది మొదటి తీర్పు. ఆ నలుగురిలో ఇద్దరు బెల్జియం దేశస్తులు, ఒకరు వియత్నాం వ్యక్తి కాగా మరొకరు కెన్యాకు చెందినవారు. తమపై వచ్చిన ఆరోపణలను వారు కోర్టులో అంగీకరించారు. ఇది నిఘా వర్గాల సమన్వయంతో చేసిన ప్రత్యేక ఆపరేషన్ అని కేడబ్ల్యూఎస్ వెల్లడించింది.

అయితే ఈ అరుదైన చీమలను తమ హాబీ కోసం మాత్రమే సేకరించామని, ఇది చట్టవిరుద్ధమని తమకు తెలియదని బెల్జియం వ్యక్తులు కోర్టులో తెలిపారు. నిపుణుల ప్రకారం, ఈ రకమైన చీమలు ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి లేకపోతే జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

దర్యాప్తు అధికారుల ప్రకారం, ఈ అక్రమ రవాణా గ్యాంగ్‌కు ప్రధాన నిర్వాహకుడు ఝాంగ్ అని అనుమానిస్తున్నారు. గత ఏడాది మరో పాస్‌పోర్ట్ ఉపయోగించి ఆయన కెన్యా నుంచి తప్పించుకున్నట్టు సమాచారం.ఇటీవల ఝాంగ్‌ను ఐదు రోజుల కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కేసుపై దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. సింహాలు, ఏనుగుల వంటి పెద్ద జంతువుల సంరక్షణకు పేరుగాంచిన కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్, గత ఏడాది ఈ కేసులో వచ్చిన తీర్పును చరిత్రాత్మక నిర్ణయం గా అభివర్ణించింది.


 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు.
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఏర్పడిన ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆధునికి సాంకేతిక యుద్దాల్లో కీలక పాత్ర పోషించ ఆత్మాహుతి డ్రోన్లు భారత్ ఆర్మీ అమ్ములపొదిలో చేరాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను అరెస్ట్ చేసేందుకు అస్సాం పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం.
పచ్చటి రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ నిర్మించిన ఈ విలాలవంతమైన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ సబ్ కమిటీ తాజాగా భేటీ అయ్యింది. ఈ భేటీలో విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను కేవలం ఎగ్జిబిషన్ లా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విధంగా తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతానికి, ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్ననేపథ్యంలో హుర్ముజ్ ప్రావిన్స్‌ సమీపంలోని సరిహద్దుల వద్ద ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు తమ దేశ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికాకు చెందిన మానవరహిత నిఘా విమానాన్ని ( గుర్తించి, తక్షణమే కూల్చివేసాయి. అందుకు సంబంధించి ఆ విమాన శిధిలాల ఫుటేజీని ఇరాన్ అధికారికంగా విడుదల చేయడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. గత కొంతకాలంగా అమెరికా ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే.
మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.