Publish Date:Feb 18, 2026
తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ శ్రీపాద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించి, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా క్షమించరాని నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు లేఖ రాశారు.
కల్తీ నెయ్యి సరఫరా చేసి మహా పాపానికి ఒడిగట్టిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ఆయనా లేఖలో కోరారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించే లడ్డూ ప్రసాదంలో గతంలో కల్తీ పదార్థాలు ఉపయోగించారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాని ఆ లేఖలో పేర్కొన్న సుభుదేంద్ర స్వామి, కోట్లాదిమంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని మహా అపరాధమన్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రంగా ఉన్న మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతిగా.. ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయనా లేఖలో పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/punish-responsible-for-adultrated-ghee-in-laddu-prasadam-36-214278.html
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.