Publish Date:Feb 18, 2026
గంజాయి కలిపిన పాల విక్రయాలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ బేగంబజార్ ప్రాంతంలో ఈ గంజాయి పాల విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సాధారణ పాల విక్రయాల ముసుగులో నిషేధిత గంజాయి ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సాధారణ పానీయం తరహాలో అధికారుల కళ్లు గప్పి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
పాలల్లో గంజాయి చాక్లెట్స్ కలిపి వినియోగదారులకు విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్ శర్మను పోలీసులు మంగళవారం (ఫిబ్రవరి 17) అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం నిందితుడు గంజాయి పదార్థాలను చాక్లెట్ రూపంలో తయారు చేసి వాటిని పాలలో కలిపి విక్రయించడం ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో మొత్తం 1,920 గంజాయి చాక్లెట్స్ బయటపడ్డాయి. ఈ చాక్లెట్స్‌ను అక్రమంగా నిల్వ చేసి భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దృష్టి సారించారు. నిందితుడికి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరికి సరఫరా చేశాడనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sale-of-milk-laced-with-marijuana-36-214279.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.