పుదుచ్చేరికి రాష్ట్ర హోదా... రంగస్వామి ముందు పెను సవాలు

Publish Date:May 4, 2026

Advertisement

 

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్రహోదా కల్పించే గురుతరబాధ్యత ఆయనకు  ఈ సారి పెను సవాల్‌గా మారనుంది. ఆయన గతంలో 2001 నుండి 2008 వరకు రెండు సార్లు, 2011 నుండి 2016 వరకు కాంగ్రెస్ నుంచి  ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన రంగస్వామి  2011లో కాంగ్రెస్ నుండి విడిపోయి ఏర్పడిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సి) అని తన పేరుతో సొంత పార్టీని స్థాపించారు. 

2011 ఎన్నికల్లో ఆయన పార్టీ ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకుని మూడో సారి ముఖ్యమంత్రి అయ్యారు.  2016 ఎన్నికల నాటికి ఏఐడీఎంకేతో తెగ తెంపులు  చేసుకుని ఒంటరిగా పోటీ చేసిన ఏఐఎన్ఆర్‌సి ప్రతిపక్షానికి పరిమితమైంది. 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరిన రంగస్వామి, నాలుగోసారి సీఎం అయ్యారు. 2026 ఎన్నికల్లో అదే భాగస్వామ్యంతో అయిదో సారి సీఎం పీఠం అధిరోహించడానికి సిద్దమయ్యారు. రంగస్వామి పూర్తి పేరు నటేశన్ కృష్ణస్వామి గౌండర్ రంగస్వామి.1950 ఆగస్టు 4న పుదుచ్చేరిలో నటేశన్ కృష్ణస్వామి మరియు పంచాలి దంపతులకు జన్మించారు . 

లా పట్టభద్రుడైన రంగస్వామి ముందు ప్రస్తుతం పెద్ద సవాలే ఉంది. ప్రజలు తనపై ఉంచిన అపార నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రంగస్వామి కూడా పట్టుదలతో ఉన్నారు. అదే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించడం.   కేవ‌లం 30 అసెంబ్లీ స్థానాలున్న ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో ఏం చేయాల‌న్నా.. కేంద్రం నుంచి అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి. దాంతో పుదుచ్చేరి వాసులు కొన్ని ద‌శాబ్దాలుగా పెట్టుకున్న ఆకాంక్ష‌లు పెద్ద‌గా నెర‌వేర‌డం లేదు.  75 ఏళ్ల‌కు పైగా వ‌య‌సున్న రంగ‌స్వామి, నిరాబరంగా జీవిస్తారు. అన్ని సార్లు సీఎం అయినా ఆయన కారు ఎక్కడానికి పెద్దగా ఇష్టపడరు. టూ వీలర్ తానే స్వయంగా నడుపుతూ ప్రజల్లో తిరుగుతుంటారు. అందుకే ఆయన బుల్లెట్ రంగస్వామిగా ప్రజలకు ప్రీతిపాత్రులయ్యారు.  అయితే కీల‌క‌మైన రాష్ట్ర హోదా సాధించే విష‌యంలో రంగ‌స్వామి వెనుక‌బ‌డుతున్నారనే విమర్శలున్నాయి. 

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా దాన్ని ఆయన సాధించలేకపోయారు. గత అయిదేళ్లుగా ఎన్టీఏ భాగస్వామిగా ఉన్న ఆ హోదా తీసుకురాలేక పోయారు. ఆయనపై అదొక్కటే అసంతృప్తి. అయితే.. ఆయ‌న ప్ర‌ధాని మోడీని గ‌త ఐదేళ్ల కాలంలో 35 సార్లు క‌లిసి.. విజ్ఞ‌ప్తి చేయ‌డం.. తాజా ఎన్నికల్లో సానుకూల‌త‌ పెంచింది. ఆ క్రమంలో తాము అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌త్యేక రాష్ట్ర హోదా కల్పిస్తామ‌ని ఎన్టీఏ పెద్దలు ప్రచారంలో హామీ ఇచ్చారు. రంగ స్వామి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. తనపై న‌మ్మ‌కం ఉంటే.. ఈ సారికి మీ ఓటు తనకే వేయాలనిచ ఈ ద‌ఫా హోదా తీసుకువ‌స్తానని శ‌ప‌థం కూడా చేశారు. అదే ఇప్పుడు రంగస్వామి పార్టీకి కలిసి వచ్చింది.  ఇక ఆ పెద్దాయన పుదుచ్చేరికి రాష్ట్రహోదా కల్పించడమే మిగిలి ఉంది

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.