తాటికొండ భైరవగుట్టపై కొత్త రాతి యుగపు ఆనవాళ్లు పరిరక్షించుకోవాలి

Publish Date:Aug 5, 2024

Advertisement

 ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి

భూత్ పూర్ మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కనున్న తాటికొండ భైరవ గుట్ట పై కొత్త రాతియుగపు ఆనవాళ్లను గుర్తించినట్టు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా  సీఈఓ  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.
 భూత్ పూర్ కు చెందిన రామలింగేశ్వర ఆలయ ధర్మకర్త, సత్తూర్ అశోక్ గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన సోమవారం నాడు భైరవగుట్టపై విస్తృతంగా జరిపిన పురావస్తు అన్వేషణలో దాదాపు పదికి పైగా కొత్తరాది యుగపు రాతి గొడ్డలు, సానపెట్టిన రాతి సానెలు ఉన్నాయని, గుట్టపై శిలాయుగపు కొండ చరియ ఆవాసాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. 7 నుంచి 15 అంగుళాల పొడవైన, రెండు నుంచి నాలుగు అంగుళాల వెడల్పు, అంగుళం లోతు గాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, నిర్మాణ సామాగ్రి కోసం రాతిని తీసే క్రమంలో ఇవి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని శివనాగిరెడ్డి సూచించారు. క్రీ.పూ. 4000 సంవత్సరాలకు చెందిన ఈ ఆదిమానవుని ఆనవాళ్లను కాపాడుకొని, భావితరాలకు అందించాలని తాటికొండ గ్రామ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, బంగారు బాలకృష్ణ పాల్గొన్నారని ఆయన చెప్పారు.

By
en-us Political News

  
ఈ ఏడాది మే మొదటి వారంలో తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ పేరులో తెలంగాణ పదం కచ్చితంగా ఉంటుందని కవిత చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆమె.. ఆ పోటీ ఎక్కడ నుంచైనా ఉండొచ్చన్నారు. అయితే తన మొదటి చాయిస్ మాత్రం సిద్దిపేటేనని చెప్పారు.
జైలు నుంచి విడుదల అయిన తరువాత మీడియాతో మాట్లాడిన అంబటి తనదైన శైలిలో వింత వ్యాఖ్యలు చేశారు. జైలు అధికారులు వారి విధులు వారు నిర్వహించారన్నారు. తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలేమీ కల్పించలేదన్నారు. అందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చిన ఆయన జైల్లో భోజనం ఏ మాత్రం బాలేదని చెప్పారు.
ఈ మంత్రివర్గ సమావేశం స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది.
విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వర్తించే ఈ రిజర్వేషన్ ను రద్దు చేస్తూ ముస్లింలకు ఈ కోటా ఇకపై ఉండదని స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలలో 37 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివిధ తేదీలలో ఖాళా అవుతాయి. అలా ఖాళీ అయ్యే స్థానాలలో తెలంగాణ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీల స్థానాలు కూడా ఉన్నాయి.
నెలరోజుల పాటు సాగిన ఈ కిడ్నాప్ హైడ్రామాతో బాధిత కుటుంబం ప్రాణభయంతో వణుకుతూ దాదాపు నెలరోజుల పాటు బందీ జీవితం గడిపింది. చిట్టచివరకు పోలీసులను ఆశ్రయించింది.
పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకూ, అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఏప్రాల్ లో ఎన్నికలు జరగున్నాయనీ, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను మార్చిలో విడుదల చేయనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
కేసీఆర్ కుమార్తె, జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్టు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.
పిటిన్ ను విచారించిన గుంటూరు కోర్టు.. అంబటిని ప్రత్యేక రిమాండ్ ఖైదీగా పరిగణించి, మాజీ మంత్రికి చట్ట ప్రకారం కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.
గ్రూపు మ్యాచుల్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన ఆసీస్ తన చివరి పోరుతో ఒమన్ తో ఈ నెల 20న తలపడనుంది.
బాధ్యత కలిగిన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను ఊహించలేదంటూ త్రిష స్పందనను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన క్లయింట్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నటనకే పరిమితమని, సంబంధం లేని వ్యహహారాల్లో ఆమెను లాగవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
మున్సిపల్ కార్పొరేషన్‌లో తమకే సంఖ్యా బలం అధికంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, నెల్లూరు మేయర్ పదవికి దేవరకొండ శ్రీలతని తెలుగుదేశం ఎంపిక‌ చేసిన విషయం తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.