నకిలీ పోలీసుల కిడ్నాప్.. కుటుంబానికి నెల రోజుల పాటు చిత్రహింసలు

Publish Date:Feb 18, 2026

Advertisement

హైదరాబాద్‌లో నకిలీ పోలీసుల ముఠా మరోసారి  బీభత్సం సృష్టించింది. పోలీసు వాహనం, పోలీసు యూనిఫామ్‌, లాఠీలు, హ్యాండ్‌కఫ్స్‌తో సినీ ఫిక్కీ తరహాలో ఓ కంపెనీ ఎండి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. నెలరోజుల పాటు సాగిన ఈ కిడ్నాప్ హైడ్రామాతో బాధిత కుటుంబం ప్రాణభయంతో  వణుకుతూ దాదాపు నెలరోజుల పాటు బందీ జీవితం గడిపింది. చిట్టచివరకు పోలీసులను ఆశ్రయించింది.

కూకట్‌పల్లికి చెందిన రామచందర్‌రాజు  శ్రీనివాస్ సివిల్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్  సంస్థకు ఎండిగా ఉన్నారు. అదే సంస్థలో ప్రకాష్‌ అనే వ్యక్తి దాదాపు 26 ఏళ్లుగా ఫైనాన్స్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ఆ సంస్థకు కాంట్రాక్ట్ పనులు చేసిన అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు, శివరామరాజులతో రామచందర్‌రాజుకు ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తాయి. అప్పట్లో పరస్పరం సెటిల్‌మెంట్ జరిగినప్పటికీ, మళ్లీ భారీ మొత్తాన్ని వసూలు చేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నాడు రూ.7 కోట్లు వసూలు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసిన నిందితులు, గతంలో నకిలీ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతూ అరెస్టయిన నాగరాజు అలియాస్ కార్తీక్‌ను సంప్రదించారు. అతడు మరో ముగ్గురితో కలిసి నకిలీ పోలీస్ బృందాన్ని తయారు చేసి ఆపరేషన్‌కు తెరలేపాడు.

ప్లాన్‌ ప్రకారం ఈ ఏడాది జనవరి 9న ముందుగా ఫైనాన్స్ మేనేజర్ ప్రకాష్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం ఎండి రామచందర్‌రాజు కుటుంబాన్ని కూడా అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ బందీగా ఉంచారు. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10 వరకు దాదాపు నెలరోజుల పాటు బాధితులను ఏపీలోని ధవలేశ్వరం, హైదరాబాద్‌ సమీపంలోని మొయినా బాద్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు.

ఇప్పటికే బాధితుల నుంచి రూ.20 లక్షలు వసూలు చేసిన నిందితులు, ఇంకా రూ.4 కోట్లు ఇవ్వాలని   బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను హతమారుస్తా మని హెచ్చరించడంతో బాధితులు తీవ్ర భయాందో ళనలకు గురయ్యారు. చివరకు ప్రాణభయంతో కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించారు.ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో శివరామరాజుతో పాటు నకిలీ పోలీసులుగా వ్యవ హరించిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన సూత్ర ధారులుగా భావిస్తున్న అల్లూరి వెంకట సత్యనా రాయణ రాజు, నాగరాజు అలియాస్ కార్తీక్‌తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

By
en-us Political News

  
ఈ ఏడాది మే మొదటి వారంలో తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ పేరులో తెలంగాణ పదం కచ్చితంగా ఉంటుందని కవిత చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆమె.. ఆ పోటీ ఎక్కడ నుంచైనా ఉండొచ్చన్నారు. అయితే తన మొదటి చాయిస్ మాత్రం సిద్దిపేటేనని చెప్పారు.
జైలు నుంచి విడుదల అయిన తరువాత మీడియాతో మాట్లాడిన అంబటి తనదైన శైలిలో వింత వ్యాఖ్యలు చేశారు. జైలు అధికారులు వారి విధులు వారు నిర్వహించారన్నారు. తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలేమీ కల్పించలేదన్నారు. అందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చిన ఆయన జైల్లో భోజనం ఏ మాత్రం బాలేదని చెప్పారు.
ఈ మంత్రివర్గ సమావేశం స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది.
విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వర్తించే ఈ రిజర్వేషన్ ను రద్దు చేస్తూ ముస్లింలకు ఈ కోటా ఇకపై ఉండదని స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలలో 37 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివిధ తేదీలలో ఖాళా అవుతాయి. అలా ఖాళీ అయ్యే స్థానాలలో తెలంగాణ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీల స్థానాలు కూడా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకూ, అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఏప్రాల్ లో ఎన్నికలు జరగున్నాయనీ, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను మార్చిలో విడుదల చేయనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
కేసీఆర్ కుమార్తె, జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్టు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.
పిటిన్ ను విచారించిన గుంటూరు కోర్టు.. అంబటిని ప్రత్యేక రిమాండ్ ఖైదీగా పరిగణించి, మాజీ మంత్రికి చట్ట ప్రకారం కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.
గ్రూపు మ్యాచుల్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన ఆసీస్ తన చివరి పోరుతో ఒమన్ తో ఈ నెల 20న తలపడనుంది.
బాధ్యత కలిగిన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను ఊహించలేదంటూ త్రిష స్పందనను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన క్లయింట్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నటనకే పరిమితమని, సంబంధం లేని వ్యహహారాల్లో ఆమెను లాగవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
మున్సిపల్ కార్పొరేషన్‌లో తమకే సంఖ్యా బలం అధికంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, నెల్లూరు మేయర్ పదవికి దేవరకొండ శ్రీలతని తెలుగుదేశం ఎంపిక‌ చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.