బొత్స‌ను జ‌గ‌న్ నిండా ముంచేశారు!

Publish Date:Aug 5, 2024

Advertisement

ఏపీ రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌కాలం అనుభ‌వం ఉన్న నేత‌ల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఒక‌రు. ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌లో బొత్సకు కూడా భాగ‌స్వామ్యం ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా ఆయ‌న్ను ఎవ‌రూ ఊహించ‌ని విధంగా గ‌ట్టి దెబ్బ‌కొట్టారు. ఓడించి ఇంటికి పంపారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని  శ్మ‌శాన వాటిక అంటూ అవ‌హేళ‌న చేసిన బొత్స‌కు మ‌ళ్లీ అమ‌రావ‌తి గురించి నోరెత్త‌కుండా చేశారు. ఓట‌మి త‌రువాత బొత్స పెద్ద‌గా మీడియా ముందుకు కూడా రావ‌టం లేదు. వ‌చ్చినా నామ‌ మాత్రంగా ప్రెస్ మీట్ పెట్టేసి ముగించేస్తున్నాడు. ఇప్ప‌టికే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర‌ ప‌రాభ‌వంతో ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌బోతుంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న్ను వ‌దిలిపెట్టేలా లేరు.   ఉమ్మ‌డి విశాఖప‌ట్ట‌ణం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బొత్స పేరును ప్ర‌క‌టించారు. పోటీచేసేందుకు ఆయ‌న‌ సిద్ధంగా లేక‌పోయినా జ‌గ‌న్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి  ఒప్పించిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో విశాఖ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ అధినేత   జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. వాస్త‌వానికి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615 ఓట్లు, అధికార కూటమికి 215 ఓట్లు  ఉన్నాయి. ఎన్నిక‌ల‌ ముందు, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఉమ్మ‌డి జిల్లాకు చెందిన చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా స్థానిక సంస్థల శాసనమండలి ఓటర్లే. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బొత్సను పోటీలోకి దింపితే పెద్ద సంఖ్య‌లో వైసీపీని వీడుతున్న ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను క‌ట్ట‌డి చేయొచ్చ‌న్నది జ‌గ‌న్ ఉద్దేశం. కానీ, ఉమ్మ‌డి జిల్లాలోని చాలా మంది వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు బొత్స అభ్య‌ర్థిత్వం ప‌ట్ల తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ బొత్స‌, ఆయ‌న కుటుంబం అనేక ప‌ద‌వులు అనుభ‌వించారనీ, ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పినా మ‌ళ్లీ బొత్స‌కు ఎమ్మెల్సీ అవ‌కాశం ఇవ్వ‌డం ఏమిటని అధిక‌శాతం వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌శ్నిస్తురు‌. దీంతో ఇప్ప‌టికే వంద‌మందికిపైగా స్థానిక సంస్థ‌ల‌కు చెందిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల్లో చేరిపోయారు. మ‌రో 200 మంది తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.   

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచేందుకు బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా తొలుత అంగీక‌రించ‌లేదు‌. అయితే, బొత్స‌ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో ఎలాగైనా బొత్స‌ను ఎమ్మెల్సీ బ‌రిలో నిలిపి పార్టీ మార‌కుండా క‌ళ్లెం వేయాల‌న్నది జ‌గ‌న్ ప్లాన్ గా వైసీపీ నేత‌లు చెబుతున్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇప్ప‌టికే  కేంద్రంలోని కాంగ్రెస్ పెద్ద‌లతో ట‌చ్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాహుల్ గాంధీకి ద‌గ్గ‌ర వ్య‌క్తులుగా ఉన్న కొంద‌రు నేత‌లు కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చి ష‌ర్మిల ఆధ్వ‌ర్యంలో ప‌ని చేయాల‌ని బొత్స‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ కోలుకునే ప‌రిస్థితి లేద‌ని భావించిన బొత్స స‌త్య‌నారాయ‌ణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సాను కూలంగా ఉన్నారని అంటున్నారు‌.

ఈ విష‌యం తెలుసుకున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, బొత్స‌ను బ‌ల‌వంతంగా ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు ఒప్పించారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థే గెలుస్తాడ‌ని తెలుసు. అయినా అన్నీ నేను చూసుకుంటాన‌ని బొత్స‌ను జ‌గ‌న్ బ‌రిలోకి దింపారు‌. జ‌గ‌న్ మాట తీసేయ‌లేక అయిష్టంగానే బొత్స పోటీకి  స‌రే అన్నార‌ని విశాఖ ఉమ్మ‌డి జిల్లా రాజ‌కీయాల్లో టాక్ న‌డుస్తోంది.  

విశాఖ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ను తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దీంతో బొత్సను ఒడించేందుకు తెలుగుదేశం వ్యూహాలు రచిస్తోంది.   సోమ‌వారం సాయంత్రం పల్లా శ్రీనివాస్ నివాసంలో అయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అరకు, పాడేరుకు చెందిన వైసీపీ  ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లపై వారు ఫోక‌స్ పెట్టారు.   ఈ స‌మావేశానికి ఏజెన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజ‌ర‌య్యారు. వారిని నేరుగా అమరావతిలో క్యాంపుకు త‌ర‌లించిన‌ట్లు తెలిసింది. కూట‌మి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరును సీఎం చంద్ర‌బాబు నాయుడు దాదాపు ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. బొత్స అభ్య‌ర్థిత్వంపై అసంతృప్తితో ఉన్న కొంద‌రు వైసీపీ ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు ఇప్ప‌టికే కూట‌మి పార్టీలో చేరిపోయారు. దీంతో.. ప్ర‌స్తుతం కూట‌మి అభ్య‌ర్థికి అనుకూలంగా ఉన్న‌స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల సంఖ్య  500కు చేరిన‌ట్లు తెలుస్తోంది. తాజా ప‌రిణామాల‌తో బొత్స స‌త్య‌నారాయ‌ణ ఓట‌మి దాదాపు ఖాయ‌మైన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

By
en-us Political News

  
ఈ ఏడాది మే మొదటి వారంలో తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ పేరులో తెలంగాణ పదం కచ్చితంగా ఉంటుందని కవిత చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆమె.. ఆ పోటీ ఎక్కడ నుంచైనా ఉండొచ్చన్నారు. అయితే తన మొదటి చాయిస్ మాత్రం సిద్దిపేటేనని చెప్పారు.
జైలు నుంచి విడుదల అయిన తరువాత మీడియాతో మాట్లాడిన అంబటి తనదైన శైలిలో వింత వ్యాఖ్యలు చేశారు. జైలు అధికారులు వారి విధులు వారు నిర్వహించారన్నారు. తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలేమీ కల్పించలేదన్నారు. అందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చిన ఆయన జైల్లో భోజనం ఏ మాత్రం బాలేదని చెప్పారు.
ఈ మంత్రివర్గ సమావేశం స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది.
విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వర్తించే ఈ రిజర్వేషన్ ను రద్దు చేస్తూ ముస్లింలకు ఈ కోటా ఇకపై ఉండదని స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలలో 37 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివిధ తేదీలలో ఖాళా అవుతాయి. అలా ఖాళీ అయ్యే స్థానాలలో తెలంగాణ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీల స్థానాలు కూడా ఉన్నాయి.
నెలరోజుల పాటు సాగిన ఈ కిడ్నాప్ హైడ్రామాతో బాధిత కుటుంబం ప్రాణభయంతో వణుకుతూ దాదాపు నెలరోజుల పాటు బందీ జీవితం గడిపింది. చిట్టచివరకు పోలీసులను ఆశ్రయించింది.
పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకూ, అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఏప్రాల్ లో ఎన్నికలు జరగున్నాయనీ, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను మార్చిలో విడుదల చేయనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
కేసీఆర్ కుమార్తె, జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్టు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.
పిటిన్ ను విచారించిన గుంటూరు కోర్టు.. అంబటిని ప్రత్యేక రిమాండ్ ఖైదీగా పరిగణించి, మాజీ మంత్రికి చట్ట ప్రకారం కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.
గ్రూపు మ్యాచుల్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన ఆసీస్ తన చివరి పోరుతో ఒమన్ తో ఈ నెల 20న తలపడనుంది.
బాధ్యత కలిగిన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను ఊహించలేదంటూ త్రిష స్పందనను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన క్లయింట్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నటనకే పరిమితమని, సంబంధం లేని వ్యహహారాల్లో ఆమెను లాగవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
మున్సిపల్ కార్పొరేషన్‌లో తమకే సంఖ్యా బలం అధికంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, నెల్లూరు మేయర్ పదవికి దేవరకొండ శ్రీలతని తెలుగుదేశం ఎంపిక‌ చేసిన విషయం తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.