Publish Date:Mar 16, 2026
రెండు దశాబ్దాల క్రితం సినీ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసిన నటి ప్రత్యూష మృతి కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడైన సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆయన మీడియా ముందుకు రావడం ఈ కేసును మళ్లీ చర్చనీయాంశంగా మార్చింది.ఈ ఘటన 2002 ఫిబ్రవరి 23న నటి ప్రత్యూష మరియు సిద్ధార్థ్ రెడ్డి కలిసి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగినట్లు వెలుగులోకి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రత్యూష ప్రాణాలు కోల్పోయింది. అయితే సిద్ధార్థ్ రెడ్డి మాత్రం చికిత్సతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అప్పట్లో సినీ పరిశ్రమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రత్యూష మృతి ఆత్మహత్య కాదని, ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ ఆమె తల్లి ఇన్నేళ్లుగా న్యాయ పోరాటం కొనసాగించారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన ట్రయల్ కోర్టు ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సిద్ధార్థ్ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సిద్ధార్థ్ రెడ్డికి అక్కడ కొంత ఉపశమనం లభించింది. హైకోర్టు శిక్షాకాలాన్ని ఐదేళ్ల నుంచి రెండు సంవత్సరా లకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టు ను ఆశ్రయిం చాడు. సుదీర్ఘకాలం పాటు ఈ కేసుపై విచారణ కొనసా గిన తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.అయితే అమెరికా లో ఇన్నేళ్లుగా స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత్‌కు వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. దీంతో రెండు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో కొనసా గుతున్న ప్రత్యూష మృతి కేసు మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pratyusha-death-case-36-215611.html
ఆధునికి సాంకేతిక యుద్దాల్లో కీలక పాత్ర పోషించ ఆత్మాహుతి డ్రోన్లు భారత్ ఆర్మీ అమ్ములపొదిలో చేరాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను అరెస్ట్ చేసేందుకు అస్సాం పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం.
పచ్చటి రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ నిర్మించిన ఈ విలాలవంతమైన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ సబ్ కమిటీ తాజాగా భేటీ అయ్యింది. ఈ భేటీలో
విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను కేవలం ఎగ్జిబిషన్ లా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విధంగా తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతానికి, ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్ననేపథ్యంలో హుర్ముజ్ ప్రావిన్స్ సమీపంలోని సరిహద్దుల వద్ద ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు తమ దేశ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికాకు చెందిన మానవరహిత నిఘా విమానాన్ని ( గుర్తించి, తక్షణమే కూల్చివేసాయి. అందుకు సంబంధించి ఆ విమాన శిధిలాల ఫుటేజీని ఇరాన్ అధికారికంగా విడుదల చేయడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది.
గత కొంతకాలంగా అమెరికా ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే.
మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలకు తమిళనాడుతో విడదీయలేని సంబంధం ఉంది. ఉదయం లేచింది మొదలు పాలు, కూరగాయల వ్యాపారం నుంచి షాపింగ్ వరకు అంతా తమిళనాడు పట్టణాలతోనే ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ నిరంతర తనిఖీలు సామాన్యుడిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
గత సీజన్ తన కెరీర్‌లోనే అత్యంత నిరాశాజనకమైన సమయమన్న అశ్విన్ ఫిట్‌నెస్ పరంగా తాను ఆడే స్థితిలో ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోయాననీ, అందుకే తప్పుకున్నానీ చెప్పాడు. ఐపీఎల్ 2025లో జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నఅశ్విన్.. కేవలం వ్యక్తిగత కారణాలతోనే కాకుండా జట్టు ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తాను తప్పుకోవాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నానన్నాడు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అలాగే.. విమానాశ్రయం సమీపంలోనే ఉన్న ఇరాన్ వైమానిక దళానికి చెందిన కీలక యుద్ధ విమాన స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించింది.
హార్మూజ్ జలసంధి మీదుగా జరుగుతున్న రవాణాకు ఆటంకం కలిగించవద్దని, ఒకవేళ దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే.. ఈ బెదిరింపులను ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు. పైపెచ్చు ట్రంప్ పై సామాజిక మాధ్యమం వేదికగా మీమ్స్, సెటైర్లు గుప్పించింది.
ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ 15 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.25లక్షల కోట్లు భారీ పెట్టుబడి పెడుతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు వేర్వేరు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి, విశాఖ జిల్లాలోని అడవివరం, తర్లువాడ గ్రామాల్లో 600 ఎకరాల భూమి కేటాయించింది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత రద్దైన నోట్ల పోగుపడ్డాయి. కాదు కాదు పేరుకుపోయాయి. కేంద్రం, అలాగే ఆర్బీఐ కూడా వీటి మార్పిడిని అనుమతించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మిగిలిపోయాయి.