అమెరికా బెదరింపులు బేఖాతరు చేసిన ఇరాన్.. పశ్చిమాసియాలో పెచ్చరిల్లిన టెన్షన్

Publish Date:Apr 7, 2026

Advertisement

పశ్చిమాసియాలో   ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ప్రభుత్వం  నిర్ద్వంద్వంగా  తిరస్కరించింది.   45 రోజుల పాటు దాడులు ఆపి శాంతిని నెలకొల్పాలన్న అమెరికా విజ్ఞప్తిని టెహ్రాన్ తోసిపుచ్చడంతో,  యుద్ధం మరింత ముదిరే  పరిస్థితి కనిపిస్తున్నది.  

హార్మూజ్ జలసంధి మీదుగా జరుగుతున్న రవాణాకు ఆటంకం కలిగించవద్దని, ఒకవేళ దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్  హెచ్చరించారు. అయితే..   ఈ బెదిరింపులను ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు.  పైపెచ్చు ట్రంప్ పై సామాజిక మాధ్యమం వేదికగా   మీమ్స్, సెటైర్లు గుప్పించింది. 

ముఖ్యంగా హార్మూజ్ జలసంధి నుంచి క్షేమంగా బయటపడటానికి ట్రంప్ ఇచ్చిన గడువు ముగియడంతో  ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  ఇరాన్ సైన్యం రణక్షేత్రంలో అమెరికా దళాలతో తలపడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.   ఇరాన్ కీలక ఇంధన వనరులపై అమెరికా గురిపెట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.