హైదరాబాద్ నగరంలో మూడు సంవత్సరాల క్రితం నమోదైన హిట్ అండ్ రన్ కేసు మరోసారి సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహా రంలో తాజాగా నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన కుమారుడు రాహెల్ ఇటీవలే దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణకు సహకరిస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌లో భాగంగా విచారణ పూర్తయ్యే వరకు పోలీసుల అనుమతి లేకుండా విదేశా లకు వెళ్లకూడదనే కీలక షరతు కూడా ఉన్నది.
అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే రాహెల్ మళ్లీ దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించడం కేసులో కొత్త అనుమానాలకు తావి చ్చింది. విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
మూడేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేలా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యం లో నిందితుడు విదేశాలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నం కేసుపై మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షించింది.ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారి తీసింది. విచారణలో ఇంకా ఏయే అంశాలు బయటకు వస్తాయో, కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/poliece-stops-rahel-foriegn-tour-36-218780.html
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బరితెగించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన రాజకీయ హింస రోజురోజుకూ ముదురుతోంది.
హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు.
వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఐఎస్ అనుబంధ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వం లో నిందితులు సమన్వయంగా పనిచేశారు. హ్యాండ్లర్ల చేత రాడికలైజ్ చేయబడిన యువతను జిహాద్‌కు మద్దతుగా నియమించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం, నిషేధిత ఆయుధాలు సేకరించడం, బయోటెర్రరిజం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించడం వీరి లక్ష్యం. రిసిన్ అనే అత్యంత ప్రమాదకర జీవ విషాన్ని ఉపయోగించి ఐఎస్ దుష్ట లక్ష్యాన్ని అమలు చేయాలని ప్లాన్ చేశారు. రిసిన్ ఆముదం విత్తనాల్లో సహజంగా లభించే శక్తివంతమైన విషపదార్థం.
గత నెల 14న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్‌ఎంటీ రోడ్డుపై రాకేష్ శర్మ, హరీష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆరుగురు దుండగులు వారిపై దాడి చేసి 7.5 గ్రాముల బంగారు గొలుసు తో పాటు ఒకరి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
రాజస్థాన్ లోని పర్యాటక నగరంఉదయ్ పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్బీ చౌదరి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్ కుప్పకూలింది. అయితే, మధ్య ఓవర్లలో సమీర్ రిజ్వీ 40 నాటౌట్, స్టబ్స్ 38 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.