మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ కోసం పిటిషన్!

Publish Date:Mar 16, 2026

Advertisement

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్ర సంచలనం సృష్టించిన  మొయి నాబాద్‌ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ కోరుతూ  పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో పోలీసులు 11 మందిని అదుపులోకి తీకున్నారు. వారిలో అయిదుగురు డ్రగ్స్ సేవించినట్లుగా పరీక్షల్లో తేలింది.  ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రస్తుతం వారు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.  మరో ఇద్దరికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసి ఇంటికి పంపించారు. మరో ఐదుగురు కి నోటీసు లు ఇచ్చి పంపించారు.  అయితే ప్రస్తుతం చంచల గూడా జైల్లో ఉన్న  ముగ్గురు నిందితులను కస్టడీ లోకి తీసుకొని విచారించి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, డ్రగ్స్ సరఫరా మార్గాలు, ఇతర వ్యక్తుల ప్రమేయం వంటి అంశాలు రాబట్టాలని పోలీసులు  భావిస్తున్నారు. ఇందు కోసం ఈ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.  

By
en-us Political News

  
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్‌లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు మండిపోతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
షరతులకు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ససేమిరా అన్నట్లు తెలిసింది. ముఖ్యంగా అణు చర్చలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయకూడదన్నదే తన ప్రధాన లక్ష్యమని, దీనిపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అణు చర్చలను పక్కన పెట్టి చేసే ఏ ఒప్పందమైనా నిష్ప్రయోజనమని ట్రంప్ అంటున్నారు.
రాష్ట్రంలోని ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను వివరిస్తూ.. క్వింటాల్ మొక్కజొన్న ధర కేవలం రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య మాత్రమే పలుకుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,400 తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని పేర్కొన్న ఆయన ఈ వ్యత్యాసం వల్ల సాగుదారులు పెట్టుబడి కూడా వెనక్కి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితులు బాధితురాలి విద్యా ధృవపత్రాలను మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారని, వాటిని మలేగావ్‌లోని ఒక బృందానికి అందించేందుకు ప్లాన్ చేశారనీ, నిదా ఖాన్ బాధితురాలికి ఇస్లామిక్ సాంప్రదాయాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆమె ఫోన్‌లో మతపరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిందని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తీవ్రమైన గాలుల ధాటికి ట్రాకులపై ఉన్న క్రేన్లు అదుపుతప్పాయి. ఒక క్రేన్ వేగంగా కదులుతూ పక్కనే ఉన్న మరో భారీ క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి ఆ రెండు యంత్రాలు ఒక్కసారిగా కార్మికులు ఆశ్రయం పొందుతున్న షెడ్డుపై కుప్పకూలాయి.
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు పేరాపురం జంక్షన్ వద్ద అదుపుతప్పి రహదారి పక్కన టీ తాగి రోడ్డుపైకి వస్తున్న ఇద్దరు పాదచారులను బలంగా ఢీకొట్టింది. అనంతరం నియంత్రణ కోల్పోయి సమీపంలో పార్క్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు పేసర్లు హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఆది నుంచే ఢిల్లీ బ్యాటర్లపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. హేజిల్‌వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి స్వింగ్ ధాటికి ఢిల్లీ పవర్‌ప్లే ముగియకముందే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు దిశగా పయనించింది.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ చాలామందికి ఉండదు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు
విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.