హర్మూజ్ జలసంధి ఓపెన్.. ఇరాన్ షరతులు.. అమెరికా ససేమిరా

Publish Date:Apr 28, 2026

Advertisement

అమెరికాతో  ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి స్థాపన దిశగా ఇరాన్ ఒక కీలక అడుగు వేసింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామనీ అయితే అందుకు తాము విధించే  షరతులను అంగీకరించాలని పేర్కొంది.  ఒమన్, పాకిస్థాన్ వంటి మధ్యవర్తిత్వ దేశాల ద్వారా ఇరాన్  ఈ ప్రతిపాదనలు చేసింది. 

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి నేతృత్వంలో రూపొందించిన ఈ ప్రణాళికలో ప్రధానంగా , ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన కఠినమైన నౌకా దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయానీ, ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రస్తుతం జరగాల్సిన చర్చలను వాయిదా వేయాలనీ తమ ఈ షరతులకు అంగీకరిస్తేనే హ ర్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలకు అనుమతిస్తామని పేర్కొంది. 

అయితే, ఈ షరతులకు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ససేమిరా అన్నట్లు తెలిసింది. ముఖ్యంగా అణు చర్చలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయకూడదన్నదే తన ప్రధాన లక్ష్యమని, దీనిపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అణు చర్చలను పక్కన పెట్టి చేసే ఏ ఒప్పందమైనా నిష్ప్రయోజనమని ట్రంప్ అంటున్నారు. 

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం ఇరాన్ ప్రతిపాదనలపై అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని కట్టడి చేయకుండా ఎటువంటి ఒప్పందానికి తావులేదన్నారు.  ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, ఈ షరతుల విషయంలో స్పష్టత రాకపోతే హార్ముజ్ జలసంధిపై ప్రతిష్టంభన మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.
 అదలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకూ పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. ఇరాన్‌కు చెందిన రెండు భారీ ఆయిల్ ట్యాంకర్లను అమెరికా దళాలు స్వాధీనం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.  అమెరికా చర్యను ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తూ, ఇది నడిసముద్రంలో జరిగిన సాయుధ దోపిడీ అని  పేర్కొంది.

 హిందూ మహాసముద్రం మీదుగా వెళ్తున్న మెజెస్టిక్ ఎక్స్, టిఫానీ అనే రెండు నౌకలను అమెరికా దళాలు అడ్డగించాయి. ఈ రెండు నౌకల్లో సుమారు 19 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురు ఉన్నట్లు గుర్తించారు. అయితే..  ఈ స్వాధీనం పూర్తిగా చట్టబద్ధమని అమెరికా సమర్థించుకుంది. కోర్టు జారీ చేసిన వారెంట్ల ఆధారంగానే, అక్రమ చమురు నెట్‌వర్క్‌లను అడ్డుకోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ప్రతినిధి స్పష్టం చేశారు.

మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని  అమెరికాపై విరుచుకుపడింది. ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై గరిష్ట స్థాయిలో ఒత్తిడి పెంచాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఇప్పటికే ఇరాన్‌కు సహకరించే కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తన అణ్వాయుధ తయారీ ప్రయత్నాలను విరమించుకుంటామని స్పష్టమైన హామీ ఇస్తేనే చర్చలకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో భద్రతా పరమైన ముప్పు మరింత పెరిగింది. ప్రపంచ చమురు రవాణాకు ఆయువుపట్టుగా ఉన్న ఈ మార్గంలో మళ్లీ దిగ్బంధనాలు మొదలైతే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఇరు దేశాలు తమ పంతాలను వీడకపోవడంతో రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. 

By
en-us Political News

  
హపూర్‌కు చెందిన ఒక యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, పెళ్లి రోజున వరుడు తన స్నేహితులతో కలిసి పూటుగా మద్యం సేవించి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. కనీసం స్టడీగా నడవలేని స్థితిలో పెళ్లివేదికపైకి వచ్చి తూలిపడిన వరుడి తీరు చూసి షాక్ తిన్న వధువు.. క్షణం ఆలస్యం చేయకుండా తనకు ఈ పెళ్లి వద్దని తేల్చి చెప్పేసింది.
రాష్ట్ర స్థాయి కమిటీ మినహా.. ప్రస్తుతం ఉన్న జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేశారు. అంతే కాకుండా పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను సంపూర్ణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగించారు.
పటియాలాలోని శంభు-అంబాలా మార్గంలో రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. గూడ్స్ రైళ్లు ఎక్కువగా ప్రయాణించే ఈ మార్గంలో పేలుడు ధాటికి రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ , రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్‌లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు మండిపోతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలోని ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను వివరిస్తూ.. క్వింటాల్ మొక్కజొన్న ధర కేవలం రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య మాత్రమే పలుకుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,400 తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని పేర్కొన్న ఆయన ఈ వ్యత్యాసం వల్ల సాగుదారులు పెట్టుబడి కూడా వెనక్కి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితులు బాధితురాలి విద్యా ధృవపత్రాలను మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారని, వాటిని మలేగావ్‌లోని ఒక బృందానికి అందించేందుకు ప్లాన్ చేశారనీ, నిదా ఖాన్ బాధితురాలికి ఇస్లామిక్ సాంప్రదాయాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆమె ఫోన్‌లో మతపరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిందని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తీవ్రమైన గాలుల ధాటికి ట్రాకులపై ఉన్న క్రేన్లు అదుపుతప్పాయి. ఒక క్రేన్ వేగంగా కదులుతూ పక్కనే ఉన్న మరో భారీ క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి ఆ రెండు యంత్రాలు ఒక్కసారిగా కార్మికులు ఆశ్రయం పొందుతున్న షెడ్డుపై కుప్పకూలాయి.
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు పేరాపురం జంక్షన్ వద్ద అదుపుతప్పి రహదారి పక్కన టీ తాగి రోడ్డుపైకి వస్తున్న ఇద్దరు పాదచారులను బలంగా ఢీకొట్టింది. అనంతరం నియంత్రణ కోల్పోయి సమీపంలో పార్క్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు పేసర్లు హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఆది నుంచే ఢిల్లీ బ్యాటర్లపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. హేజిల్‌వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి స్వింగ్ ధాటికి ఢిల్లీ పవర్‌ప్లే ముగియకముందే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు దిశగా పయనించింది.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ చాలామందికి ఉండదు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు
విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.