పార్దీబన్ వ్యాఖ్యల వెనుక పవన్?

Publish Date:Mar 16, 2026

Advertisement

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భవిష్యత్ లో ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు అంటూ నటుడు పార్దీబన్ వ్యాఖ్యలకు అందరూ చప్పట్లు చరుస్తూ.. ఈళలు వేస్తే.. పవన్ కల్యాణ్ మాత్రం ఒకింత సీరియస్ గా ముఖం పెట్టారు. ఒకింత అసహనంగా కూడా కనిపించారు. దీనితో పార్దీబన్ వ్యాఖ్యల ఔచిత్యంపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. 

వాస్తవానికి పవన్ కల్యాణ్ ప్రస్తుతం కూటమి ఐక్యత, పటిష్ఠతపై పూర్తిగా దృష్టి సారించారు. మరో దశాబ్దంన్నర పాటు కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలని, ఉంటుందనీ గట్టిగా చెబుతున్నారాయన.   రాష్ట్ర అభివృద్ధి నిరాటంకంగా కొన‌సాగాల‌ంటే కూటమి ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగి తారాలని చెబుతున్నారు.  సీఎం, డిప్యూటీ సీఎం.. అనే ప‌ద‌వులు ముఖ్యం కాదు..   రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యం అన్నది ఆయన ఇన్ టెన్ష‌న్. కాగా ప్రస్తుతం పవన్ జనసేన పార్టీ రాష్ట్రంలోని అధికార కూటమిలో భాగస్వామి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఉన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ధర్మానికి విరుద్ధంగా తనను తాను సీఎం అనిపించుకోవడానికి పవన్ కల్యాణ్ ఇసుమంతైనా సుముఖత చూపడంలేదు.  అయితే సినిమా ఫంక్షన్లలోనూ, సభలలోనూ, పార్టీ సమావేశాల్లోనూ  వ‌క్త‌లు.. పవన్ కల్యాణ్ సీఎం అంటూ చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన అసహనానికి గురౌతున్నట్లు కనిపిస్తోంది. అలాంటి వారికి మ‌నం ఏం చెప్ప‌గలం? అన్న నిర్వేదం పార్దీబన్ వ్యాఖ్యల సమయంలో  ప‌వ‌న్ మొహంలో ప్రస్ఫుటంగా కనిపించింది. 

కేవ‌లం పార్దీప‌న్ అనే కాదు.. హిందుత్వ విష‌యంలో ప‌వ‌న్ ని తీవ్రంగా వ్య‌తిరేకించే స‌త్య రాజ్ కూడా ఎన్టీఆర్ త‌ర్వాత తెలుగులో అంత‌గా స‌క్సెస్ అయిన పొలిటిక‌ల్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణే అంటూ ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలున్నాయి. అయితే వీట‌న్నిటినీ జనసేనాని వినీ విన‌న‌ట్టు వ‌దిలేస్తుంటారు.  బెంగ‌ళూరు వెళ్లిన‌పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ నే సీఎం సీఎం అంటూ  అభిమానులు అరుస్తుంటే.. ఇక్క‌డ ఆంధ్ర న‌డిబొడ్డున కూర్చుని ఒక ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న  వ్య‌క్తి గురించి ఆ  మాత్రం ఎలివేష‌న్లు అసాధారణమేమీ కాదంటారు పరిశీలకులు. భవిష్యత్ సంగతి పక్కన పెడితే.. ఈ ట‌ర‌మ్ లోనే లోకేష్ సీఎం కాబోతున్నార‌న్న చర్చ కూడా జరుగుతోంది. ఈ  నేపథ్యంలో ప‌వ‌న్ సీఎం  అంటూ ఎవరెవరో చేస్తున్న వ్యాఖ్యలకు అర్ధం లేదంటున్నారు.  

ఏది ఏమైనా ప‌వ‌న్ కల్యాణ్ ను మాత్రం సీఎం పదవి  ఎంతో కాలంగా ఊరిస్తూ వ‌స్తోంది. అదలా ఉంచితే.. రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధం లేని, రాష్ట్ర రాజకీయాలతో ఇసుమంతైనా పరిచయం లేని పార్దీబన్ వంటి నటులు పవన్ కల్యాణ్ సీఎం అవుతారంటూ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఎవరున్నారన్నది ప్రశ్నార్ధకం.  పవన్ కల్యాణ్ ఒక పక్క జనసేన  15 ఏళ్ల పాటు కూట‌మిలోనే  ఉంటుందని సందేహాలకు అతీతంగా ప్రకటిస్తున్నారు. అంటే  తెలుగుదేశం, జనసేన, బీజేపీ  కలిసే ఉంటాయని కుండబద్దలు కొడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి పీఠం తెలుగుదేశం ఖాతాలోనే ఉంటుందని ఆయన చెప్పకనే చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే తన అభిమానులు నిరాశ చెందకుండా ఉండేందుకు పవన్ కల్యాణే స్వయంగా రాష్ట్రంతో సంబంధం లేని తమిళనటులతో పవన్ సీఎం అన్న మాట అనిపిస్తున్నారా? అంటూ కొందరు డౌటనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  మ‌రి చూడాలి.. పవన్ సీఎం అంటూ పార్దీబన్ వంటి తమిళనటుల కామెంట్ల వ్యవహారం ఎంత కాలం కొనసాగుతుందో? 

By
en-us Political News

  
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు పేసర్లు హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఆది నుంచే ఢిల్లీ బ్యాటర్లపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. హేజిల్‌వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి స్వింగ్ ధాటికి ఢిల్లీ పవర్‌ప్లే ముగియకముందే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు దిశగా పయనించింది.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ చాలామందికి ఉండదు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు
విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.