పవన్‌తో బీజేపీ రాయబారం

Publish Date:Sep 17, 2016

Advertisement

 

ప్రత్యేక హోదా విషయమై ఎప్పుడైతే బీజేపీ చేయిచ్చిందో అప్పటి నుంచీ పవన్‌ నోటికి పనిచెప్పారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ సెటైర్లతో మొదలుపెట్టి, బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీని ఉతికి ఆరేశారు. పెద్దాయన మోదీ జోలికి పోకపోయినా, ఇంటాయన వెంకయ్యనాయుడుని మాత్రం ఏకిపారేశారు. ఇటు తిరుపతిలోనూ, అటు కాకినాడలోనూ పవన్‌ బీజేపీని ఒక స్థాయిలో చీల్చి చెండాడారు. ఏపీకి ప్రత్యేక హోదా దక్కకపోతే తెలుగువారి ఆత్మగౌరవం మంటగలసినట్లే అన్నంత ప్రచారాన్ని తీసుకువచ్చారు.

 

మొదట్లో పవన్‌ విమర్శలకు బీజేపీ శ్రేణులు కూడా ప్రతివిమర్శలు చేశాయి. వెంకయ్యనాయుడుని విమర్శించినందుకు క్షమాపణలు చెప్పితీరాల్సిందే అంటూ పట్టుపట్టాయి. కెమెరా ముందు కనిపించే అవకాశం లేని నేతల సైతం పవన్‌ని విమర్శించేందుకు ముందుకు వచ్చారు. కానీ పవన్‌ గాండ్రింపుల ముందు వీరి సౌండ్‌ బైట్లు పెద్దగా వినిపించలేదు. అంతేకాదు! పవన్‌ విమర్శలతో తెలుగురాష్ట్రాల్లో బీజేపీకి చేటు జరుగుతోంది అన్న సూచనలు కేంద్రానికి అందాయి. దాంతో కేంద్ర నష్టనివారణకు చర్యలు మొదలుపెట్టినట్లు సమాచారం.

 

చంద్రబాబు ఎలాగూ ప్యాకేజీ మీద ఆశలు వదిలేసుకుని, ఇచ్చిన నిధులతో తృప్తిపడిపోయారు కాబట్టి పవన్‌ని కూడా దారికి తెచ్చుకుంటే మంచిదన్న అభిప్రాయం బీజేపీలో వ్యక్తమవుతోంది. ఇందుకోసం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుని రంగంలోకి దింపినట్లు సమాచారం. నిజానికి పవన్‌ను బీజేపీకి దగ్గర చేసింది సోమ వీర్రాజే. కాబట్టి ఆయన ద్వారానే మళ్లీ చితికిపోయిన బంధానికి అతుకులు వేసేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. ఆ ప్రయత్నాలు ఎంతవరకూ సఫలం అవుతాయో కాలమే చెప్పాలి. ఆ రాయబారమే కనుక సఫలం అయితే పాచిపోయినా సరే, లడ్డూ లడ్డేయే అని తెలుగు ప్రజలకు సర్దిచెప్పే ప్రయత్నం పవన్‌ చేస్తారేమో చూడాలి!

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.