ఓరి మీ ఎలివేషన్‌లో...విజ‌య్ లంచ్ బాక్స్ వెన‌క‌...ఇంత మేట‌రుందా?

Publish Date:May 17, 2026

Advertisement

 

విజ‌య్ ఇంటి  నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది. ఒక సీఎం అంటే ఫుడ్, హెల్త్ ఇత‌ర అలవెన్సుల‌న్నీ ప్ర‌భుత్వ‌మే చూసుకుంటుంది. సాధార‌ణ  ఎమ్మెల్యేకే ఈ వ‌స‌తులుంటాయి. అలాంటిది ఒక ముఖ్య‌మంత్రికి  స‌క‌ల సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తుంది ప్ర‌భుత్వం.

అయితే మోదీ  సూచించిన పొదుపు సూత్రాలు పాటించ‌డంలో భాగమా లేక‌, బేసిగ్గానే విజ‌య్ సినిమాటిక్ డ్రామా  పండించ‌డంలో ఇదొక ఎత్తా?  తెలీదు. కానీ, ఓవ‌రాల్ గా  అయితే విజ‌య్ సీఎంగా కోటు వేసుకోవ‌డం  నుంచి మొద‌లు పెడితే, అసెంబ్లీలో నోట్స్ రాసుకోవ‌డం. ఇప్పుడు చూస్తే లంచ్ బాక్స్ ఇంటి నుంచి తెప్పించుకోవ‌డం వంటివి.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగులు, ఎలివేష‌న్లు బాగా ఎక్కువ‌య్యాయి.

మాములుగా మ‌న  పాల‌కుల విష‌యానికి వ‌స్తే కేసీఆర్, జ‌గ‌న్ కేవ‌లం  ఆహారం  కోసం పెట్టిన మొత్తం గ‌తంలో చాలా పెద్ద చ‌ర్చ‌నీయాంశం. ఇప్పుడు విజ‌య్ ఫుడ్డు  కూడా త‌న సొంత  ఖ‌ర్చులే అన‌డం వెన‌క చాలా పెద్ద అర్ధ‌ముంది.  తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రగతి భవన్‌లో  జరిగిన అధికారిక సమావేశాలు, విందులు, ఆతిథ్య ఖర్చులపై- RTI  ద్వారా కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి.

కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్‌లో వివిధ కార్యక్రమాలు, కలెక్టర్ల సమావేశాలు, ప్రజాప్రతినిధుల విందులు, ఇతర హాస్పిటాలిటీ కోసం సుమారు రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.ఇందులో ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ వంటకాలు,  మాంసాహార విందులతో పాటు  వీఐపీలకు ఏర్పాటు చేసిన ఆతిథ్య ఖర్చులు అత్యధికంగా ఉన్నట్లు ఈ నివేదికలు తేల్చి  చెప్పాయి.

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కేవలం స్నాక్స్, లంచ్ కోసం పెట్టిన ఖర్చుపై ప్రస్తుత అధికార పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ముగ్గురు తిన‌డానికి ఒక మ‌ధ్యాహ్నం డెబ్బై వేల రూపాయ‌లు వ‌చ్చించి లంచ్ తెప్పించుకున్నారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.

జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల ముఖ్యమంత్రి కాలంలో సీఎంఓ పరిధిలో కేవలం  ఎగ్ పఫ్స్  ఇతర స్నాక్స్ కోసమే రూ.3.62 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ నేతలు అధికారిక లెక్కలను చూపిస్తూ విమర్శించారు.

ఈ లెక్కల ప్రకారం ఏడాదికి సగటున రూ.72 లక్షలు, అంటే రోజుకు సుమారు వెయ్యి ఎగ్ పఫ్స్ చొప్పున ఐదేళ్లలో దాదాపు 18 లక్షల పఫ్స్‌లను క్యాంప్ ఆఫీస్‌లో వాడినట్లు ట్రెండింగ్ నెరేటివ్ నడిచింది. దీనిని అప్పట్లో కూటమి నేతలు ఎగ్ పఫ్ స్కామ్ అని కూడా పిలిచారు.

అయితే ఈ ఆరోపణలపై ఆయా ప్రతిపక్ష పార్టీలు ఘాటుగానే స్పందించాయి. ముఖ్యమంత్రి నివాసానికి, కార్యాలయానికి ప్రతిరోజూ వందలాది మంది అధికారులు, విదేశీ ప్రతినిధులు, సందర్శకులు, పార్టీ క్యాడర్ వస్తుంటారని... అది కేవలం సీఎం ఒక్కరే తిన్న ఖర్చు కాదని అంటారు వైసీపీ  లీడ‌ర్లు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు కూడా తన హయాంలో  2014-19 మ‌ధ్య‌ స్నాక్స్, ఆతిథ్యం కోసం రూ.8.5 కోట్లకు పైగా ఖర్చు చేశారని ఎదురుదాడి చేసింది వైసీపీ.

ఇక బీఆర్‌ఎస్ వాదన ఎలాంటిదంటే.. ప్రగతి భవన్‌లో జరిగినవన్నీ అధికారిక సమావేశాలని, రాష్ట్ర ప్రగతి కోసం దేశ విదేశీ ప్రతినిధులకు, అధికారులకు ఇచ్చే ప్రోటోకాల్ ఆతిథ్య ఖర్చులను ఇలా వ్యక్తిగత ఖర్చులుగా చూపించడం రాజకీయ కక్షసాధింపేనని కొట్టిపారేసింది.

మొత్తంగా చూస్తే, ప్రజాధనంతో నడిచే ముఖ్యమంత్రి కార్యాలయాల్లో జరిగే ఈ భారీ ఆతిథ్య ఖర్చులు ఎప్పుడూ అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద రాజకీయ యుద్ధానికి కారణమవుతూనే ఉంటాయి.

మంత్రి నారా లోకేష్ తన 77 విమాన ప్రయాణాలకు గానూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా టికెట్ ఖర్చుల కింద తీసుకోలేదు. అధికారిక పర్యటనలు, పెట్టుబడుల సాధన కోసం చేసిన ప్రయాణాలు, వ్యక్తిగత పర్యటనలు.. ఇలా అన్నింటికీ ఆయన తన సొంత నిధులనే ఉపయోగించారు.

గతంలో వైసీపీ హయాంలో లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన ఆఫీస్ స్నాక్స్, టీ బిల్లుల కింద రూ.25 లక్షలు ప్రజాధనం ఖర్చయిందంటూ వచ్చిన పాత ఆరోపణలపై లోకేష్ అప్పట్లోనే తీవ్రంగా స్పందించారు.

తాజాగా వైఎస్ జగన్ హయాంలో సీఎంఓలో కేవలం ఎగ్ పఫ్స్, స్నాక్స్ కోసమే రూ.3.62 కోట్లు ఖర్చయ్యాయనే నిజాలు బయటకు వచ్చిన తరుణంలో.. లోకేష్ తన విమాన ప్రయాణాలు, ఆహారం, కనీసం తాగే వాటర్ బాటిల్ ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా తనే చూసుకుంటున్నారని టీడీపీ శ్రేణులు ఆర్టీఐ రికార్డులను చూపిస్తూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి.

ఇటీవల లోకేష్ భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి శ్రీలంక వెళ్లినప్పుడు కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రి లగ్జరీ టూర్లు వేస్తున్నారు అని విమర్శించాయి వైసీపీ  శ్రేణులు. అయితే ఆ టూర్‌కు సంబంధించిన ఫ్లైట్ టికెట్లు, హోటల్ స్టే, ఫుడ్ ఖర్చులన్నీ లోకేష్ తన సొంత అకౌంట్ నుంచే కట్టారని, ప్రభుత్వానికి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ  ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పష్టం చేసింది.

రాజకీయాల్లో నాయకులు ప్రభుత్వ ప్రోటోకాల్ కింద‌ ఖర్చులను వాడుకోవడం సర్వసాధారణం. కానీ, లోకేష్ తనపై వస్తున్న రాజకీయ ఆరోపణలకు చెక్ పెట్టడానికి, తన పరిపాలనలో పారదర్శకతను చూపించడానికి.. అధికారిక పర్యటనల ఖర్చులను కూడా తన సొంత జేబు నుండే పెట్టుకుంటున్నారని ఈ అధికారిక లెక్కలు నిరూపించాయి.

ఇలా లోకేష్ ఆల్రెడీ ఈ పొదుపు సూత్రం  పాటిస్తున్నారు. ఇప్పుడు కొత్త‌గా  విజ‌య్ వ‌చ్చి ఈ నిరాడంబ‌ర‌త పాటించ‌డం లేద‌న్న‌ది కొంద‌రి కామెంట్. అయితే విజ‌య్ విష‌యంలో కొస‌మెరుపు ఏంటంటే త్రిష ఆయ‌న‌గారి కోసం ఎలాంటి వంట‌లు చేస్తున్నారు? అవెలాంటి రుచిని క‌లిగి ఉన్నాయి?  వెజ్ వంట‌లా- నాన్ వెజ్ వంట‌లా? అన్న స‌ర‌దాతో కూడిన  సెటైర్లు వేస్తున్నారు కొంద‌రు.


 

By
en-us Political News

  
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.