పవన్ తన శత్రువులకి తానే అస్త్రాలందిస్తున్నాడా?

Publish Date:Jan 27, 2017

Advertisement

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యేక కళ్యాణ్ అయిపోయాడు! అసలు రాష్ట్ర విభజన సమయంలో ఎవ్వరూ పట్టించుకోని ప్రత్యేక హోదాను వెంకయ్య నాయుడు బలంగా ప్రస్తావించారు. ఎలాగో మన్మోహన్ చేత ఒప్పించి హామీ తీసుకున్నారు. తీరా ఇప్పుడు ఆ రోజు ఆయన ప్రయోగించిన మంత్రమే ... ఆయన మీదే తిరగబడుతోంది! ఇచ్చేద్దామంటే హోదా ఇచ్చే పరిస్థితులు ఢిల్లీలో లేవు. ఊరుకుందామంటే అమరావతిలో జనం మర్చిపోయేలా లేరు. ఈ స్థితికి ప్రధాన కారణం , ఒక విధంగా, పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పుకోవచ్చు! పదే పదే హోదా నిప్పుని రాజేస్తున్నాడు జనసేనాని! రాబోయే ఎన్నికల వరకూ ఆయన జనాల్లో వుండటానికి ప్రత్యేక హోదా కంటే లాభసాటి అంశం మరొకటి లేదు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకీ హోదా విషయంలో పవన్ను గట్టిగా ఎదుర్కొనే ఛాన్స్ కూడా లేదు..

 

 

ప్రత్యేక హోదా విషయంలో జగన్ కూడా పవన్ తో పాటూ క్రెడిట్ కొట్టేయాలని తాపత్రయపడుతున్నా సినిమా గ్లామర్ వల్ల పవన్ ఎక్కువ ఎంకరేజ్ మెంట్నే ఎంజాయ్ చేస్తున్నాడు. మీడియా వద్దన్నా పబ్లిసిటీ చేసి పెడుతోంది. యూత్ కూడా అవలీలగా ఆకర్షితులవుతున్నారు. కాని, సమస్యల్లా పవర్ స్టార్ మాటలు, వ్యూహంతోనే వస్తోంది. ఆయన ఏ క్షణం ఏం ట్వీట్ చేస్తాడో, ఎవర్నిటార్గెట్ చేస్తాడో అర్థం కాని పరిస్థితి తయారవుతోంది. పైగా వ్యక్తిగత విమర్శలతో ప్రత్యర్థులకి నోరు తెరిచే మంచి వెసులుబాటు అందిస్తున్నాడు. ఇందుకు ఆయన తాజా ప్రెస్ మీటే ఉదాహరణ...

 

 

పవన్ టీడీపీ ఎంపీ రాయపాటిని ఘాటుగానే విమర్శించాడు. సుజనా  చౌదరిని కూడా టార్గెట్ చేశాడు. వాళ్లు బ్యాంకులకి అప్పులు ఎగ్గొట్టారనీ, తమ వ్యాపార లాభాల కోసం రాష్ట్ర సంక్షేమాన్ని పక్కన పెడుతున్నారని అన్నాడు. దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రాయపాటి తమ సంస్థ బ్యాంక్ లకు అప్పు పడి వుందే తప్ప ఎగ్గొట్టలేదని తేల్చారు. పైగా తమకు కాంట్రాక్ట్ వచ్చింది కాంగ్రెస్ హయంలోనే కానీ, ఎన్డీఏ టైంలో కాదని చెప్పారు. మొత్తంగా పవన్ విమర్శల్ని తిప్పికొట్టి ఆయన్ని కార్నర్ చేశారు. ఇక పవన్ , రామ్  గోపాల్ వర్మల మధ్య కూడా పర్సనల్ వార్ మొదలైంది. ఎప్పుడూ పవన్ గురించి ఏదేదో ట్వీట్ చేసే రాము వైజాగ్ ఆర్కే బీచ్ ఉద్యమానికి ముందు రోజు పవర్ స్టార్ జిందాబాద్ అన్నాడు. తరువాతి రోజు మాత్రం పవన్ ప్రత్యక్షంగా వైజాగ్ కి రానేలేదని విమర్శించాడు. రామూ ఇలా ట్విట్టర్ లో పవన్ని మెచ్చుకోవటం, తిట్టటం కొత్తేం కాదు. కాని, ఈసారి పవన్ వాటిపై స్పందించటమే కొత్త కలకలం రేపింది...

 

 

ఎప్పుడూ వర్మని పట్టించుకోని పవన్ ఈ సారి మాత్రం ఆయన విమర్శలపై స్పందించాడు. కాని, ఆయన వేసిన ప్రశ్నకి జవాబు చెప్పకుండా వ్యక్తిగత అంశాలు మాట్లాడి పవన్ కాస్త పొరపాటే చేశాడు. పెళ్లైన కూతురున్న వర్మ పోర్నోగ్రఫీ చూస్తానని చెబుతాడు. ఆయన గురించి నేనేం మాట్లాడాలి అన్నాడు. ఇలా మాట్లాడటం ఆర్జీవీకి మంచి సందు దొరికేట్టుగా చేసింది. నేను ఆయన మూడు పెళ్లిల్ల గురించి ఎప్పుడూ మాట్లాడలేదంటూనే వర్మ కూడా పర్సనల్ విషయం పరోక్షంగా ప్రస్తావించాడు. ఆయన అలా మాట్లాడటం పూర్తిగా పవన్ చేసిన కామెంట్స్ వల్లేనని అందరూ ఒప్పుకుంటారు. పవన్ రామూ కూతుర్ని, పోర్నోగ్రఫిని చర్చలోకి తేవాల్సింది కాదు!

 

 

పవన్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని , టీడీపీ ప్రభుత్వాన్ని అద్భుతంగా కార్నర్ చేస్తున్నాడు. కాకపోతే, ఆ క్రమంలో ఆయన చేసే కామెంట్స్ జాగ్రత్తగా చేస్తే బావుంటుంది. సాధ్యమైనంత వరకూ వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా వుంటే బెటర్. అలాగే, ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడటం, ఎంతకైనా తెగిస్తాం, వుంటే వుంటాం, పోతే పోతాం లాంటి ఆవేశపూరిత డైలాగ్స్ ఆయన స్థాయిలో వున్న వ్యక్తి నుంచి ఎంతైనా బాగోవు. పవన్ దీర్ఘ కాలం సాగే పంథాలో తనకు ప్రత్యర్థులు అనుకున్న వార్ని ఓపిగ్గా టార్గెట్ చేయాలి. అంతే తప్ప ఎంతగా ఆవేశపడి నోరు జారితే అంతగా ఆయన శత్రువులకి పైచేయి సాధించే అవకాశం దొరుకుతుంది....

By
en-us Political News

  
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.