పవన్ కళ్యాణ్ అమెరికా టూర్... మీడియా లైట్ తీసుకుందా?
Publish Date:Feb 13, 2017
Advertisement
పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటన... ఈ సంగతి మన మీడియా పెద్దగా పట్టించుకుంటున్నట్టు అనిపించటం లేదు! శశికళ, పన్నీర్ సెల్వం తమిళ డబ్బింగ్ సినిమాకి క్రేజ్ బాగా వుండటంతో పవన్ కళ్యాణ్ స్టారర్ అస్సలు పట్టించుకోలేదనిపిస్తోంది! కాని, ఆయన ఇక్కడ లోకల్ గా అనంతపురం సభ, కాకినాడ సభ అంటే భీభత్సమైన రభస చేసే మన వాళ్లు ఈసారి ఎందుకు లైట్ తీసుకున్నారు? సరైనా సమాధానాలైతే లేవనే చెప్పాలి! అయితే, ప్రధాన కారణం ఎక్కడో అమెరికాలో జరుగుతోన్న మీటింగ్ లు కావటంతో కవరేజ్ బాగా కష్టమయ్యే చాన్సెస్ వున్నాయి. అక్కడ్నుంచీ లైవ్ పెట్టుకోవటం అంత ఈజీ కాదు. పైగా ఎలాగో రికార్డింగ్ చేయించి వీడియో క్లిప్పింగ్ లు తెప్పించుకున్నా... పవర్ స్టార్ కామెంట్స్ లో పెద్దగా మసాలా ఏం వుండటం లేదు. దాంతో పెద్దగా కాన్సన్ ట్రేట్ చేయటం లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా! ఛానల్స్ లో , పేపర్స్ లో మరీ ఎక్కువ చర్చ జరగకున్నా సోషల్ మీడియాలో పవనిజం ఫాలోవర్స్ తమకు వీలైనంత హడావిడి చేశారు. ఒక తెలుగు వాడు అమెరికా గడ్డపై ప్రసగించబోతున్నాడని ప్రచారాలు చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ పవన్ కి సపోర్ట్ చేయాలని కూడా అన్నారు. కాని, తీరా పవన్ వరుసగా సభల్లో ప్రసంగిస్తుంటే వారు కూడా పెద్దగా షేరింగ్ లేం చేయటం లేదు! అమెరికా దాకా వెళ్లినా కూడా పవన్ కళ్యాణ్ తన ఎర్ర కండువా వదలకపోవటం కొంచెం డిస్కషన్ కి దారి తీసింది ఫేస్బుక్, ట్విట్టర్ లలో! రెడ్ కలర్ సామాన్యుడికి ప్రతీక అంటూ పవన్ కొత్త నిర్వచనం ఇచ్చాడు. కాకపోతే, అమెరికాలో జరిగే మీటింగ్ కి అలా ఎర్ర గుడ్డ కప్పుకుని వెళ్లటం ఏం స్ట్రాటజీనో రాజకీయ పండితులకి కూడా అర్థం కాలేదు! ఒక మీటింగ్లో ఎర్ర కండువాతో కనిపించిన పవన్ అన్నిట్లో అలా కనిపించలేదు. అంతే కాదు, అమెరికా దాకా వెళ్లి కూడా ఉత్తరాది, దక్షిణాది భేదాల గురించి మాట్లాడాడు. భారతదేశంలో సంస్కృతుల మధ్య తేడాలున్నాయని పవన్ అభిప్రాయపడ్డాడు! అసలు ఇదంతా జరుగుతున్నా ఎవ్వరికీ అర్తం కాని విషయం ఒక్కటే! పవన్ అమెరికా పర్యటనతో ఆశిస్తున్నదేమిటి? ఎన్నారైలలో జనసేన పాప్యులారిటీ పెంచటామా? నిధుల సేకరణా? లేక 2019 ఎన్నికలకి ఇప్పట్నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయటమా? ఇలా బోలెడు ప్రశ్నలు! కాని, దేనికీ ఇప్పటికిప్పుడు సమాధానాలు లేవు! రానున్న ఎన్నికల్లో పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతానని చెప్పిన పవన్ విదేశాల్లోనూ తన ప్రభావాన్ని పెంచుకోవటం సంతోషించాల్సిన విషయమే. కాని, ఇలా మీటింగ్ లలో పాల్గొనటం ఇంచుమించూ మరే భారీతీయ హీరో చేయలేదు. అలాంటిది తాను చేసినా కూడా మీడియాలో తగినంత పబ్లిసిటీ వచ్చేలా చూసుకోకపోవటం ఎంతో కొంత నష్టమే. ఇంకా పవర్ ఫుల్ ప్లానింగ్ చేయాల్సింది పవర్ స్టార్ అండ్ హిజ్ టీమ్!
http://www.teluguone.com/news/content/pavan-kalyan-45-72105.html





