బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కాంగ్రెస్ గేలం? కేటీఆర్ ఆరోపణలు దేనికి సంకేతం?

Publish Date:Feb 16, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాలలో  బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిపోతున్నదా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కాగా బీఆర్ఎస్ ప్రస్థుత పరిస్థితికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీరే కారణమని సోదాహరణంగా చెబుతున్నారు. 2014 నుంచి అంటే తెలంగాణ ఆవిర్భావం నుంచి  వరుసగా పదేళ్ల పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ సమయంలో  ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ గాలం వేసి తమ పార్టీలోకి లాగేసింది. మండలి, అసెంబ్లీలో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులను గంపగుత్తగా పార్టీలో చేర్చుకుని, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా అప్పగించిన సంగతి తెలిసిందే.

అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది. నాడు రైట్ అయిన పద్ధతి, ఇప్పుడు బీఆర్ ఎస్ కు రాంగ్ గా ఎందుకు కనిపిస్తోందంటూ నిలదీస్తోంది. 

తాజాగా జరిగిన మునిసిపోల్స్ లో మునిసిపాలిటీలలో వార్డుమెంబర్లు, కార్పొరేషన్ లలో కార్పొరేటర్ లుగా గెలిచిన బీఆర్ఎస్ వారికి గాలం వేసి మరీ కాంగ్రెస్ గాలం వేస్తోందనీ, గాలానికి చిక్కని వారిని బెదరింపులకు, వేధింపులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి, స్వయానా కేటీఆర్ తండ్రి అయిన కేసీఆర్ చేసినది ఇదేగా అని నిలదీత సామాన్య జనం నుంచే వస్తున్నది. అదే మాట బీఆర్ఎస్ నేతల అంతర్గత సమావేశాల్లో కూడా వినిపిస్తోంది.   

ప్రస్తుతం కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలంగా లేరు.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ పార్టీ శ్రేణులపై పట్టు సాధించడంలో విఫలం కావడమే బీఆర్ఎస్ కార్యకర్తలు పక్క చూపు చూడడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోసం కష్టపడే పరిస్థితి రావడానికి కార్యనిర్వాహక అధ్యక్షుడు పార్టీ సభ్యుల విశ్వాసాన్ని చూరగొనడంలో వైఫల్యాంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. అధికార పార్టీకి అనుబంధంగా కొనసాగడానికి ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు రెడీ అయిపోయినట్లుగా కనిపి స్తున్నది.

 కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక లో తాము తటస్థంగా ఉంటామని కేటీఆర్ అనివార్యంగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.కేటీఆర్ నోట ఆ మాట వెలువడడానికి ముందు.. మేయర్ ఎన్నికలో బీజేపీకి మద్దతు అని ఒకసారి, కాంగ్రెస్ కు మద్దతు అని ఒకసారి ఆ పార్టీ నుంచి వచ్చిన సంకేతాలను తార్కాణంగా చూపుతున్నారు. కేటీఆర్ పార్టీ శ్రేణుల విశ్వాసం చూరగొనడంలో వైఫల్యానికి కారణం క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్ఠతపై దృష్టి పెట్టడం మాని.. కేవలం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై దూకుడుగా విమర్శించి, తన పపైపోయిందన్న చందంగా చేతులు దులిపేసుకోవడమేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తున్నది. 
 

By
en-us Political News

  
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
అంబటి రాజమహేంద్రవరం జైలులో ఉంటే జగన్ కనీసం అటుకేసి కూడా చూడటం లేదు. కేవలం గుంటూరుకే పరిమితమై.. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో సరిపెట్టేయనున్నారు.
పొన్న‌వోలు వాదించ‌డంతో బెయిలుపై బ‌య‌ట‌కు రావ‌ల్సిన అంబ‌టి రాంబాబు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలుకు వెళ్లారు. ఇందుకు పొన్న‌వోలు అత్యుత్సామే కారణమంటున్నారు. కారుమూరి వెంక‌ట‌రెడ్డి విష‌యంలో వెంట‌నే బెయిలు ఇప్పించారు. అదే ఇప్పుడు అంబ‌టి కాపు నేత కావ‌డంతో రిమాండ్ పై పంపించార‌న్న కోణంలో కొన్ని వాదనలు తెరమీదకు వస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.