" సర్దుకు పోవటమా? " నో వే..!!

Publish Date:Sep 22, 2015

Advertisement

ఈ ప్రపంచం లో నాకు నచ్చని ఒకే ఒక్క మాట ." సర్దుకు పోవటం."

 

 

ఈ రోజుల్లో ఎవరిని కదిపినా మనకు వినిపించే మాట ఇది. ఈ స్టేట్మెంట్ తో పాటు కొన్ని అనుబంద ప్రశ్నలు కూడా వేస్తారు..".అసలు ఎందుకు సర్దుకుపోవాలి ? ", నేనే ఎందుకు సర్దుకు పోవాలి ?", అంటూ ఒక పది ప్రశ్నలు అయినా మనమీదకి దూసుకు వస్తాయి..పొరపాటున " సర్దుకోవచ్చు" కదా ! అని మనం సలహా చెప్పగానే . అదేదో వాళ్ళ ఆస్తి రాసి ఇమ్మన్నట్టు , చేయకూడని పని చేయమన్నట్టు చూస్తారు మన వైపు.

 

 

ఎక్కడా , ఎవరి మధ్యా ఈ సర్దుకు పోవటం అన్న ప్రశ్నే లేదు...అది ఏ సంబంధం అయినా కానీయండి., ఇదంతా సరే ..ఈ మద్య అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి చేసుకోవటానికి తెగ ఆలోచిస్తున్నది ...ఎందుకు అంటే ..ఇందుకే..అదేనండి ..ఎక్కడ సర్దుకు పోవాల్సి వస్తుందో అని. ఇద్దరూ సర్దుకుపోవటానికి సిద్దం గా లేరు కాబట్టి , గొడవలు ఎలాగు తప్పవు. ఆ గోలంతా ఎందుకు అసలు పెళ్ళే మానస్తే పోలే ? అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు..దాంతో పాటు  పెళ్లి చేసుకోవటానికి కొన్ని లక్షలు ఖర్చు , ఆ పైన వద్దు అనుకుంటే విడి పోవటానికి మరికొన్ని లక్షలు ఖర్చు, కొన్ని రోజుల ముచ్చటగా మిగిలే దానికోసం ఇంత డబ్బులు వేస్ట్ ఎందుకు? హాయిగా లివింగ్ రిలేషన్ అయతే ..రూపాయి ఖర్చు ఉండదు. నచ్చితే కలసి వుంటాం, లేదంటే బై చెప్పి బయటకి వచ్చేస్తాం. సో సింపుల్ , .అనేస్తున్నారు.

 

బామ్మలు, అమ్మమ్మలు,తాతమ్మలు ముక్కున వేలేసుకున్నా., ఇది మన పద్దతి కాదని మొత్తుకున్నా."సారీ ..ఈ ప్రపంచం లో నాకు నచ్చని ఒకే ఒక్కమాట సర్దుకు పోవటం...అలా పోవాలి అంటే ఏది వదులు కోవటానికి అయినా నేను రెడీ. "అని ఖచ్చితం గా సెల్ పగలు కొట్టి మరి చెబుతున్నారు (కుండ ఔట్ డేటెడ్ అయ్పోయింది కదా ).

 

 

 

అమ్మానాన్నతో సర్దుకు పోలేరు ....ఇల్లు వదిలి వెళ్ళిపోతారు ,
 

అన్నదమ్ములతో సర్దుకు పోలేరు....మాటలు మానేస్తారు.
 

అత్తగారితో సర్దుకు పోలేరు ....వేరు కాపురం పెడతారు.
 

స్నేహితులతో సర్దుకు పోలేరు....టాటా ..బై బై చెప్పేస్తారు.
 

 

భార్యా భర్తలు సర్దుకుపోలేరు...విడాకులు తీసుకుంటారు.
 

ప్రపంచంతో సర్దుకుపోలేరు....ఆత్మహత్య చేసుకుంటారు ..
 

సో సింపుల్...ఏది వదులు కోవటానికి అయినా రెడీ...కాని సర్దుకు పొమ్మని మాత్రం అడక్కండి...

 

...........రమ

By
en-us Political News

  
ఉల్లి, వెల్లుల్లి లేకుండా అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో ఎంతో రుచికరంగా తయారయ్యే సాంప్రదాయ ఆంధ్ర స్టైల్ అల్లం వంకాయ కూర తయారీ విధానం మరియు పూర్తి పదార్థాల కొలతలతో స్టెప్ బై స్టెప్ గైడ్.
పసుపులోని కర్కుమిన్ గుణాలు మొటిమలను తగ్గించి, చర్మానికి సహజ కాంతిని ఎలా ఇస్తాయో తెలుసుకోండి. జీవక్రియలను మెరుగుపరిచే ఉత్తమ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
ఆముదం ఆకులతో మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, గౌట్ సమస్య మరియు గాయాలను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి. పూర్వకాలం నాటి ఈ అద్భుతమైన ఆయుర్వేద సహజ చిట్కాల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ముఖంపై రోజ్ వాటర్ వాడటం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి రోజ్ వాటర్ ఎలా ఉపయోగపతుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.
బెండకాయలు తింటే పిల్లలకు లెక్కలు బాగా వస్తాయనే నమ్మకంలో ఎంత నిజం ఉంది? సైన్స్ మరియు నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు? బెండకాయ వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
జీవితంలో మనం ఎంచుకునే మార్గం, ఎదుర్కొనే సవాళ్లు మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం.
జీవితంలో ఒక్కసారిగా చేతికి డబ్బు రాగానే మనుషుల ప్రవర్తన మారిపోతుంటుంది. రాత్రికి రాత్రే సంపాదించడం మొదలుపెట్టిన చాలామంది కొన్నేళ్లలోనే మళ్లీ మొదటికి వస్తుంటారు.
చైనాలో బరువు తగ్గడం కోసం తొలిసారిగా ఓరల్ జీఎల్పీ 1 మాత్ర ఓర్ఫోగ్లిప్రాన్ ఆమోదం పొందింది. ఎలి లిల్లీ సంస్థకు దక్కిన ఈ చారిత్రాత్మక మైలురాయి, క్లినికల్ ట్రయల్స్ విశేషాలు మరియు భవిష్యత్తు అంచనాల పూర్తి సమాచారం.
వ్యాయామం లేదా శారీరక శ్రమ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? కాలేయం పాత్ర, హార్మోన్ల ప్రభావం మరియు మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి సమాచారం.
చలికాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు, ప్రోటీన్, ఫైబర్ లాభాలు మరియు రోగనిరోధక శక్తిని పెంచే రహస్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
వారానికి ఒక్కసారైనా పార్కులకు వెళ్లడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం ఎంతగా మెరుగుపడుతుందో తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.
క్యాన్సర్ చికిత్సలో వస్తున్న సరికొత్త వైద్య విప్లవాలు మరియు అత్యాధునిక ట్రీట్‌మెంట్ విధానాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
గుండె జబ్బులు ఉన్నవారికి స్టెంట్‌లు లేదా బైపాస్ సర్జరీలు నిజంగా ప్రాణాలను కాపాడుతాయా? 25 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనలో వెల్లడైన సంచలన విషయాలు మరియు వైద్య నిపుణుల హెచ్చరికల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.