నాసిక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌ను నాసిక్ పోలీసులు గురువారం (మే 7) అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆమెను ఛత్రపతి శంభాజీనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి నాసిక్ సెషన్స్ కోర్టు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన రోజుల వ్యవధిలోనే ఈ అరెస్ట్ జరగింది. తాను గర్భిణీనని.. తనకు ఈ కేసుతో పరిమిత సంబంధం మాత్రమే ఉందని పేర్కొంటూ ఆమె బెయిల్ కోసం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆమె బెయిలు పిటిషన్ ను తోసిపుచ్చడంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి ఎ ఆమెను అదుపులోనికి తీసుకున్నారు.
టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో పనిచేస్తున్న కొందరు మహిళా ఉద్యోగినులను ఇస్లాం మతం స్వీకరించాలని నిదా ఖాన్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. హిందూ సంప్రదాయాలను వదిలి ఇస్లామిక్ పద్ధతులను అనుసరించాలని, బుర్కా ధరించాలని ఆమె బాధితులపై ఒత్తిడి తెచ్చారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. నిందితులైన ఇతర పురుష ఉద్యోగుల చేత లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె వారిని అడ్డుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏడుగురి పోలీసులు అరెస్ట్ చేశారు. నిదా ఖాన్ అరెస్ట్‌తో మొత్తం అరెస్టైన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా.. ఈ వివాదంపై గతంలోనే స్పందించిన టీసీఎస్ యాజమాన్యం.. నిదా ఖాన్ తమ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్ కాదని, కేవలం ప్రాసెస్ అసోసియేట్ మాత్రమేనని స్పష్టం చేసింది. ఆమెను ఇప్పటికే విధుల్లో నుంచి తొలగించినట్లు వెల్లడించింది. నిదా ఖాన్ విచారణలో ఈ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nidakhan-arrested-in-nasik-tcs-case-36-219197.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.