ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విజయం సాధించింది. లక్నో స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ కళ్ళు చెదిరే సెంచరీతో ఆకాశమే హద్దుగా విరుచుకుపడటంతో బెంగళూరు చేతులెత్తేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న లక్నో, ఈ విజయంతో తన ప్లేఆప్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు సాధించింది. మిచెల్ మార్ష్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. ఆర్సీబీ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన మార్ష్ కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అతనికి నికోలస్ పూరన్ 38 పరుగులు జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివర్లో కెప్టెన్ రిషభ్ పంత్ కేవలం 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి జట్టు స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. నిర్ణీత 19 ఓవర్లలో లక్నో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆర్సీబీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్దేశించారు.
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. మహమ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ జాకబ్ బెథెల్ ఔటయ్యాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి నేరుగా మిడిల్, ఆఫ్ స్టంప్‌లను గిరాటేయడంతో కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. 2023 ఏప్రిల్ తర్వాత ఐపీఎల్‌లో కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి.
9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ రజత్ పాటిదార్ 61 పరుగులు, దేవదత్ పడిక్కల్ 34 పరుగులూ ఆదుకున్నారు. ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ప్రిన్స్ యాదవ్ విడదీశాడు. పడిక్కల్‌ను కూడా తన బౌలింగ్‌లోనే క్యాచ్ పట్టి ఔట్ చేసిన ప్రిన్స్.. ఆ తర్వాత జితేశ్ శర్మను కూడా పెవిలియన్‌కు పంపాడు. కాసేపటికే పాటిదార్ కూడా ఔట్ కావడంతో ఆర్సీబీ పతనం మొదలైంది. చివర్లో కృనాల్ పాండ్య (28 నాటౌట్), రొమారియో షెపర్డ్ (23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా, దిగ్వేశ్ అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోకు విజయాన్ని అందించాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lsg-defeats-rcb-36-219199.html
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.